Others

అసమానతలపైనే నా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాజీ ఆలీ దర్గావారు మహిళను రెండవ తరగతి పౌరురాలిగా పరిగణిస్తున్నారు. దీనిపైనే నా పోరాటం అని భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ అంటున్నారు. శని శింగనాపూర్‌లో మహిళల ఆలయ ప్రవేశ విజయంతో ఆమె ముస్లిం మహిళలను హాజీ ఆలీ దర్గాలోకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన తదుపరి ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఆలయాల్లో, దర్గాలలో మహిళల ప్రవేశంపై ఆమె చేస్తున్న పోరాటానికి ప్రతీకారదాడులు ఎదురైనా.. జైళ్లలో పెట్టినా.. బెదిరింపులు వచ్చినా మొక్కవోని ధైర్యంతో పోరాటం సాగిస్తున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ మీడియాతో తన మనోగతాన్ని వెల్లడిస్తూ 2011 నుంచి దర్గాలోకి మహిళల రాకను నిషేధించారు. శని శింగనాపూర్ విషయం 2001నాటిదైతే, దర్గా విషయం 2011వ సంవత్సరానికి సంబంధించినది. శని శింగనాపూర్ విజయం సాధించినట్లే మరో రెండేళ్లలో హాజీ ఆలీ దర్గాలో మహిళల ప్రవేశం అంశంలో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది. హిందూ దేవాలయాలలో మహిళల ప్రవేశానికి వ్యవహరిస్తున్న దూకుడు దర్గా విషయంలో కనబరచటం లేదనే విమర్శలను కొట్టిపారేస్తూ.. హాజీ ఆలీ దర్గా విషయంలో భయంతో పారిపోలేదని స్పష్టంచేశారు. మా ఉద్యమంలో ఎలాంటి తేడాలు లేవని అంటున్నారు. హాజీ ఆలీ దర్గాలోకి 7.30 గంటల తరువాత పబ్లిక్‌కు లోనికి అనుమతి లేదు. మీరు కావాలనే ఆలస్యంగా వచ్చారనే విమర్శలు కూడా లేకపోలేదంటే పూణె నుంచి తాను ఉదయం 10.30 గంటలకు బయలుదేరానని, దాదర్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోవటం వల్ల ఆలస్యంగా దర్గాకు వచ్చానని సమాధానం చెప్పింది. అప్పటికీ నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగిందని, ఎఐఎంఐఎంవారు తనపై దాడికి పాల్పడటం కూడా జరిగిందని వెల్లడించింది. హాజీ ఆలీ దర్గాలో తనపై దాడి జరిగినా భయపడి పారిపోలేదని, ఈ పోరాటంలో కూడా విజయం సాధిస్తామని వెల్లడించింది. ఆరేళ్ల క్రితం భూమాత బ్రిగేడ్‌ను తనతో పాటు మరో ముగ్గురితో ప్రారంభించిన తృప్తి దేశాయ్ నేడు నాలుగు వేల మంది సభ్యులతో మహారాష్టల్రో 21 శాఖలతో విస్తరించింది. అంతేకాదు భగవంతుడ్ని పూజించటానికి మహిళ పట్ల చూపించే అసమానతల పైనే తన పోరాటం అని ఆమె పేర్కొంటుంది. కొల్హాపూర్ ఆలయాంలోకి చీరతో కాకుండా సల్వార్ కమీజ్‌తో వెళ్లాలని ప్రయత్నించి విఫలమైంది. తన పోరాటం కులాలు, మతాలలో మహిళల పట్ల చూపిస్తున్న అసమానతలపైనేనని పేర్కొంది. హాజీ ఆలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై త్వరలో కార్యచరణ రూపొందించి మరో ఆందోళన కొనసాగిస్తామని అంటుంది.