Others

అదీ గ్రీన్ కార్డ్ స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యువతకు అమెరికా వెళ్లడమే ధ్యేయం. అలా వెళ్లిన వాళ్లలో ఎదిగేవాళ్లూ ఉన్నారు, పతనమయ్యేవాళ్లూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక్కసారి అమెరికాకు ఎగిరితే, తరువాతి టార్గెట్ గ్రీన్‌కార్డ్. ఇదే అంశం కథనంగా తెలుగు ప్రేక్షకులకు సుగర్ కోటెడ్ పిల్ సినిమా నిర్మించాడు దర్శకుడు రమ్స్. 2001లో ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రగా రియల్‌స్టోరీ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన, ఇప్పుడు వైవిధ్యమైన కథగా గ్రీన్‌కార్డ్ తెస్తున్నాడు. పాతికేళ్ల అమెరికా అనుభవంతో కథ రాసుకున్నాంటున్న రమ్స్‌తో బాతాఖానీ...

* ఏమిటి మీ అమెరికా అనుభవం?
- అక్కడ టాలెంట్‌కు విలువ. ఇక్కడ బ్యాక్‌బోన్‌కు విలువ. వెనుక ఎవరున్నారన్న ఆరా తరువాతే గౌరవం అందుతుంది. అమెరికాలో మిలియనీర్ కొడుకులు కనిపించరు. కానీ ఇక్కడ ఏ రంగంలోనైనా వాడే కనిపిస్తాడు. ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు. అక్కడ అన్నీ కనుక్కోవచ్చు.
* ఈ సినిమాకు ముఖ్య కారణం?
- బేసిక్‌గా అమెరికా వెళ్లడానికి రెండు కారణాలు. ఒకటి- బతకడానికి, మరొకటి- బ్లాక్‌మనీ వైట్ చేసుకోవడానికి. నేను పరిశీలించిందే సినిమాలో చెప్పా. అమెరికాలో లైఫ్ చూడటం మొదలయ్యాక ప్రతివాడూ గ్రీన్‌కార్డ్ కోసం చూస్తుంటాడు. పొద్దున లేచిన దగ్గరనుండి దాన్ని ఎలా సంపాదించాలా? అన్న ఆలోచనతో ఉంటాడు.
* ఇండియా పరిస్థితిని ఏం చెప్పారు?
-ఇండియాలో పిల్లాడికి అక్షరాభ్యాసం అయిన తరువాత వెంటనే అమెరికాకు వెళ్లాలన్న అభ్యాసమే చేయించేవాళ్లు తల్లిదండ్రులు. ఇప్పుడది మారింది. కంప్యూటర్ సంబంధిత రంగాలలో అమెరికాకన్నా ఇండియాలోనే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
* అయితే ఇండియానే బెస్ట్ అంటారా?
-వాస్తవంగా ఇండియన్స్ చాలా బెస్ట్. గ్రీన్‌కార్డ్ ఇండియిన్స్‌కే ఎక్కువ ఇస్తారా? లేక అన్ని దేశాలకు ఇస్తారా? అనే పాయింట్ కూడా సినిమాలో చెబుతున్నా. అధ్యక్షుడిగా ట్రంప్ రాకముందు వేరే దేశాలవాళ్లు చాలామంది వచ్చేవాళ్లు. ఒక్కొక్క దేశం నుంచి ఇంతమందిని తీసుకోవాలని కోటా వుండేది. ట్రంప్ వచ్చాక అలా లేదు. కేవలం టాలెంట్ ఉన్నవాళ్లే రావడానికి ఆస్కారం ఏర్పడింది. దీనిని రాంగ్ ప్రొడక్షన్ చేస్తున్నారు కొందరు. ట్రంప్‌తో లాభపడేది ఇండియనే్ల! ట్రంప్ వచ్చాక ఇండియన్స్ ఉద్యోగపరంగా సేఫ్ అయ్యారు.
* ఇతర దేశాల వాళ్లు?
- నేను వెళ్లిన కొత్తలో ఊరికే అలా నిలబడడానికి కూడా కొన్ని ఉద్యోగాలుండేవి. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్‌లో ఊరికే అలా నిలబడివచ్చేవారికి హాయ్ చెబుతూ, పోయేవారికి బాయ్ చెపితే చాలు. అదీ ఓ ఉద్యోగమే. దీనికెలాంటి టాలెంట్ అవసరంలేదు. ఇప్పుడలాంటివి లేవు. మనకు అవసరమైన వాళ్లని తీసుకోమని ఆయన చెప్పారు. అది తెలియక చాలామంది గోలగోల చేస్తున్నారు.
* సినిమా అంతా ఇదే చర్చ ఉంటుందా?
- నేను రాసుకున్న పాయింట్లను చర్చకు పెడితే అది సినిమా అవదు. కథాపరంగా ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో చెప్పాలి. ఓ చదువుకున్న కుర్రాడు అమెరికా చేరాక, అతని జీవితం ఎలా ప్రారంభమైంది, లైఫ్ ఎలా ఉంటుంది, వైఫ్ ఎలా మారుతుంది, అసలు అక్కడ జీవితం ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. మనం అమెరికా వెళ్లలేకపోతున్నామనుకునే ఓ మారుమూల పల్లెలోని ఆడియన్‌కు, మనం వెళ్లగలిగే స్టేజీలో వున్నా ఎందుకు వెళ్లకూడదు అనుకునే ఆడియన్‌కు అమెరికాలో మనవాళ్లు ఉన్నారా, వాళ్లు ఎలా బ్రతుకుతున్నారో చూడాలనుకునే ఆడియన్‌కు తెలియాలనే ఆలోచనతో ఈ సినిమా చేశాను.
* లవ్‌స్టోరీ ఎలా ఉంటుంది?
- రొటీన్‌గా మాత్రం ఉండదు. యాక్షన్ పార్ట్ ఉంటుంది. అన్నీ నేను చూసిన అంశాలే ఉంటాయి. అమెరికాలో నీగ్రోస్ ఎదుర్కొనే అంశాలేంటి? బేసికల్‌గా వాళ్లు గన్స్ ఎందుకు తీస్తారు అనే అంశంతో ఓ క్లైమాక్స్ పాయింట్ ఉంటుంది.
* ఆర్టిస్టులతో ఇబ్బంది?
- నేను నాచురల్‌గా నటించేవారినే తీసుకున్నా. నా కథలో నటించడానికి ఆర్టిస్టులు అవసరం లేదు.
* అమెరికా కథ చెప్పడంలో తీసుకున్న జాగ్రత్తలు?
- ప్రత్యేకంగా ఏమీ లేవు. అమెరికావాళ్ళకు ఇండియన్ ఫుడ్ పెట్టినట్లుగా కొంచెం, ఉప్పు, కారం తగ్గించి చేసినట్లు చేశా. ప్రతి పాయింటు నటీనటులకు ఈజీగా ఉండేలా రాసుకున్నా. నా సినిమాలో చేసినవాళ్లందరూ అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లే. సాయంత్రం 4నుండి రాత్రి పది గంటలకు షూటింగ్ ఉండేది. 62 రోజుల్లో పూర్తిచేశాం.

-శేఖర్