Others

ఆపదలో అన్నదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయం నష్టదాయకంగా మారడంతో తమ సమస్యలు తీర్చాలంటూ ఇపుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో రైతులు ఉద్యమబాట పట్టారు. మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన నేపథ్యంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. పంటలకు కనీస మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్న రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడం, దాన్ని అదుపుచేయడం పేరుతో అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఎంత దయనీయమో, అందుకు సమష్టి బాధ్యత వహించాల్సిన సకల పక్షాలూ తమతమ సొంత ఎజెండాలకు అనుగుణంగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం మరింత దయనీయం.
మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళనలు నానాటికీ తీవ్రరూపం ధరిస్తున్నాయి. బంద్‌లు, రాస్తారోకోలతో అక్కడక్కడ శాంతిభద్రతల పరిస్థితి విషమిస్తోంది. మిగతాచోట్ల ఆ స్థాయిలో రైతులు ఆందోళనాపథం పట్టకపోయినంత మాత్రాన దేశమంతా రైతు పరిస్థితి బాగున్నట్టుకాదు. వేసిన పంట వేరు కావొచ్చు. కానీ చేతికి అందే ఫలం అందరిదీ ఒకటే. దేశమంతా ప్రస్తుతం రైతు బతుకు రోడ్డునపడే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల ఆందోళన ఈమధ్యనే ముగిసింది. ఈ రెండు రాష్ట్రాలూ రైతు ఆత్మహత్యల నమోదులో ముందు వరుసలోనే ఉన్నాయి.
దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయ రంగం అధిక జనాభాకు ప్రధాన వృత్తి. పెద్దనోట్ల రద్దు వల్ల స్థూల జాతీయోత్పత్తి మరీ దిగజారకుండా వ్యవసాయ రంగమే కాపాడినట్టు తాజా లెక్కలు నిరూపిస్తున్నాయి. ఈ రంగాన్ని సరైన తీరులో నడిపిస్తే అటు రైతుకి, ఇటు వినియోగదారునికి వెరసి దేశానికి క్షేమదాయకం. అందుకు ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి. దేశవ్యాప్తంగా రైతుకి రుణమాఫీ లాంటి తక్షణ సాంత్వన కలిగించే చర్యలతోపాటు పంటకి అవసరమైన పెట్టుబడి కన్నా కొంత అధికంగా కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్ లాభాల దాహాన్ని అరికట్టే విధానాలు, వెనువెంటనే ఋణం లభించేలా పరపతి విధానాలు రూపుదిద్దాలి. ఉద్యోగికి లభిస్తున్న కనీస ఆదాయ భద్రత, పరిశ్రమలకు లభిస్తున్న రాయితీలు రైతన్నకు సైతం లభించేలా తగు చర్యలు తీసుకోగలిగితే మన వ్యవసాయ రంగం మళ్ళీ పూర్వవైభవం సాధిస్తుంది. రైతు సంక్షేమం కేవలం ఎన్నికల హామీగానే మిగిలినంతవరకూ అన్నదాత పరిస్థితి ఐసీయూలో ఉన్నట్టే.

- డి.వి.జి.శంకరరావు