Others

వద్దంటే వెంటాడుతున్న అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వద్దంటే వెంటాడుతున్నాయ అవకాశాలు -అనుష్కకి. ఆమె గ్లామర్ అందరికీ మొహం మొత్తేసిందని ఒకపక్క విమర్శలు వస్తున్నా, పెద్ద హీరోల పక్కన అనుష్క ఉంటేనే ఆ ప్రాజెక్టు వెయట్‌ను బ్యాలెన్స్ చేయగలదన్న నమ్మకాలూ లేకపోలేదు. అందుకే అటుతిరిగి ఇటుతిరిగి ఉయ్యాలవాడ చాన్స్ ఆమె దగ్గరికే వచ్చిందని అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిరంజీవి తన కసరత్తులు తను చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న చిత్రానికి సురేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ నిర్మించనున్న సినిమాలో హీరోయిన్ ఎవరైతే బావుంటుందనే రీతిలో అటు బాలీవుడ్‌ని, ఇటు ప్రాంతీయ భాషా పరిశ్రమలను వెతికారు. అలా ఎవరెవరి పేర్లో వినిపించాయ కూడా. చివరకు అనుష్క పేరుకే అందరూ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’తో మంచి పేరు తెచ్చుకున్న అనుష్క ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సరసన అనుష్క అయితే బాగుంటుందని, ఆమె పాత్రకు కూడా ఇందులో ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో చిరంజీవి నటించిన ఓ చిత్రంలో అనుష్క ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.