Others

గ్లామర్ డోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి సినిమాతో అచ్చతెలుగు అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న లావణ్యకు వరుసగా అలాంటి పాత్రలే రావడంతో బోరు కొట్టిందట. నేను గ్లామర్ షో చేస్తాను బాబోయ్ అని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. అప్పుడప్పుడు సినిమాల్లో గ్లామర్ పెంచినా లాభం లేకపోయింది. అన్ని అలాంటి పాత్రలే! దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో, బయట ఈవెంట్స్ కూడా గ్లామర్ డ్రెస్సుల్లో వచ్చి షాకిస్తోంది. అంతలా గ్లామర్ షోలకు సిద్ధమైన అందాల రాక్షసిని చూసి ఆశ్చర్యపోతునారు. హోలీ పాత్రలతో ఆకట్టుకున్న లావణ్యకు ఇప్పుడు ఇదేం ఆలోచన అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. స్టార్ హీరోలతో జోడీ కట్టే విషయంలో లావణ్యను ఆలోచన కూడా చేయడం లేదట. ఇలాగైతే లాభం లేదని అనుకుందో ఏమో, కొంచెం కొంచెంగా గ్లామర్ షోకి తెరలేపుతోంది. కనీసం ప్రైవేట్ ఈవెంట్స్‌లోనైనా గ్లామర్ పెంచితే, పెద్ద హీరోల దృష్టిలో పడకపోతామా అన్నది ఆమె ఆలోచన అట. తాజాగా జరిగిన 64వ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో లావణ్య ఇచ్చిన గ్లామర్ లుక్స్ అందరినీ షాకిచ్చాయి. ఇక లావణ్యకు గ్లామర్ పాత్రలు గ్యారంటీ అనుకోవాలేమో.