Others

సేవకు వేళాయెరా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్‌కే అసూయ పుట్టేలా ఉండే నమిత తొలి నాళ్లల్లో యువత హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. ఆమెకోసమే సినిమాకి వెళ్లేవారు అంటే అది అబద్ధం కాదు. ఆ క్రేజ్ అలా సాగుతూ ఉండగానే బొద్దు భామగా మారిపోయింది. అయినా కానీ ఆమె క్రేజ్‌కి ఎటువంటి డ్యామేజీ జరగలేదు. బొద్దు భామగానే ముద్దులొలుకుతూ సినిమాల్లో నటించింది. ప్రజలు జేజేలు కొట్టారు. తమిళనాడులో అయితే గుడులు కట్టి మరీ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకి సినిమాలు తగ్గాయి. అయినా కానీ క్రేజ్ తగ్గలేదు. ఆ క్రేజ్‌ని సినిమాల్లో కాకపోతే రాజకీయాల్లో ఉపయోగించుకోవచ్చు అనుకుందో ఏమో నమిత, ఇప్పుడు ఎఐడిఎంకె పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని, తమిళనాడు అధినేత్రి జయలలిత స్వయంగా ఆమెకు సభ్యత్వాన్ని అందించి పార్టీలో చేర్చుకున్నారు. అంటే కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆమె చిత్రం విడుదలైనప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో, ఇప్పుడు కూడా రాజకీయాల్లో చేరాక అంతే సంచలనాన్ని నమోదుచేసింది. నమిత గనుక ఎలక్షన్లలో గెలిస్తే తప్పక మంత్రి పదవి లభిస్తుంది అన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. సో ఇకనుండి నమిత రాజకీయాల్లో బిజీ బిజీ అన్నమాట!