Others

‘పిఒకె’ అని పేరు మార్చేసుకున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వూరి అసలు పేరు సిమ్మ్రాన్‌పూర్- కాని డెబ్బై ఏండ్లు అయిపోయినా ఆ వూరికి నీళ్లు రాని పంపు ఒక్కటే వుంది. దానికి వాళ్ళు పశువుల్ని కట్టేసుకుంటారు. కరెంటు లేదు. ఉండటానికి ఆ వూరు దౌలతాపూర్ (సంపన్నపురం) పంచాయతీలో వుంది. దీపాలు ‘నహీన్ హైన్’. విద్యాబుద్ధులకి అవకాశమే లేదు. ఈ గ్రామ పంచాయితీ కాన్పూర్ జిల్లాలోనే వుంది. సరే, సదరు కాన్పూరు యుపిలో వున్నది అని తెల్సుగా. ఆ వూళ్ళో వున్న వెయ్యిమంది ఆందోళన చేసినా వినే నాధుడు లేడు. ఆవేశం, దుఃఖం రెండూ తట్టుకోలేక- మా వూరు ఆక్రమిత కాశ్మీర్‌లో వున్నది అనుకుంటున్నాం. పిఒకె అంటే పాక్ ఆక్యుపయిడ్ అని అర్థం. అక్కడ వున్నట్లే వుంది మా పని అని గ్రామీణులు పత్రికలవారికి చెప్పారు. ఓ కాంట్రాక్టర్ లోగడ ఎలెక్ట్రిక్ పోల్స్ సొంత డబ్బుతో వేయించాడు కాని కరెంటు రాలేదు. ఎంఎల్‌ఏగారు మొర శ్రద్ధగా ఆలకిస్తాడేగానీ ఓ బావి కూడా త్రవ్వించడు. వూళ్ళో వ్యాపారులు కోపంతో, ‘పిఒకె’ అని బోర్డులు కూడా రాయించేసుకున్నారు. పాక్ ఆక్రమిత గ్రామాలు ఎంతటి దైన్యస్థితిలో ఉన్నాయో చూడాలి అంటే మా వూరు రండి అంటున్నారు ఆందోళనకారులు- యోగిగారి దాకా ఈ కధ పోవాల్సిందేనా?