Others

బ్యాటరీ వాహనాలకి బా(స)ట ఇద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండిపోతున్న పెట్రోలు ధరలతో విద్యుత్‌తో నడిచే వెహికల్సే ప్రత్యామ్నాయంగా పనికొస్తాయ్. ఇ-వెహికల్స్ ఛార్జింగ్‌తోనే హ్యాపీగా ప్రయాణం చేసుకోవచ్చు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ ఈ బైక్‌ల వినియోగం ఏటా పెరుగుతూ వస్తోంది. కాలుష్యరహిత బైక్‌గా ఇంధనాల కారణంగా పట్టణాలతోపాటు గ్రామాలు కూడా పూర్తిగా కాలుష్య ప్రాంతాలుగా మారిపోతున్నాయి.
మెకనైజ్డ్ సైకిల్ క్యాటగిరీ కింద ఈ బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని నడిపేందుకు ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకున్నట్లే ఈ వాహనాల బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవచ్చు. చిన్న సైకిల్స్ కూడా ఉన్నాయి. వీటితోపాటు త్రీవీలర్స్ వెహికల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ బండ్లన్నీ సోలార్ విద్యుత్‌తో నడిచే సౌకర్యం కూడా ఉంది. రూ.35 వేల నుంచి రూ.లక్షవరకు ధర ఉంది.
విద్యుత్ ఆధారంగా ప్రయాణం చేయడంతో పొగ, ధ్వనులు కూడా రావు. వాహనాల స్పీడ్ 40 కిలోమీటర్ల వరకు ఉండడం, 200 కేజీల బరువు మోయగల సామర్థ్యం ఉండడంతో 40-60 ఏళ్ళ మధ్య వయసున్న వ్యక్తులు, 18-25 ఏళ్ళ లోపు వయసుగల యువతీ యువకులు ఈ బైకుల కొనుగోళ్ళపై దృష్టి సారిస్తున్నారు. ఇంధన ఆదాతోపాటు ఇతరత్రా బైక్ నిర్వహణ భారం పడదు. ఖర్చు తక్కువగా ఉండడంతోపాటు ఎటువంటి లైసెన్సులు, ఇతరత్రాలేమీ అక్కర్లేదు. అయితే ఈ బైక్స్ పికప్ ఉండదంటూ వినియోగాన్ని చిన్నచూపుగా చూస్తున్నారు.
బ్యాటరీ సైకిల్, స్కూటర్, కారు, ఇ-వెహికల్స్- ఇలాంటివి అందరికీ కావాలని ఉంటుంది. అయితే సర్వీసింగ్ సెంటర్స్ లేక, సరైన ప్రచారం లేక- అవి కొనుక్కుంటే భారమని ఈ బైక్‌లకి చాలామంది దూరమవుతున్నారు. ప్రభుత్వంతోపాటు మనమూ వినియోగదారుల్ని- వాటి ఉత్పత్తులని పెంచే సంస్థలని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి