Others

అసహనమే అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో అసహనం పెరిగిపోయింది. ఈ అసహనం ఇందిరాగాంధీతో మొదలైందనిపిస్తుంది. ఆవిడ మొదటి నుండి ‘జగమొండి’ అని పేరుపొందారు. ప్రజాస్వామ్యంలో కోర్టులకు ప్రత్యేక గౌరవం ఉంది. శాసనసభ్యులు గానీ, మంత్రులు గానీ ‘లక్ష్మణరేఖ’ దాటితే దేశానికి న్యాయస్థానాలే దిక్కు. ఇందిరాగాంధీకి కోర్టు తీర్పులపై నమ్మకం లేదు. అలహాబాద్ హైకోర్టు తీర్పు తనకి ప్రతికూలంగా వచ్చినపుడు ఆమె దేశంలో ‘ఎమర్జెన్సీ’ విధించింది. నిజానికి ‘ఎమర్జెన్సీ’ విధించాల్సిన పరిస్థితులు అప్పుడు లేవు. కోర్టు తీర్పును గౌరవించి ఉంటే ఆమె స్థాయి బాగా పెరిగేది. కానీ, అందుకు అసహనం అందుకు అడ్డువచ్చింది. అసహనంలో సోనియాగాంధీ ఇందిరాగాంధీకి ఏ మాత్రం తీసిపోరనే చెప్పాలి. కాంగ్రెస్ యువరాజు రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియా చేయని ప్రయత్నాలు లేవు. ప్రజాభీష్టం మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడవచ్చు. అయితే, తలుపులు మూసివేసి పార్లమెంటులో విభజన బిల్లును ఆమోదించాలా? ఎన్నికల్లో గెలుపు కోసం ఈ స్థాయికి దిగజారిపోవాలా? సోనియా పి.వి.నరసింహారావును ఎలా అవమానపరిచిందో అందరికీ తెలుసు. రాజీవ్‌గాంధీ కూడా ఏమీ తక్కువ తినలేదు. తెలుగు ముఖ్యమంత్రి అంజయ్యను, విదేశాంగ కార్యదర్శిని ఆయన ఏవిధంగా అవమానించింది పత్రికల్లో చదివాం.
ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రికి అసహనం బాగా వుంది. మంత్రులే నోరువిప్పి మాట్లాడడం లేదు. మేధావులను అణచివేయడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. సుపరిపాలన అందించేటప్పుడు ఇవన్నీ అవసరమా! చంద్రబాబు మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి అయ్యాక కొన్నిసార్లు అసహనం (తెలంగాణ విషయంలో) ప్రదర్శించి తన స్థాయి తనే తగ్గించుకున్నారు. అయితే, తర్వాత తన తప్పును తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారవేత్త అయిన ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తు ఏమిటో ఎవరికీ అర్థం కాదు. వచ్చే ఎన్నికల నాటికి తానెక్కడుంటాడో? తన పార్టీ వుంటుందో లేదో తెలియదు. అయినా మూడు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా వుండాలని ఆయన కోరిక! రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలన్నది ఈయన వాదన. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ సహాయం చేయడానికి కేంద్రం ఒప్పుకుంది. పైగా 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ఇకముందు ప్రత్యేక హోదా వద్దని చెప్పింది. ఇక, ఒక మహిళా ఎంఎల్‌ఏ ప్రవర్తన మరీ వింతగా వుంది. చంద్రబాబు బీదవాడని ఎవరో ఎక్కడో చెప్పారట! బీదవాడైన ఆయన ఖరీదైన ఇళ్లు ఎలా కట్టారన్నది ఈమె ప్రశ్న. ఎన్నికలలో పోటీ చేసేముందు రాజకీయ నాయకులు వారి ఆస్తిపాస్తులు ప్రకటిస్తారుగా. అది కూడా తెలియని ఎంఎల్‌ఏకు అసహనం విపరీతంగా పెరిగిందని గ్రహించాలి. ఇటీవల న్యాయమూర్తులలోను అసహనం పెరుగుతోంది. న్యా యమూర్తి కన్నణ్ హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టుకి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసారు. సుప్రీంకోర్టునే ఎదిరించి చిక్కుల్లో పడ్డారు. పెద్దనోట్ల రద్దు వివాదాస్పదమైంది. కేంద్రంలో పూర్వ ఆర్థిక మంత్రులు మన్‌మోహన్ సింగ్, చిదంబరం ప్రధాని మోదీ చర్యను వ్యతిరేకించారు. నల్లధనం కొన్ని దశాబ్దాల క్రితమే ప్రమాద స్థాయిని దాటిందని వీరికి తెలియదా? నాయకులు ఇలా తిక్కతిక్కగా ప్రవర్తిస్తే ఓటర్లు మైనస్ మార్కులు వేస్తారు.

-ఇమ్మానేని సత్యసుందరం