Others

మిస్సవుతున్నారు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయం లేదు మిత్రమా. రణమా? శరణమా? -అంటూ గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్య చెప్పిన డైలాగ్ బాగా పాపులరైంది. ఇప్పుడు ఆ పాపులర్ డైలాగ్‌నే పేరడీగా హీరోయిన్లకు అన్వయించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ‘సమయం లేదు నాయికా.. వివాహమా? అభినయమా? అని.
**
హీరో రెమ్యూనరేషన్, హీరోయిన్ వయసు అడక్కూడదు. ఇదీ తెలుగు సినీ నానుడి. అందుకే -హీరోల ఫిగర్స్ బయటకు రావు. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత సీనియారిటీ సంపాదించినా హీరోయిన్ల వయసూ బయటకు పొక్కదు. కచ్చితమైన లెక్కలు లేకపోయినా -టాలీవుడ్ టాప్ హీరోయిన్లంతా మూడు పదుల వయసు దాటేసినవాళ్లే. 40వ పడికి దగ్గర పడుతున్నవాళ్లూ ఉన్నారు. ఇరవైల్లోనే తెరగేంట్రం చేసి, పది పదిహేనేళ్ల అనుభవం సంపాదించుకున్నారు. సంఖ్యాపరంగా హీరోయిన్లు ఎక్కువే అయినా, ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్ల సంఖ్య తక్కువ కనుక -వాళ్లలో వాళ్లే టాప్ హీరోయిన్లు. వరుసపెట్టి సినిమాలు చేసేస్తూ ప్రతి సినిమాలోనూ టాప్ హీరోలకు లైఫ్ పార్టనర్ అయిపోతున్న హీరోయిన్లు మాత్రం -నిజ జీవితంలో ‘లైఫ్ పార్టనర్ల’పై దృష్టి పెట్టడం లేదు. ఇదే అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది.
ఫలానా హీరోయిన్ ఫలానా వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది, ఫలానా వ్యాపారితో అఫైర్‌లో ఉందన్న కథనాలు బయటకు పొక్కడం పాపం, ఆసక్తిగా ఫాలో అవ్వడం కనిపిస్తోంది. అంటే -వయస దాటిపోతున్న హీరోయిన్లు నిజ జీవితంలో మూడు ముళ్లు వేయించుకునే సమయం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారన్న మాట. అయితే టాలీవుడ్ హీరోయిన్లు మాత్రం పెళ్లి ప్రస్తావన ఎత్తడమే మర్చిపోయారు. ఎప్పుడైనా మీడియా నొక్కినొక్కి అడిగితే, ‘కల్యాణ ఘడియ మనం కోరకుండానే వచ్చేస్తుంది. అయినా, ఇప్పుడింకా నా కెరీర్‌పైనే దృష్టి పెట్టా. చిత్రరంగంలో స్థిరపడాలి. పరిశ్రమలో గుర్తింపు పొందాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ తరువాత నచ్చినవాడు తారసపడాలి. అతన్ని పెద్దలు అంగీకరించాలి. ఆ తరువాతే కదా పెళ్లి’ అంటూ సమాధానం దాటవేయడమే కనిపిస్తోంది. ‘లివింగ్ రిలేషన్స్’ నడిపిస్తున్న హీరోయిన్లకు ఇలాంటి ప్రశ్న ఎదురైతే ‘తను నేను జస్ట్ ఫ్రెండ్స్. మామధ్య ఏమీ లేదు. ఈ గాసిప్స్ పట్టించుకోను. పెళ్లి విషయంలో మా పెద్దలదే నిర్ణయం’ అన్న సమాధానమే వస్తుంది. ఈ రొటీన్ డైలాగులకు అటు అభిమానులు, ఇటు మీడియా కూడా అలవాటుపడిపోతుండటంతో -ఇటీవలి కాలంలో అసలు పెళ్లి ప్రస్తావనే రావడం లేదు. అది వేరే విషయం. పెళ్లి పీటలెక్కితే, వెండితెరపై మెరిసే అవకాశాలు కనుమరుగవుతాయని హీరోయిన్ల భయం. పెళ్లైన తరువాత నుంచీ ఏ హీరోతో హీరోయిన్‌గా చేశారో, అదే హీరోకు వదినగానో, అత్తగానో చేయాల్సి వస్తుందన్న భయం. పెళ్లి తరువాత అందం చెదిరిపోతే -అక్క పాత్రలు, అమ్మ పాత్రలు తప్ప మరేం ఉంటాయి అని వ్యాఖ్యానించే సీనియర్ హీరోయిన్లూ లేకపోలేదు. హీరోయిన్లు అలాంటి అనుమానాలు పెట్టుకోవడంలో అర్థముంది. ఎందుకంటే -కెరీర్ అగ్రపథాన నడుస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని తెరకు దూరమైన హీరోయిన్లు ఎందరో. సర్దుబాట్లు కుదరక ఏడాదిలో విడిపోయి, మళ్లీ తెర ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని చెప్పడానికీ ఎంతోమంది హీరోయిన్ల జీవితాలే ఉదాహరణ. బావున్న కెరీర్‌ను ఎందుకు వదులుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో తప్పేం లేదుగా అంటూ ముందుకు సాగుతున్న వాళ్లు కొందరు. పెళ్లి అంటే హీరోయిన్ అనే పాపులార్టీకి ఫుల్‌స్టాప్ పెట్టేసినట్టే కనుక, అందమైన, స్వేచ్ఛాయుత జీవితాన్ని వదులుకోలేక మరికొందరు పెళ్లిళ్లకు దూరంగానే ఉంటున్నారన్నది కాదనలేని నిజం. ‘ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్న పెద్దల మాట ఇప్పటి హీరోయిన్లకు లేదు. యవ్వనం, అందం, వయసు, కరిగిపోయిన కాలం మళ్లీ తిరిగిరావు. సంపాదనలోంచి ఎన్ని కోట్లు వెచ్చించినా, కోల్పోతున్న వైవాహిక ఆనందంలోని ఒక్క క్షణాన్ని కూడా కొని తెచ్చుకోలేం. ఆ దిశగా ఆధునిక తారలు ఆలోచించడం లేదు. ఉన్న సంపాదనతో తృప్తిపడి వివాహం చేసుకుంటే భర్త, పిల్లలు, తీయని సంసార బంధం, సొంత కుటుంబం, బాధ్యతలు, అనుబంధాలు అన్నీ అనుభవంలోకి వస్తాయి. ఆ అవగాహన లేకే ఇప్పటి తారలు జీవితాలను తెరకే అంకితం చేసేస్తున్నారు. ఆ తరువాత..? అన్న ప్రశ్నకు ఇప్పుడు వాళ్లదగ్గర సమాధానం ఉండదు’ అంటున్నారు స్వర్ణయుగం నాటి తారలు.
ఈ నిజం, అనుభవంతో కూడిన ఆలోచన వయసు మీరుతోన్న తారలకు పట్టడం లేదు. ‘పెళ్లి వయసు రాలేదని కొందరు, కెరీర్‌మీదే ధ్యాస పెట్టానని ఇంకొందరు..’ ఇలా రకరకాల సమాధానాలతో ఆత్మవంచన చేసుకుంటూ సంపాదన వైపు పరుగులు తీస్తోన్న వైనమే కనిపిస్తోంది. సంపాదనకన్నా వైవాహిక జీవితం ముఖ్యమని గ్రహించలేకున్నారు.
ఇటీవలే సమంత పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. అగ్రశ్రేణి హీరోయిన్‌గా వెలిగిపోతున్నా, వ్యక్తిగత జీవితంలో సరైన నిర్ణయం తీసుకున్న తెలివైన హీరోయిన్‌గా ప్రస్తావించక తప్పదు. ఏ కెరీర్‌లో రాణిస్తున్నా -్భరతీయ సంప్రదాయంలో ఒక వయసు వచ్చిన తరువాత స్ర్తికి పెళ్లి ముఖ్యం. తరువాత తల్లి కావడమన్నది దేవుడిచ్చిన గొప్పవరం. స్ర్తి జీవితానికి పరిపూర్ణత అప్పుడే. అలాంటి గొప్ప అవకాశాన్ని అగ్రతారలు నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపిస్తుంది. సినిమాల్లో అన్ని పెళ్లిళ్లు చేసుకునే తారలు, నిజ జీవితంలో చేసుకోవలసిన ఒక్క పెళ్లిని ఏవేవో ఆశలతో వాయిదా వేస్తున్నారని అనిపిస్తుంది. ఇంతకంటే గొప్పగా కెరీర్ సాగించినా -సరైన సమయానికి వైవాహిక జీవితం గురించి ఆలోచించని అలనాటి తారలు చాలామంది ఇప్పుడు ఎలాంటి జీవితాలు గడుపుతున్నారో ఇప్పటి హీరోయిన్లు గ్రహిస్తే -జీవితం బోధపడుతుంది.

-ఎం ఆనందరావు