Others

మోయగలదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల నాయిక కాజల్ ఇన్నాళ్లుగా హీరో చాటున అందాలను పొంగిస్తూ, పాటల్లో మంచి డాన్సులు చేస్తూ దాదాపు పదేళ్ల కెరీర్‌ను దాటేసింది. అయితే ఎక్కడా అమ్మడికి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం పడలేదు. నయనతార, అనుష్క, త్రిష లాంటివాళ్లందరూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో దుమ్ములేపుతుంటే కాజల్ మాత్రం హీరోచాటు హీరోయిన్ పాత్రలే చేసుకుంటూ వచ్చింది. చంద్రముఖి సినిమాతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు పి.వాసు కెరీర్ కూడా సరిగ్గాలేదు. అందుకే ఈసారి హీరోయిన్ ప్రాధాన్యత వున్న కథను రాసుకొని కాజల్‌తో రూపొందించడానికి సిద్ధమయ్యాడు. కాజల్ కూడా ప్రస్తుతం తమిళం, తెలుగులో రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఈ టైంలో చంద్రముఖిలాంటి బ్లాక్‌బస్టర్‌కొట్టిన దర్శకుడితో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం పడితే మరికొంతకాలం కెరీర్ సాగించొచ్చని కాజల్ ఆశ. మహిళా ప్రాధాన్యతా చిత్రంతో మెప్పించడంపైనే కాజల్ కెరీర్ ఆధారపడి ఉంటుంది.