Others

ఆవు నెయ్యితో ఆరు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికి జీవన విధానం వల్ల చాలామంది ఊబకాయులుగా మారుతున్నారు. శరీరంలో చెడు కొవ్వు విపరీతంగా పేరుకుపోతోంది. ఇలాంటి కొవ్వు పెరగకుండా ఉండాలంటే రోజు ఆవు నెయ్యిని ఆహారంలో తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి చాలా మంచిదంటున్నారు. జలుబు, దగ్గు దరిచేరనీయకుండా కాపాడుతుం ది. అంతేకాదు శరీరం మృదువుగా ఉండాలంటే కూడా ఆవు నెయ్యి తినమని చెబుతున్నారు. ఆవు నెయ్యి వల్ల కలిగే ఆరు లాభాల గురించి వారు చెబుతున్నారు.
1. వంటలో ఆవు నెయ్యిని వాడటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఆవు నెయ్యి తిన టం వల్ల వేడి చేస్తుందని పిల్లలకు తినిపించటం లేదు. కాని ఆవు నెయ్యే శరీరంలోని వేడి తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఓ టీ స్పూన్ నెయ్యి పెసరుపప్పు కిచిడీలో వేసుకుని తింటే చాలు శరీరంలోని విషపదార్థాలు విసర్జింపబడతాయి. జీర్ణక్రియ సక్రమం గా జరుగుతుంది. మలబద్దకం అనేది ఉండదు. అన్ని వయసుల వారు ఆవు నెయ్యి తినటం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
2. బరువు తగ్గాలని తహతహలాడేవారు రోజు ఆవు నెయ్యి తింటే చాలు అని సూచిస్తున్నారు. ఆవు నెయ్యి తినటం వల్ల కొవ్వును కరిగించే ఆమ్లం తయారవుతుం ది. దీనివల్ల కొవ్వు కరిగి బరువు సులువుగా తగ్గిపోతారు.
3. శరీరంలో ఉండే వేడి వల్ల కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా కొన్ని రకాల జబ్బుల బారిన పడవచ్చు. కాబట్టి శరీరంరోని వేడి తగ్గాలంటే ఆవు నెయ్యి ఎంతో మంచిది.
4. హార్మోన్లు సమతుల్యంగా ఉండేటట్లు తోడ్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ కె2,ఎ,డి,ఇలు పెరగటానికి ఆవు నెయ్యి ఉపకరిస్తుంది.
5. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎముక పుష్టి కూడా కలుగుతుంది. శరరంలో క్యాన్సర్ కణాలు వృద్ధిచెందకుండా కాపాడుతుంది.
6. ఆవు నెయ్యి తినటం వల్ల విటమిన్ కె2 వృద్ధిచెంది రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. సూపర్‌మార్కెట్‌లో లభ్యమయ్యే నెయ్యిని కొనుగోలు చేసేటపుడు అది స్వచ్ఛమైనదో కాదో లెబుల్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉంది.