Others

రససిద్ధాః కవీశ్వరాః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అనర్గళ సాహతీ గళం మూగవోయింది
ఒక కవితా క్షేత్ర కృషీవల హలం ఆగిపోయింది
ఒక సాహితీ సవన జ్వాల ఆరిపోయింది
ఒక రసధునీ ప్రవాహం శుష్కించిపోయింది
ఒక మధుర మకరంద మందారం గగనానికి ఎగిరిపోయింది
ఒక సరస సాహితీ సరస్వతీ పుత్రుడు పరమపదించాడు
కఠిన, కర్కశ కాలం కరుణమాలి కాటేసింది
సాహితీ బంధువులకు విషాదాన్ని మిగిల్చింది
అయితేనే ఆ కవి ఆత్మబలం అపారం
మళ్లీ ఏదో ఒక రూపంలో భువికి వస్తాడు
సాహితీ క్షేత్రంలో ఫలాలను పండిస్తాడు
ఇది అందరి తెలుగు వారి ఆశాంస
మధుర కవి మధుర స్మృతికి మాన్యతా ప్రశంస
‘రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే
జరామరణ జం భయం
- ఉమాపతి బి.శర్మ
సెల్ : 92461 71340