Others

బస్కీల మొనగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంటలో 2500 బస్తీలు తీసి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించాడు ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్‌టన్ విలియమ్స్! ఇతగాడి వయసు 52. గంటసేపు జరిగిన ఈ విన్యాసాన్ని వీడియో రికార్డు చేసి, యూ ట్యూబ్‌లో పెట్టడంతో బోలెడంత హిట్టైంది. ఇది జరిగి రెండేళ్లు గడిచిపోయాక ఈ మధ్యనే మళ్లీ తన రికార్డును బద్దలు కొట్టేశాడు అదే గంటలో 2,682 బస్కీలతో. భవన నిర్మాణ కార్మికుడైన విలియమ్స్ ‘ఈ విన్యాసంలో నన్ను పడగొట్టే మొనగాడే లేడని నిరూపించుకోవడమే నా ఉద్దేశం’ అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈ విన్యాసంలో నిబంధనల ప్రకారం.. మోచేతులు వంచకుండా, శరీరం 90 డిగ్రీల కోణంలో నిటారుగా భూమిపై ఉంచి బస్కీలు తీయాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారి ఈ విన్యాసం ప్రారంభించాక మధ్యలో విరామం తీసుకోవడానికి వీల్లేదు. అదే విలియమ్స్ గొప్పతనం.