Others

ఇదేం ప్రజాస్వామ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ ఊహించినట్టుగానే నితీశ్ కుమార్ బిహార్ సిఎం పదవికి రాజీనామా చేసి, మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ప్రత్యర్థుల బలహీనతలను వాడుకొని రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికలలో తన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో ప్రధాని మోదీ ఇలా రాజకీయం చేశారు. రాజకీయంగా మోదీ వ్యవహరించిన పద్ధతి సరైనది కావచ్చు. నైతికంగా గీత దాటారనే విషయం సుస్పష్టం. ఆర్.జె.డితో కలిసి ఉన్నపుడు అది పవిత్రబంధమా? అపవిత్ర బంధమా? అన్న విషయం నితీశ్‌కు రెండు సంవత్సరాలు వృథా చేసిన తరువాత తెలిసిందా? బిజెపి మద్దతుతో మళ్లీ సిఎం పదవిని చేపట్టిన నితీశ్ కేవలం రెండు సీట్ల ఆధిక్యతతో ప్రభుత్వాన్ని నడపాలి. ఇటువంటి పరిపాలన- ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను వాడుకోవాలా? లేక మధ్యంతర ఎన్నికలకు దారితీస్తుందా? అనేది వేచి చూడాలి.
రాష్టప్రతి, ఉప రాష్టప్రతి అభ్యర్థుల నిర్ణయం, ఎన్నిక ఏ రకమైన వాతావరణంలో జరిగిందో విజ్ఞులు ఆలోచించవలసిన అవసరం ఉంది. దొంగ, దొంగను పట్టుకునేవాడు ఒకేదారిలో నడుస్తున్నట్టు వున్నది. దొంగ ఎవరో? అతనిని పట్టుకొనేవాడు ఎవరో? ప్రజలకు అర్థం కావటం లేదు. జనం ఓటు వేసి గెలిపించిన ప్రజా నాయకులు ఎవరి పక్కన ఎప్పుడు వుంటున్నారో తెలుసుకోవటం విషమ సమస్యగా మారింది. అత్యుత్తమ పదవికి జరిగే ఎన్నికలలో మనసా వాచా కర్మణా తమ పార్టీ అభీష్టానుసారం ఓటు వేయలేకపోతున్నామే, దేశానికి న్యాయం చేయలేకపోతున్నామే అనే భావన లేకుండా పోయింది. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, వైఎస్ కాంగ్రెస్ పరస్పర విరుద్ధ భావాలున్న పార్టీలు. విచిత్రమేమిటంటే ఈ మూడు పార్టీల వారూ బిజెపి ప్రకటించిన రాష్టప్రతి అభ్యర్థినే బలపరిచారు. అభ్యర్థి గుణగణాలను చూసి సమర్థించారా? పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా వోటు వేయాలనుకున్నారా? దేశ ప్రతిష్ఠ కాపాడుకోవాలనుకున్నారా! నూట ముప్ఫై కోట్ల జనాభాలో అవినీతికి, రాజకీయాలకు దూరంగా వుండే ఇద్దరు నిస్వార్థపరులను రాష్టప్రతి, ఉప రాష్టప్రతిగా అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో గుర్తించలేకపోతున్నాము. రిజర్వేషన్లు అవసరం లేనిచోట రిజర్వేషన్లకు ప్రాధాన్యతనిచ్చి ఆ పదవుల ఔన్నత్యాన్ని, పవిత్రతను గమనించలేకపోతున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని విభజిస్తున్నారు.
ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి అనుకూలంగా వుంటే, తాము వ్యతిరేకం అయితే తమ తమ ఉనికికి ఇబ్బంది వస్తుందేమో, కేసుల్లో ఇరికిస్తుందేమోనని పార్టీ అంతరాత్మ ప్రబోధానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. వ్యక్తుల, పార్టీల అంతరాత్మ ప్రభోద వ్యత్యాసం తెలుసుకోవలసిన అవసరం ఉంది. వీళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర పార్టీల నేతలను పిలిపించుకొని, తను అనుకున్న అభ్యర్థి గెలుపునకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ తరువాత తమ ఇష్టానుసారం అభ్యర్థులను ప్రకటించుకున్నారు. సరైన ప్రతిపక్షం లేదని దేశం పక్కదారి పడుతున్నదని ప్రజలు భావిస్తుంటే ఇంకోపక్క కొన్ని విపక్ష పార్టీలు బిజెపి నిరంకుశ విధానాలకు తాళాలు వేయటం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజకీయంగా తప్పుపట్టటానికి వీల్లేదు. ఉప రాష్టప్రతి ఎన్నికకు 706 మంది సభ్యులలో 406 మంది ఎన్‌డిఏ భాగస్వామ్యంలో చేర్చుకోవటం జరిగింది. బిజెపి భావజాలానికి వ్యతిరేకంగా వున్న పార్టీలు మన రాజ్యాంగానికి న్యాయం చేస్తున్నామా? అని ఆలోచించుకోవలసిన అవసరం వుంది. సంకుచిత అభిప్రాయాలు వున్న ఇటువంటి పార్టీలను ఎందుకు ఎన్నుకుంటున్నామో ప్రజలు అర్థం చేసుకోవాలి.

-కందిబండ నరసింహారావు సెల్ : 94407 48159