Others

చార్మి ట్విస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రగ్స్ కేసును హైకోర్టు మెట్లెక్కించడం ద్వారా హీరోయిన్ చార్మి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. సిట్ విచారణ తీరు అనుమానాస్పదంగా ఉందని, రాజ్యాంగ విరుద్ధమైన విచారణాంశాల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. మరో 48 గంటల్లో సిట్ ముందు హాజరుకావాల్సిన చార్మి హైకోర్టు మెట్లెక్కడంతో -కేసు ఎటు మలుపు తిరగబోతోందన్న ఆసక్తి పెరిగింది. అందరితోపాటుగానే నటి చార్మికీ నోటీసులు జారీ చేసిన అధికారులు -26న విచారణకు రావాలంటూ పేర్కొన్నారు. మహిళ కనుక కోరుకున్నచోటే విచారిస్తామని సూచించారు. అయితే, ఎక్సైజ్ కార్యాలయానికే వస్తానని చెప్పిన చార్మి -అకస్మాత్తుగా హైకోర్టును ఆశ్రయించటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటి వరకూ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్న వాళ్లనుంచి బ్లడ్, గోళ్లు, వెంట్రకల శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల నిమిత్తం సిట్ టీం సేకరించడం తెలిసిందే. ఆ అంశం ఆధారంగానే ఇప్పుడు చార్మి కోర్టుకెళ్లింది. తన అనుమతి లేకుండా బ్లడ్ శాంపిల్స్, వెంట్రకల నమూనాలను సేకరించటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, నార్కోటిక్స్ చట్టంలోని ఆర్టికల్ 20, సబ్‌క్లాజ్ 3ని ప్రస్తావించినట్టు సమాచారం.
గడచిన మూడు నెలల కాలంలో డ్రగ్స్ తీసుకుంటే -దాని ఆనవాళ్లు వెంట్రుకలు, గోళ్లలో వినా మరెక్కడా తెలిసే అవకాశం లేదు. ఒకవేళ చార్మి ఈ మూడు నెలల కాలంలో డ్రగ్స్ తీసుకునివుంటే, ఈ విషయాన్ని నిర్థారించడానికి ఉన్న ఏకైక మార్గం -వెంట్రకలు, గోళ్లను పరీక్షించడమే. ఈ విషయంలోనే ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుంది? చార్మి డ్రగ్స్ వాడిందో లేదో నిర్థారించడం ఎలా? అధికారులు ప్రత్యామ్నాయ మార్గానే్నమైనా అనుసరిస్తారా? ఆమె డ్రగ్స్ వాడివుంటే, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడకు దిగిందా? ఎవరూ చెప్పని అభ్యంతరాలు చార్మియే ఎందుకు చెబుతోంది? లాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఏదేమైనా సిట్ టీంకు చార్మి ఇచ్చిన ట్విస్ట్ -సంచలనమవుతోంది.