Others

స్కందుడు.. సంకటహరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుబ్రహ్మణ్యేశ్వరాధన అనాదిగా వస్తున్నదే. సంతానప్రదాతయని, ఆరోగ్యాన్నిచ్చే నిధి యని సుబ్రహ్మణ్యుని కొలుస్తుంటారు. భారతదేశంలో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తుంది. తమిళనాడు మరింత విశేషంగా ఈ ఆరాధన మనకు గోచరవౌతుంది. ఆషాడమాసంలోని పంచమి తిథి స్కంధపంచమిగా పేర్కొంటూ సుబ్రహ్మాణ్యారాధన చేస్తుంటారు. ఈ సుబ్రహ్మణ్యారాధన సుఖసం తోషాలను కలిగిస్తుందని, సంతానవృద్ధిని, సౌభాగ్యసిద్ధిని కలిగిస్తుందని సుబ్రహ్మణ్యు ని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్యునికి అనేక పేర్లున్నా ప్రతి నామం వెనుక ఒక అంతరార్థం దాగి ఉంది. ఈ స్కందుడన్న నామం వెనక ఉన్న గాథను రామాయణం ఎరుకపరుస్తోంది.
ఒకానొక కాలంలో ఆదిదంపతులు తల్లిదండ్రులు కావాలనుకొన్నారు. ఆదిశక్తిని పూజించడం ఆరంభించారు. ఆకాలంలోనే శూరపద్మాసురుడనే రాక్షసుడు సజ్జనులను బాధించేవాడు. శివకుమారునితో తప్ప మరణ భయంలేని ఆ శూరపద్మాసురుడు దేవతలను సైతం హింసించడం ఆరంభించాడు. దేవతలంతా కలసి పరమేశ్వరుడికి శివకుమారుణ్ణి ప్రసాదించమని వేడుకున్నారు. పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు. కాలం గడుస్తున్నా శివకుమారోదయం కలుగలేదు. బాధలను భరించలేని దేవతలు ఆలోచనలు చేశారు. పరమశివుని దగ్గరకు వెళ్లి శివరేతస్సును భరించే శక్తి ఒక్క పార్వతీదేవికి ఉందా అన్న అనుమానాన్ని వెలిబుచ్చారు. పార్వతి వారి అనుమానానికి కినుక వహించి అపుత్రవంతులుగా వారిని శపించింది. పరమేశ్వరుడు ఆలోచించి ‘దేవతలారా, మీ ఇష్టప్రకారమే నా రేతస్సును భూమిపై విడుస్తాను’ అని చెప్పాడు. దేవతలందరు వాయువును పిలిచి నీవు అగ్నితో కూడి శివరేతస్సును ధరించమని చెప్పారు. కాని అగ్ని ఆ తేజస్సు ను భరించ లేక గంగకు బదలాయంచారు. ఆమెకూడా ఆ శివతేజస్సును భరించలేక కొన్నాళ్లకు హిమాలయ ప్రాంతంలో విడిచి పెట్టింది. ఆ వీర్య ప్రభావం చేత అక్కడ శే్వత పర్వతం ఏర్పడింది. ఆ పర్వత ప్రాంతమంతా శివ తేజః ప్రభావంతో సర్వధాతుమయం అయంది. ఆ శే్వతపర్వతం నుంచి శరవణం ప్రభవించింది. దానినుంచి కుమారస్వామి జన్మించాడు. అలా గంగ స్కలించినందువల్ల ఉద్భవించిన శివకుమారుడే స్కందుడన్న నామధేయంతో విఖ్యాతుడయ్యాడు. ఆ శివకుమారుడే శూరపద్మాసురుని సంహరించాడు. దేవతలకు ఆనందాన్ని కలిగించాడు. వల్లీ, దేవసేన అనే కన్యలను పెళ్లాడి వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణునిగా కొలువై భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు. ఈ స్కందనామధేయ సుబ్రహ్మణ్యునికి ఆషాఢమాస పంచమి నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు. కార్తికేయునిగా, శరవణునిగా, కుమారునిగా, సుబ్రహ్మణునిగా, అగ్ని సంభవునిగా- ఇలా అనేక పేర్లతో స్కందుని సంభావిస్తూ స్కందపంచమి నాడు సుబ్రహ్మణ్యుని విశేషార్చనలు, సుబ్రహ్మ ణ్యుని వివాహాలు చేస్తారు. ఈ స్కందుని పూజ సంకటాలను తీరుస్తుందని భక్తుల నమ్మకం.

- కె. యాదయ్య