Others

చర్మ క్యాన్సర్‌కు సరికొత్త చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను ఆధునిక వైద్యంలో ఎన్నో మందులు వచ్చాయి. చర్మ క్యాన్సర్‌కు కూడా సరికొత్త మందును కనిపెట్టారు. చర్మంపై వచ్చే క్యాన్సర్‌కు కారణమైన మెలనోమా కణాల నిర్మూలనకు ఈ మందు బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. సాధారణ కణాలతో పాటు ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా ఈ మందు అడ్డుకట్ట వేస్తోంది. ఈ మందుకు హెచ్‌ఎ15 అని నామకరణం చేశారు. వాస్తవానికి మెలనోసైట్ల కణజాలం వల్ల చర్మం రంగు మారుతూ ఉంటుంది. చర్మ క్యాన్సర్ కణాలు మూడు దశల్లో పెరుగుతాయి. ఆ దశలను గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రేడియల్ స్టేజ్‌లో కణాలు విస్తరిస్తుంటాయి. వెర్టికల్ స్టేజిలో అంతశ్చర్మంలో ఈ కణజాలం దాడిచేస్తోంది. చివరిగా మెటాస్టాటిక్ స్టేజీలో ఫెరిఫెరల్ కణజాలంలో క్యాన్సర్ కణజాలం వ్యాపిస్తోంది. చివరి దశలో ట్రీట్‌మెంట్ తీసుకున్నా ఈ మందు ప్రభావం క్యాన్సర్ నిర్మూలనకు దోహదం చేస్తుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. నైస్ సోఫియా యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్తలు ఈ మందును కనుగొన్నారు. ఈ కొత్త మందు వల్ల జీవనప్రమాణం పది సంవత్సరాలకు రెట్టింపు చేస్తోంది. మొదట్లో ఈ మందు టైపు-2 మధుమేహంలో గుర్తించారని యూనివర్శిటీకి చెందిన స్టీఫెన్ రోచీ వెల్లడించారు. తొలుత క్యాన్సర్ నిర్మూలనకు ఉపయోగించాలనుకుంటే ప్రొఇన్సులిన్ తొలగించటానికి అని పరిశోధనల్లో రావటంతో దీన్ని పునఃనిర్మాణం చేయాల్సి వచ్చిందిన స్టీఫెన్ రోచీ వెల్లడించారు. చాలా ప్రయోగాలు చేసిన తరువాత స్కిన్ క్యాన్సర్ నిర్మూలనకు ఈ మందు బాగా పనిచేస్తుందని వెల్లడైందని తెలిపారు.