Others

ఏకీకృత సర్వీసుతో కొత్త సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు ఉపాధ్యాయుల ‘ఏకీకృత సర్వీసు రూల్స్’కు రాష్టప్రతి ఆమోద ముద్ర లభించింది. ఇక అమలులోకి రావడమే ఆలస్యం. ఈ విధానం అమలులోకి వస్తే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. పం చాయతీరాజ్ పరిధిలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ. వారికి రాజకీయ పలుకుబడి ఎక్కువే. ఇక, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య స్వల్పం. వారికి రాజకీయ అండలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందువల్లనే చిరకాలంగా వారికి కొన్ని హక్కులు దక్కలేదు. ఏకీకృత రూల్స్ చెల్లవని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా దానిని లెక్కచేయకుండా రెండు దశాబ్దాలుగా ఉద్యమించిన పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు అనుకున్నది సాధించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఒకే పేరు పెట్టడానికి అభ్యంతరం ఏమిటి?
ఏకీకృత సర్వీసు రూల్సు అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని కొందరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సూచించారు. నిజానికి కమిటీ ఎందుకో అర్థం కావడం లేదు. నేరుగా అమలు చేయవచ్చు గదా. మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సం ఘాల ఉపాధ్యాయులు పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల వలే స్థానిక సంస్థలకు చెందిన వారే. అందువల్ల ఏకీకృత సర్వీసు రూల్సు వారికి కూడ వర్తించపచేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)లకు చెందిన ఉపాధ్యాయులు గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఆనాడు వారు ఏజెన్సీ డిఇఓల కింద పనిచేసేవారు. అప్పుడు వారు పదోన్నతులు పొందారు. 1960వ దశకంలో ఏజెన్సీ డిఇవో పోస్టులు రద్దయి సదరు ఉపాధ్యాయులు ఐటిడిఏ సంస్థల కిందకు వచ్చారు. అప్పటినుండి వారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పరిగణించబడలేదు. ఇప్పుడు వారు కూడ ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేయాలని కోరుతు దశలవారీగా ఉద్యమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. వీరు కోర్టులకి వెడితే సమస్య ఇప్పట్లో తేలదు. మళ్లీ విద్యారంగం అస్తవ్యస్తమవుతుంది. ఇప్పటికే మన విద్యావ్యవస్థ కుక్కలు చింపిన విస్తరిగా తయారైంది. ఈ పరిస్థితుల కారణంగా ప్రైవేటు విద్యారంగం విస్తరించింది. ప్రజలకు కూడ ప్రభుత్వ పాఠశాలలంటే నమ్మకం సడలిపోతోంది. దీనికి తోడు ఉపాధ్యాయుల బదిలీల సమస్య నానాటికీ జటిలమైపోతోంది.
విద్యారంగాన్ని గాడిలో పెట్టే సత్తా ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. ఒక పాఠశాల చక్కగా సాగాలంటే మూడు ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి యాజమాన్య నిర్వహణ, రెండు ఉపాధ్యాయులు, మూడు పర్యవేక్షణ. ఈ మూడూ చాలాకాలంగా డీలా పడ్డాయి. పూర్వం ఎయిడెడ్ సంస్థలు, జిల్లా బోర్డులు, పురపాలక సంఘాలు పాఠశాలలను నిర్వహించేవి. ఇప్పడు వాటి ప్రభావం నామమాత్రమైంది. అందువలన జవాబుదారీ తనం లోపించింది. ఇక ఉపాధ్యాయులు ఏ పాఠశాలలోను పూర్తిగా ఉండరు. డిప్యుటేషన్లు, విద్యా వాలంటీర్ల పేరిట పిల్లల చదువు సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వానికి పిల్లల చదువుకంటే ఉపాధ్యాయుల సర్వీసు రూల్సు ప్రధానమైపోయాయి. వికేంద్రీకరణకు బదులు పరిపాలన మరీ కేంద్రీకృతమైపోయింది.
మండల వ్యవస్థ ప్రారంభం కాగానే పాఠశాలల పర్యవేక్షణ తగిన రీతిలో సాగడంలేదు. అందుకు కారణం మండల విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యయుల జీతాలు చెల్లించడం, వారికి సెలవులు మంజూరు చేయడం వంటి పనులు అప్పగించడం. ఇది మేనేజిమెంటు పని. అందువలన ఎంఇఓలకు పాఠశాలలపై పర్యవేక్షణకు తగినంత సమయం లభించడంలేదు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచడానికి రెండు మండలాలకి ఒక పర్యవేక్షణ అధికారిని నియమించాలి. డిఇఓలకి కూడా మేనేజిమెంటు పనులు అప్పగించడంతో విద్యా ప్రమాణాల విషయంలో కృషి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఉపాధ్యాయుల బదిలీల పేరుతో వారిపై బాధ్యతలు పెంచుతున్నారు. ఇవి ఎంఇఓల పనులు కావు. జిల్లా పరిషత్తులు నిర్వహించినంత కాలం విద్యారంగం చక్కగా సాగింది. కనుక డిఇఓలకు, ఎంఇఓలకు మేనేజిమెంటు పనులు తొలగించి పర్యవేక్షణ బలోపేతం చేయాలి. ఇక, ఇప్పుడు కొన్ని పురపాలక సంఘ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టారు. మిగిలిన పాఠశాలల్లో ఇంగ్లీషు, తెలుగు మీడియంలు వున్నాయి. ఇంగ్లీషు మీడియంలో బోధించగల సామర్ధ్యం ఎంతమంది ఉపాధ్యాయులకి ఉంది? సమాచార హక్కు చట్టం సాయంతో ఈ విషయం పరిశీలించినప్పుడు బండారం బయటపడుతుంది. ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న తమ పిల్లలు ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడగలరని అనుకోవడం భ్రమ.

-వేదుల సత్యనారాయణ