AADIVAVRAM - Others

చక్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడి మేధస్సు రూపొందించిన విప్లవాత్మక వస్తువుల్లో చక్రం మొదటిది అంటే అతిశయోక్తి కాదు. దీనని క్రీ.పూ.3500 లో మెసపుటోమియాలో ఆవిష్కరించి ఉంటారని భావిస్తున్నారు. రవాణా రంగంలో ఉపయోగించేందుకు ముందుగా చక్రపు ప్రయోజనాన్ని, ప్రాధాన్యతను గుర్తించింది. కుండల వంటి మట్టి పాత్రలు తయారుచేయటంలో తరువాతి రోజుల్లో రథాలు, బళ్లు, వాగన్లు మానవులు వేగంగా ప్రయాణించేందుకు ఉపయోగించే వాటన్నింటిలో చక్రాల వినియోగం మొదలయింది. చక్రం వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నప్పటికీ అమెరికాలోని ప్రాచీన సంస్కృతిలో రవాణాకు వాటిని ఉపయోగించుకోలేదు. అదే సమయంలో 19వ శతాబ్దం వరకూ చక్రం పెద్దగా పరిణామం చెందలేదు. పారిశ్రామిక విప్లవంతో ఇది నూతన రూపాలు సంతరించుకోవటం మొదలయ్యింది.

ఎలక్ట్రాన్
ఇంగ్లీష్ దేశపు శాస్తవ్రేత్త జాన్ డాల్టన్ 1800 సం.లో పరమాణువుల ఉనికిని గుర్తించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆపైన సర్ జోసెఫ్ జాన్ జె.జె.్థమ్సన్ అనే భౌతిక శాస్తవ్రేత్త డాల్టన్ సిద్ధాంతాన్ని మెరుగుపరిచి విస్తృతం చేయాలని భావించాడు. థామ్సన్ ప్రయోగాలు ప్రధానంగా వాయువుల ద్వారా విద్యుత్ ప్రసరణకు సంబంధించే సాగాయి. కాథోడ్ కిరణాలను అధ్యయనం చేశాడు. ఆ క్రమంలోనే 1897లో ఆయన కాథోడ్ కిరణాలంటే పరమాణువుల నుంచి ప్రవాహంగా వెలువడుతున్న ఎలక్ట్రాన్లు తప్ప మరోటి కాదు అని గుర్తించాడు. దీని ఆధారంగా ఆయన ఓ సిద్ధాంతాన్ని రూపొందించి ప్రకటించాడు. పరమాణువులు మొత్తం మీద తటస్థమైనవి. దానిలోంచి రూణావేశంగల ఎలక్ట్రాన్లు వెలువడుతున్నాయి. అంటే అదే సంఖ్యలో ధనావేశం గల రేణువులు కూడా ఉండే ఉంటాయి అని ఊహించాడు.
ఆ తరువాత పది సంవత్సరాలకు ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్, నిల్స్‌భోర్ వరకూ అణు సిద్ధాంతాన్ని మరింత అభివృద్ధి చేశారు. పరమాణువు మధ్యలో ఓ కేంద్రకం ఉంటుందని, ఎలక్ట్రాన్లు దాని చుట్టూ పరిభ్రమిస్తూంటాయని రూథర్‌ఫర్డ్ ప్రతిపాదించాడు. ఇవి మన సౌర మండలంలో సూర్యుడు, దాని చుట్టూ గ్రహాల చలనాన్ని పోలినవని ప్రతిపాదించాడు. అయితే పరమాణువును అస్థిరంగా చూపించే ఈ పద్ధతి లోపభూయిష్టంగా కనిపించింది. ఈ సమస్యను భోర్ పరిష్కరించాడు. క్యాంటం మెకానిక్స్‌ను ఆధారం చేసుకొని ఆయన పరమాణు ప్రవర్తనను వివరించాడు.

**

-బి.మాన్‌సింగ్ నాయక్