Others

ఉలూక బంధనం.. మణిగ్రీవకుబేర శాపవిమోచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశోదమ్మ చిన్ని కుమారుడు నందవ్రజానికే తలమానికమైనాడు. ఆబాలగోపాలాన్ని అలరిస్తుండేవాడు. గోపికలను ఆటపట్టించేవాడు. తన తోడి సంగడీలకు ఇంట్లోని వెన్నమీగడలు పెట్టేవాడు. వారంతా కృష్ణయ్యతో ఆడుకోవడానికే మక్కువ చూపేవారు. తన బృందాన్నంతా తీసుకొని రేపల్లె అంతాతిరుగుతూ అందరి ఇండ్లల్లోని వెన్నమీగడలు దొంగలించుకుంటూ తిరుగుతు తిరిగేవాడు. అట్లాంటి కృష్ణయ్య ఎన్నో చిలిపిపనులు చేసేవాడు. పోతనామాత్యుడు భాగవతంలో కృష్ణయ్య కథ చెబుతూ ఆనందం పొందాడు. ఆ కృష్ణయ్య చిలిపి పనులకు అందరూ వెరిచేవారు. తాను వెన్న తిని ఇంటికోడలి మూతికి పూసి అత్తకోడళ్ల మధ్య తగవు పెట్టేవాడు. తాను వెన్న తిని పోతూ పోతూ ఒకరింటి కడవను మరొకరి ఇంట వాకిట పెట్టేవాడు. తాను తిని ఆ ఇంట్లోని దేవుని పటాలకు పూసి పోయేవాడు. వారు గదమాయిస్తే నాకన్న వేల్పులెవరైనా ఉన్నారా వెలదుల్లారా అని అడిగేవాడు. కోతులను ప్రియమారా పిలుస్తూ వాటికి ఇండ్లల్లోని పాలు పెరుగులను, వెన్నమీగడను అందించేవాడు. స్నేహితులతో కలసి గోవులను మేపడానికి అడవికి వెళ్లేవాడు. అక్కడ వారితో కలసి చల్ది తినేవాడు.
కృష్ణయ్య తింటూ వారికి పెడుతుంటే ఆదమరిచి ఆత్మీయతతో పరబ్రహ్మానికే గోపబాలురంతా చల్దిని తినిపించడమనే ది అపురూపమైన ఆనందకరమైన ఘట్టం. ఈచల్ది కుడవడాన్ని చూడడానికని బ్రహ్మాది దేవతలంతా వినువీధిన నిలిచేవారట. ఇలాంటి కృష్ణయ్య ను అదుపు చేద్దామని ఒకనాడు యశోదమ్మ కృష్ణుని రోటికి కట్టివేసింది. ఆ రోలును తీసుకొని వెళ్లి వెళ్లి మద్దిచెట్ల మధ్య పెట్టి ఆ మద్దిచెట్ల రూపంలో ఉన్న నలకూబరుడు, మణిగ్రీవులకు శాపానుగ్రహం చేశా డు. ఇదే ఉలూక బంధనం అని కీర్తించారు పెద్దలు ఇలా ఆడుకుంటున్నట్టుగానే ఎందరి రాక్షసులనో చంపివేశాడు. పుట్టిన నాటి నుంచి నేటి దాకా దుర్జనులను అణుస్తునే ఉన్నాడు కృష్ణయ్య. కృష్ణాష్టమినాడు కృష్ణజననాన్ని పురస్కరించుకుని కృష్ణనామంతో తరించే వారెందరో ఉన్నారు.

- హనుమాయమ్మ