Others

గ్రంథాలయాల గతి మారదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథాలయాలు నేడు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కొద్దిమంది ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ గ్రామాల్లో చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు నివసిస్తున్నారు. వారందరిలో చైతన్యం రావాల్సిన అవసరం వుంది. గ్రామాల నుండి విజ్ఞానం వెల్లివిరిసిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మాగాంధీ విశ్వసించారు. కానీ, నేటి ఆధునిక యుగంలో గ్రామాల్లో గ్రంథాలయాలు కానరావడం లేదు. ఎక్కడైనా వసతులు సమృద్ధిగా వున్నప్పుడే వాటిని ఉపయోగించుకునేందుకు ప్రజలు ఉత్సుకత చూపిస్తారు. వసతులే లేకుంటే ఇక వాటిని ఉపయోగించుకునే వారెవరుంటారు? నేడు విజ్ఞానం ఎంతగా పెరిగినా, పుస్తకాల ప్రాధాన్యత తగ్గలేదనే చెప్పాలి. గతంలో ఇంట్లో పెద్దలు ఎక్కువగా పుస్తకాలను, వార్తాపత్రికలను చదివేవారు. వారిని చూసి పిల్లలు కూడా పుస్తకాలను చదివేవారు.
ఈరోజుల్లో టీవీ, సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌తో పెద్దలే కాలాన్ని దుర్వినియోగం చేస్తుంటే ఇక పిల్లలు ‘నాలుగాకులు ఎక్కువే చదివినట్టు’ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో పుస్తకాల స్థానంలో టీవీలు వచ్చి చేరాయి. ఈ సంస్కృతిలోకి విద్యార్థులు, యువత ఆకర్షితులు కాకుండా లైబ్రరీల వైపు వారి దృష్టిని మళ్లించాల్సిన బాధ్యత పెద్దలపై వుంది. విదేశాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం మన దేశంలో కూడా రావాల్సిన అవసరం వుంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యార్థులు మన దేశంలో ఎక్కువగా వుంటున్నారు గనుక వారి అభిరుచులకు తగినట్టుగా ప్రతి గ్రంథాలయాన్ని ఆధునీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది. పుస్తక పఠనం పట్ల యువతలో ఆసక్తి పెరిగేలా పాలకులు చర్యలు తీసుకోవాలి.
చరిత్రలో గొప్ప గొప్ప మహనీయులు- వారి మనసుల్లో ఉద్భవించిన అద్భుతమైన ఆలోచనలకు అక్షర రూపం కల్పించి పుస్తకాలను అందించారు. అవన్నీ నేడు లైబ్రరీల్లో పాఠకుల కోసం ఎదురుచూస్తూ బూజుపట్టిపోతున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో మనం మహనీయుల జ్ఞాపకాలను మరచిపోతున్నాం. ఒకప్పుడు పుస్తకాలు మనకు విజ్ఞానాన్ని అందించే నేస్తాలు. ఇపుడు ఎవరూ వాటి ఊసే ఎత్తడం లేదు. విద్యార్థులు నేటి విద్యా విధానంలో రోబోల్లా మారుతున్నారు. మానవ సంబంధాలకు, పుస్తక పఠనానికి, నైతిక విలువలకు దూరం అవుతున్నారు. వీరిలో పఠనాసక్తిని పెంపొందించేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలి. ప్రతి పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పించాలి. ప్రాథమిక విద్యలోనే పుస్తకాలపై మక్కువను, పత్రికలపై ఆసక్తిని పెంపొందించగలగాలి. ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ చూపాలి. జాతినేతలు, దేశభక్తి, ఉన్నత విలువల గురించి విద్యార్థులకు అవగాహన పెంచేందుకు గ్రంథాలయాలను అందుబాటులో ఉంచాలి. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పోటీతత్వాన్ని పెంచేలా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి.

-సూరం అనిల్