Others

ప్రగ్యా పట్టేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి ప్రగ్యా జైస్వాల్ పట్టేసింది. కుర్ర హీరో పక్కన కాంతిరేఖలా మెరిసిన ప్రగ్యా -ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరో సరసన తులసి మొక్కలా కనిపించబోతోందట. అర్థంకాలేదు కదూ! అదేనండి నాగ్ త్వరలో చేయబోతున్న భక్తి చిత్రానికి ప్రగ్యాను తీసుకునే యోచనలో యూనిట్ ఉందని ఇండస్ట్రీ టాక్. కంచె సినిమాలో కథానాయికగా తళుక్కుమనిపించిన ప్రగ్యా -ఆ తరువాత తెలుగులో సరైన ప్రాజెక్టు పట్టుకోలేకపోయింది. అయితే నాగ్ తాజా ప్రాజెక్టులో కనుక ఆమె ఓకే అయితే, జాక్‌పాట్ కొట్టినట్టేనని అంటున్నారు. ఏడాది ప్రథమార్థంలోనే రెండు భారీ హిట్లు అందుకుని జోరుమీదున్న నాగార్జున. సంక్రాంతికి కోరమీసం, పంచెకట్టుతో బంగార్రాజుగా అల్లరి చేసిన నాగ్, తరువాత ఊపిరి చిత్రంలో డీసెంట్ పాత్రను పోషించి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు జూన్‌నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న భక్తి చిత్రానికి ప్రిపేరవుతున్నాడు. ‘తుకారాం’గా తండ్రి ఏఎన్నాఆర్ పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రనే నాగ్ ఎంపిక చేసుకున్నాడు. హాథీరామ్ బాబాజీ జీవిత చరిత్ర ఆధారంగా ‘నమో వెంకటేశాయ’ను రాఘవేంద్రరావు తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తుకారాం భార్యగా అంజలీదేవి అద్భుతమైన పాత్రను పోషిస్తే -హాథీరామ్‌కు తోడుగా ప్రగ్యా కనిపించే అవకాశాలు ఉంటాయి. మరోపక్క అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి లాంటి భక్తి చిత్రాలను తెరకెక్కించిన రాఘవేంద్రరావే దర్శకుడు కనుక -నమో వెంకటేశాయ పట్ల ఇండస్ట్రీలో ఆకస్తి కనిపిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులో చేస్తే తన కెరీర్‌కు గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుందని ప్రగ్యా తెగ సంబరపడుతోందట.