AADIVAVRAM - Others

పురోగతి (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన గురించి ఇతరులు తెలుసుకోవాలంటే మన స్నేహితులెవరో తెలియాలి. అదే విధంగా మనం చదివే పుస్తకాలేమిటో కూడా తెలియాలి. ఇవి చాలా కాలం నుంచి విన్పిస్తున్న మాటలు.
ఈ ఆధునిక కాలంలో ఒక వ్యక్తి గురించి తెలియాలంటే అతను చూస్తున్న వెబ్‌సైట్ గురించి కూడా తెలుసుకోవాలి. అదే విధంగా అతను చూస్తున్న ‘యూ ట్యూబ్’ వీడియోల నుంచి అతన్ని అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ నాలుగు అంశాలు వ్యక్తులని ప్రభావితం చేస్తున్నాయి. ఓ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేక పోయినా అతని గురించి ఓ అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
ఓ వ్యక్తి ఎదుగుదల ఈ నాలుగు అంశాల మీద ఆధారపడి ఉంది. తనకు తానుగా తన ఎదుగుదలని అంచనా వేసుకోవాలని ఎవరైనా అనుకుంటే ఈ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి.
ఇరవై నాలుగు గంటలు జనరల్ బుక్స్ చదవడానికి సమయం కేటాయించలేం. కానీ ఓ 15 నిమిషాల కాలాన్ని కేటాయించవచ్చు. ఈ సమయాన్ని ప్రేమ కథలు, నవలలు చదవడానికి కాకుండా జీవిత చరిత్రలు చదవడానికి, స్ఫూర్తి నిచ్చే కథలూ కథనాలు చదవడానికి ఉపయోగించాలి. అదే విధంగా మనం చేస్తున్న ఉద్యోగానికి ఉపయోగపడే పుస్తకాలని, మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరిచే పుస్తకాలని ఎక్కువగా చదవాలి.
పుస్తకాలు మనలని ఎలా ప్రభావితం చేస్తాయో వ్యక్తులు కూడా అదే విధంగా ప్రభావితం చేస్తారు. వాళ్లు మన స్నేహితులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. వాళ్లు ఎలాంటి వ్యక్తులో గమనించి వాళ్లతో ఎక్కువ మాట్లాడాలి. కొంతమంది ఎప్పుడూ నిరుత్సాహంగా, నిరాశాజనకంగా మాట్లాడుతూ ఉంటారు. మన ఆశలని, ఆశయాలని తక్కువ చేస్తూ మాట్లాడుతారు. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. మనలని ఉత్సాహపరిచే వ్యక్తులతో ఎక్కువ కాలం గడపాలి.
ఇదే దృష్టిని వెబ్‌సైట్ల మీద యూట్యూబ్‌ల మీద పెట్టాలి.
మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు, మంచి వెబ్‌సైట్స్, వీడియోలు మన గమ్యాన్ని సుగమం చేస్తాయి.
ఒక సంవత్సర కాలం మనం వీటి పట్ల శ్రద్ధ వహిస్తే, మన జీవితంలో చాలా పురోగతి కన్పిస్తుంది.

- జింబో 94404 83001