Others

దొరికితే దొంగ.. లేకుంటే సెలబ్రిటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్రప్రసాద్ ఒక చానల్‌లో మాట్లాడుతూ ‘సినీరంగంలో కొందరు తగిన గుర్తింపు రాలేదనే ఆవేదనతో డ్రగ్స్‌కు బానిసలైనారు’ అని ఒక తర్కాన్ని తెరమీదకి తెచ్చారు. కొలంబియాలో డ్రగ్స్ కుటీర పరిశ్రమ- నిజమే ఐతే ఇండియాను ఆర్థికంగా నైతికంగా ధ్వంసం చేయడానికి శత్రు దేశాలు ఇక్కడికి డ్రగ్స్‌ను పంపుతున్నాయి. ఇదీ ప్రధాన సమస్య. ఎవరెవరికి నోటీసులు అందాయో, కేసులు నడిచాయో అందరికీ తెలుసు. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లనక్కరలేదు. ఎవ్వరినీ వ్యక్తిగతంగా అవమానించటం, అనుమానించటం కూడా లక్ష్యం కాదు. ఇక్కడి ప్రధాన సమస్య వ్యవస్థ. ‘మా’ డ్రగ్స్ ముఠాను వెనకేసుకొని కాపాడనక్కరలేదు. బాహుబలి ఆర్థికంగా ఘనవిజయం సాధించి, దగ్గరదగ్గర 2 వేల కోట్లు వసూలు చేసినప్పుడు ఆ విజయాన్ని మొత్తం పరిశ్రమ విజయంగా అభివర్ణించుకున్నది. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో డజన్లకొద్దీ ప్రముఖులపై ఆరోపణలు వచ్చినపుడు అందుకు పరిశ్రమ బాధ్యత వహించి తప్పులు దిద్దుకోవాల్సి ఉంటుంది.
కేరళ, కర్నాటకలల్లో డ్రగ్స్‌తో రేవ్ పార్టీలు నిర్వహించే పబ్స్ లేవా? ఒక్కసారి హైదరాబాద్ మాత్రమే వార్తల్లోకి ఎందుకు వచ్చింది? అని ఒకరు ప్రశ్నించారు. ‘డ్రగ్స్‌ను బడా బడా వాళ్లు, వాళ్ల పిల్లలు తీసుకుంటున్నారు. వారి కెరీర్‌కు భవిష్యత్‌లో అడ్డం రాకూడదని తిమింగలాలను వదలి చిరుచేపలను పట్టుకున్నారు’- ఇది మరో వాదం.
డ్రగ్స్ మహమ్మారి బారిన పడిన ఫిలిప్పైన్స్, కాంగో, మెక్సికోవంటి దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయి. పంజాబు డ్రగ్స్ రాజధానిగా మారింది. ఇపుడు హైదరాబాద్‌కు ఆ గతి పట్టింది. సెక్షన్ 67 ఎ, బి, సిల ప్రకారం డ్రగ్స్ అమ్మినా, కొనినా, వాడినా చట్టరీత్యా నేరం. ఏడేండ్ల క్రితం హైదరాబాద్‌లో కొందరు ప్రముఖ సినీనటులు పట్టుబడితే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు 2017 జూలై ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్న జాబితాలో ఖచ్చితంగా 200 పేర్లున్నాయి. వీరిలో నటులు, సంగీత దర్శకులు, నిర్మాతలు, వారి బిడ్డలు, నటీమణులు ఉన్నారు. నెదర్లాండ్స్, జర్మనీల నుంచి లెటర్స్ రూపంలో డ్రగ్స్ అందాయి. ఒక లీటర్ మాదక ద్రవ్యం ఖరీదు కోట్లల్లో ఉంటుంది. దానిని డైల్యూట్ చేసి చిన్న కాగితం ముక్కనుంచి ఐదు వేల రూపాయలకు అమ్ముతున్నారంటే ఇది ఎంత లాభసాటి వ్యాపారమో అర్థం చేసుకోవచ్చు. చాలా పొలాల్లో పైకి కంది, వరి వంటి పంటలు కనిపిస్తాయి. చాటుగా గంజాయి పండిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తర్వాత కేరళ ఈ డ్రగ్స్ ముఠాల స్థావరంగా మారింది.
అకున్ సబర్వాల్ అందించిన సమాచారం ప్రకారం నిఖిల్ శెట్టి గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి కెల్విన్‌కు సరఫరా చేశాడు. కొన్ని వందల మంది ఈ వ్యాపారంలో ఉన్నారు. సినీ పరిశ్రమతోపాటు పాఠశాలల్లో, కళాశాలలు, సాఫ్ట్‌వేర్ రంగాలు ఉన్నాయి. అంటే ఇదొక అంతర్జాతీయ కుట్ర అని తెలుస్తున్నది.
ఏషియన్ అథ్లెట్స్ స్పర్థలో మహిళల షాట్‌పుట్ విభాగంలో స్వర్ణం సాధించిన మన్‌ప్రీత్ కౌర్ మాదకద్రవ్యాలు సేకరించి ఆడినట్టు నిజనిర్థారణ కమిటీ నిర్ణయించిందన్నది ఒక వార్త. ఇలాంటి వార్తలు తరచూ క్రీడారంగంలో, కళారంగాలలలో వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ మాదకద్రవ్యాల వాడకం, అమ్మకం చేస్తూ ఉంటుంది. నిన్నటివరకూ బాలీవుడ్‌కే పరిమితమైన ఈ రోగం నేడు టాలీవుడ్‌కు కేన్సర్‌లా పాకింది. దొరికినవాడే దొంగ అన్నట్టు నటుడు రవితేజ, పూరి జగన్నాథ్, శ్యాం కె నాయుడు, ఛార్మీలు మాత్రమే ‘డ్రగ్గిస్టు’లు కారు. దొరకని దొంగలు, చాలా పెద్దవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ల జోలికెళ్లడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు భయమా? ‘కొరియర్లు’ అందించిన సమచారం ద్వారా ఈ డ్రగ్గులు జర్మనీ, బెలూచిస్తాన్, ఆప్ఘనిస్తాన్, నైజీరియా వంటి దేశాలనుండి వస్తున్నాయి. ‘మా డ్రగ్గుల అమ్మకందారులపై చర్య తీసుకుంటే ఖబడ్దార్’ అని లోగడ నైజీరియా బెదిరించటం జ్ఞాపకం చేసుకోండి.
ఈ వృత్తాంతాలు చదువుతున్న ఒక సామాన్యుడు ఇలా అంటున్నాడు.
‘ఖాన్‌త్రయం బాలీవుడ్‌లో హత్యలు నిషిద్ధ హరిణాల వేటలు చేసి చట్టానికి చిక్కకుండా బయటపడ్డారు. ఏదో ఎల్‌ఎస్‌డి టాబ్లెట్లు మింగాడని తెలుగువాళ్ళని అరెస్టు చేస్తే బయటపడలేరా ఏమిటి? మెడికల్ షాపులో తలనొప్పికి ఆస్ప్రో టాబ్లెట్ ఇవ్వండని అడిగితే ఏదో తెల్లటి స్టెరాయిడ్ అలర్జిన్ ఇచ్చారు. అది షాపువాళ్ళ తప్పు.
‘మా’ చిత్ర సంస్థ అధ్యక్షుడు శివాజీరాజా మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరో నూటికి కోటికి ఒకరు డ్రగ్స్ తీసుకుంటే దానిని మొత్తం ఫిలిం ఫీల్డుకు అంటగట్టడం కూడదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున తీసుకుంటే ‘అది తప్పు బాబూ’ అంటూ బుద్ధులు చెప్పి (కౌనె్సలింగ్) పోలీసులు పంపివేస్తారు. భయం లేదు’ అన్నారు. నిజమే కదా మరి!

-ముదిగొండ శివప్రసాద్