Others

ఈమె కూడా అటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేనికదే చెప్పుకోవాలి కానీ మన తెలుగు నిర్మాతలకు తెలుగమ్మాయిలంటే అస్సలు నచ్చదు. తెలుగు సామెత ‘పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు’ అన్నట్టు ఎక్కడినుంచో తెచ్చుకున్న వేపాకుతోనే వైద్యం చేసుకుంటారు. అలాగే తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగితే అస్సలు సహించలేరు. వారికి ఎటువంటి అవకాశాలు ఇవ్వరు మనవారు. ఎందుకనేది లోతుగా ఆలోచిస్తే చాలా కారణాలు బయటపడతాయి. కారణాలేవైనా తెలుగు అమ్మాయిలు మాత్రం టాలీవుడ్‌ను నమ్ముకోకుండా కోలీవుడ్‌కు, మాలీవుడ్‌కు వెళ్లిపోయి అగ్రశ్రేణి కథానాయికలుగా ఎదుగుతున్నారు. అంజలి, స్వాతి, శ్రీదివ్య, ఆనంది లాంటివాళ్లు ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు అదే దారిలో అచ్చతెలుగు అమ్మాయి రీతూవర్మ కూడా వెళుతోంది. కేశవ సినిమా విడుదలయ్యాక ఆమెతో ఒక్క సినిమా ప్రారంభం కాలేదు. రీతూవర్మ మాత్రం తమిళంలో గౌతమ్‌మీనన్ లాంటి పెద్ద దర్శకుడు విక్రమ్‌తో రూపొందిస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకుంది. గౌతమ్ హీరోయిన్లను వైవిధ్యంగా చూపిస్తాడనే విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ చిత్రంలో కూడా ఎంపికైంది రీతూవర్మ. రఘువరన్ బిటెక్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే గౌతమ్‌మీనన్ రూపొందిస్తున్న ధృవనక్షత్రం హిట్ అయింది అంటే రీతూవర్మ తమిళంలో సెటిల్ అయినట్లే!