Others

అఖండ భారత్.. ఇక అఖండ మార్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రారండోయ్.. వేడుక చేద్దాం..’ అంటూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర పెద్దలంతా ‘వస్తు సేవల పన్ను’ (జిఎస్‌టి) శకం ప్రారంభమైన సందర్భంగా దేశ ప్రజానీకాన్ని ఎంతగానో ఉత్తేజితం చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్లమెంటును సమావేశ పరచి ఈ కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. అర్ధరాత్రి వేళ పార్లమెంటు సెంట్రల్ హాలులో ఇలా నేతలు కొలువుదీరడం అరుదైన సందర్భం. ఈ ఉదంతం నాకు చిన్నప్పటి రోజులను గుర్తుకు తెచ్చింది. పల్లెటూళ్లలో డప్పుల చప్పుళ్లతో ఏదైనా ఉత్సాహ భరితంగా ఊరేగింపు ఎదురైతే చాలు.. దాని సందర్భం తెలియకపోయినా కేరింతలు కొడుతూ కాళ్లు కదిపేవాళ్లం. ఆ తర్వాత తెలిసేది అది పండగనా? పబ్బమా? అని.
భారత్‌లో ‘ఒకే దేశం- ఒకే పన్ను’ (వన్ నేషన్- వన్ ట్యాక్స్)గా కీర్తింపబడుతున్న ‘జిఎస్‌టి’ అడుగిడి అప్పుడే నాలుగు రోజులు గడిచాయి. ఉత్సాహం ఛాయలు క్రమంగా మరుగున పడుతూ, వాస్తవం అర్థం కావడానికి మరికొంత సమయం పడుతుంది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల కాలంగా చర్చలకే పరిమితమై, ఆ తర్వాత రాజ్యాంగ సవరణ, కేంద్ర రాష్ట్రాల అంగీకారం పొందిన పరోక్ష పన్నుల సంస్కరణ దేశ చరిత్రలో కీలక మలుపు. తద్వారా దేశమంతటా ఒకే తరహా పన్ను విధానం అమలు జరిగే అవకాశం ఏర్పడింది. పన్నుల మీద పన్ను, రాష్ట్రానికో పన్ను లాంటి అవరోధాలను అధిగమిస్తూ సరకు రవాణా సులభతరమైంది. పారిశ్రామిక వర్గాలకు ఇది ప్రోత్సాహకరం. ప్రభుత్వ ఖజానాకు కూడా నికరమైన లాభం. మరి సామాన్యుడి సంగతి.. ‘్భవిష్యత్తు ఆశాజనకం’ అని చెప్పగలం. కానీ, ఆ మాట ధైర్యంగా, గట్టిగా చెప్పడానికి ప్రస్తుతానికి సాహసించలేం. ఎందుకంటే ప్రభుత్వ రాబడి పెరగడం, ఉత్పత్తిదారు, సరఫరాదారుకి సులభతర పన్ను వ్యవస్థ ద్వారా మేలు జరగడం అన్నది కొనుగోలుదారునికి ప్రత్యక్షంగా మేలు కలగజేస్తుందన్న పూచీ ఏమీ లేదు.
‘నాన్ ఫ్రావిటీరింగ్ వ్యవస్థ’ను ఏర్పరచి సంబంధిత లాభాలు కింది స్థాయికి బదిలీ అవుతున్నాయో లేదో పర్యవేక్షిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సెలవిచ్చారు. కానీ, అలా వినియోగదారునికి లాభాల బదలీ ఎగ్గొట్టిన వారిని నియంత్రించడానికి కచ్చితమైన విధి విధానాలేవీ ప్రస్తుతానికి లేవు. అలాగే వినియోగదారుడు ‘పది పన్నుల స్థానంలో ఒకే పన్ను’ అని మురిసి పోవడం తప్పించి వస్తువు అసలు ధర న్యాయమో కాదో తెలుసుకునే అవకాశం ఈ ‘జిఎస్‌టి’ విధానంలో లేదు. ఉదాహరణకి పాతపద్ధతిలో ఏభై రూపాయల వస్తువుపై పది రకాల పన్నులు వడ్డించి తొంభయి రూపాయల ధరను నిర్ణయించారని అనుకుందాం. ప్రస్తుతం ఆ వస్తువు ధరనే వంద రూపాయలుగా నిర్ణయించేసి, కేవలం పది రూపాయల జిఎస్‌టి విధించి నూట పదిరూపాయలు అయ్యింది అనుకుందాం. అప్పుడు కొనుగోలుదారుకి కొత్తదాని కన్నా పాతదే మేలు కదా! కాబట్టి వస్తువుల, సేవల ధరలను నిర్ణయించడంపై పారదర్శకత ఉంటేనే ప్రజలకు ప్రయోజనం. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ పన్ను సంస్కరణ ఫలాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకున్నపుడే, అందుకు పూచీ పడినప్పుడే అసలైన పండుగ! అందాకా నిరీక్షిద్దాం. ఆ భరోసా కలిగాకే పండుగ చేసుకొందాం! (ఇంధనం, సహజ వాయువులు, మద్యంపైన కూడా జిఎస్‌టి పరిధిలోనే పన్నులుంటే సమంజసంగా ఉండేది.. ఖజానాకు భారమైనా)

- డా.జివిజి శంకరరావు