Others

దొంగ ఎవరు? (వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం సినిమా కాదు గాని సినిమాని మించిన నేరాలు ఘోరా లు జరిగిపోతూ వుంటా యి. అమెరికా క్యాన్సాస్ సిటీకి చెందిన రిచర్డ్ ఆంథోనీ జోన్స్ 1999లో రోలాండు పార్కులో జరిగిన దోపిడీ కేసులో దొరికాడు. అతన్ని పోలీసులు ప్రత్యక్ష సాక్షుల సాయంతో కోర్టు బోనులో నిలబెట్టారు. రిచీ నేను దొంగను కాను మొర్రోమని మొత్తుకుంటూనే ఉన్నాడు కానీ -జడ్జిగారు 19 సంవత్సరాల జైలుశిక్ష విధించి పంపేశాడు. అతను ‘‘నేను ఏ పాపమూ ఎరుగను మొర్రో’’ అంటూ విలపిస్తూనే పదిహేడు సంవత్సరాలు కారాగార నిర్బంధంలో ‘చిప్పకూడు’ తింటూ కాయకష్టం చేస్తూనే వున్నాడు కానీ అతనికి కొందరు తోటి ఖైదీలు ఒక ఆశావహమైన వార్త చెప్పారు.
‘‘అచ్చం నీలాంటివాడే ఒకడు ఇదే జైల్లో వేరేచోట వుండగా చూశాము. అతనేదో చిన్న నేరానికి దొరికి ఇక్కడ ఉన్నాడుట’’ అని. దానితో రిచర్డ్స్‌కి ప్రాణం లేచి వచ్చింది. ‘దొంగ’ అన్న మచ్చ ఐనా పోగొట్టుకుంటాను అంటూ- నిస్సహాయులకు న్యాయవిచారణలో సాయం చేసే ఒక ధర్మ సంస్థకి విజ్ఞప్తి పత్రం పెట్టుకున్నాడు. అలాగా, 1999లో అరెస్టు అయి చెయ్య ని నేరానికి మగ్గిపోతున్న జోన్స్‌ని పునర్విచారించడానికి కోర్టు ఒప్పుకుంది. కలువ సోదరుడు కాని, మేనత్త మేనమామల సంతానం కాని ఏ మాత్రం కాని రిక్కీని, రిచర్డ్స్‌ని బోనెక్కించా రు. ఒకడి జెరాక్స్ కాపీలాగా ఒకడు వున్నారు. ‘బులా వ్ ప్రత్యక్ష సాక్షుల’ను అన్నారు. వాళ్ళు తికమక పడ్డారు. ఎవరెవరో చెప్పడం కష్టంగా వుంది- సారీ! అంటూ పోలీసులు, సాక్షులు కూడా చేతులెత్తేశారు. 17 ఏండ్ల జీవితం కటకటాల పాలైంది. ఎవడూ ఆ కాలాన్ని తిరిగి ఇవ్వలేడు. కాని ‘‘ఇప్పుడు వొగ్గేస్తున్నాం, నువ్వు స్వేచ్ఛాజీవివి పో’’ అన్నాడు న్యాయమూర్తి. అతని డూప్‌లాంటివాడు రికి కూడా ‘‘నేను పార్కు పరిసరాలలోనే లేను. నేను ఏ నేరం చెయ్యలేదు’’ అని వాదించాడు. అసలు దోపిడీ చెయ్యడం దాకా ఎందుకు? జరుగుతూ వుంటే చూడను కూడా నాకు ధైర్యం లేదు అన్నాడు. ఎట్లా? వేలి ముద్దర్లుకూడా లేవు.. డిఎన్‌ఏ టెస్టులు లేవు! ఎవరెవరు అని నిర్థారణ చేస్తాము? ఆదిలోనే పరిశోధన తప్పింది అని చిన్న లెక్చరు ఇచ్చి రిక్కీని కూడా దోషివి కావు పో అన్నారు కోర్టు వారు. రిచర్డ్స్ బ్రతుకు జీవుడా అని భార్యాపిల్లల దగ్గరికి చేరాడు. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్లైపోయారు. అసలు నేనే గందరగోళ పడిపోయాను. అతని ఫోటో నాది అనీ, నాది అతనిది అని అనుకున్నానంటే నమ్మండి అన్నాడు. కాని, పోలీసులు ఆదినే ఎలా పప్పులో కాలు వేశారు? అన్నదే ధర్మసందేహం? ఒక సినిమా కథ- డబల్ రోల్ కోసం రాయొచ్చు కదా?

-వీరాజీ