Others

లీలామానుష వేషధారణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీలామానుషవేషధారి నందుని కుమారుడుగా నందవ్రజంలో అందరికీ పరిచయం అయ్యాడు. యశోదమ్మ గారాల తనయుడుగా అందరికీ ముద్దుబిడ్డడైనాడు. దేవకీ వసుదేవులకు పుణ్యాల పంటగా, కంసునికి యమవదనంగా చెరసాలలో పుట్టాడు. పుట్టిన తొలినాటి నుంచి అద్భుతసంఘటనలను తెరదీస్తునే ఉన్నాడు. దుష్టులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. పసికందుగా తల్లి స్తన్యం గ్రోలేవయస్సులోనే పూతన జీవితాన్ని అంతం చేసి ఏమీ తెలియని పసిపాపనిలాగా ఆ క్రూర రాక్షసిపైనే ఆడుకుంటూ ఉండిపోయాడు. అతడిని చూచి యశోదమ్మ నా చిన్ని కుమారుడు ఏమీ తెలియని అమాయకుడని గుండెలకు హత్తుకుని మురిసి మురిపించి దిష్టితీసి వేయించింది. అడుగులు వేస్తూ అందని వాటిని అందుకున్నట్టుగా నడుస్తూ నడుస్తూ శకటాసురుణ్ణి కాలు చేతులువిరగొట్టాడు. అక్కడే ఆడుకుంటూ చిరునవ్వులు మూట గట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంకొంత ఎదిగీ ఎదుగుతుండగానే తృణావర్తునుడి సుడిగాలిగా వస్తే తరిమితరిమి కొట్టాడు. తానే బరువుగా మారి ఆ సుడిగాలికే సుళ్ళు తిరిగించి సంహరించాడు కృష్ణయ్య.
చిరుప్రాయం వాడై అల్లరి చేస్తూ స్నేహితులతోను అన్న బలరామునితో కలసి తిరుగుతూ మట్టిలో ఆడుకుంటూ మట్టినంతా తినివేసేవాడు. ఆ మట్టితినే బాలకుని సామాన్యుడని తలచి బలరామాదులు తల్లియైన యశోదమ్మతో చెప్పగా ఆ తల్లి ఏదిరా మట్టి తింటున్నావు తీయతీయని పాలుమీగడలు నీకు చేదుగా వున్నాయా ఈ మట్టి నీకు తినుబండారం అయిందా అంటూ కోప్పడి తన కౌగిలిలో పట్టుకొని ఏది నీ నోరు చూపించమని అడిగితే ఆ అమాయకురాలైన యశోదమ్మకు మాయ కప్పించి తన నోటిలోనే 14 భువన భాండాగారాలను చూపించాడు. ఆమె అవాక్కై నోటమాట రాక తనే్న చూస్తుండగా తిరిగి నెమ్మదించి ఎంతో అమాయకునిగా ‘అమ్మా! నిజంగా నేను మన్ను తినలేదమ్మా. వీరే నాపు కొండేలు చెబుతున్నారమ్మా’ అంటూ చేతులు నలుముకుంటూ కంట్లో నీరు పెట్టుకుంటూ చెప్పాడా చిన్ని వాడు. అయ్యో నేనెంత పాపిని ఈ చిన్నివాడిని కొట్టబోయాను. గదమాయించాను పాపమీ పాపడు ఎంత నొచ్చుకున్నాడో ఎంత భయపడ్డాడో అని ముద్దులు గురిపిస్తూ తన చేతిలోకి తీసుకొని కృష్ణయ్య ను ఎత్తుకుని చక్కని మాటలు చెబుతూ నీకు వెన్నముద్దలు పెడతాను రారా నాయానా అంటూ ఇంట్లోకి జరిగింది మరిచి పోయి తీసుకెళ్లిన మహా ఇల్లాలు ఆ యశోదమ్మ. అందరి ఇల్లు ఇల్లూ తిరిగి వారి పాడి పంటలను అటు ఇటూ చేసేసి వస్తే అల్లరి భరించలేని గోపాంగనలు యశోదమ్మ దగ్గరకు వచ్చి యెగ్గులు చెప్పారు. ఆమె వారి మాటలు విని కోపం తెచ్చుకుంది. ఏమమ్మా నా కొడుకు అసలేమీ తెలియని చిన్నివాడు. అల్లరే ఎరుగుని అందాలబాలుడు మా ఇంట్లోనే కూర్చుని నా కొంగే పట్టుకొని తిరిగే చిన్ని బాలుని పట్టుకొని మీరు ఇట్లా ఎగ్గులు చెప్పడం ఏం బావుంది అని కసురుకొని పో పొమ్మని చెప్పింది. కాని తన బిడ్డడి ఆగడాలు నిజమేనేమో అనుకొంటూ చూద్దామని లోపలికి వెళ్లింది. అక్కడి చిరునవ్వు లు నవ్వుకుంటూ దొంగనిద్ర పోతున్నడు భువనభూంతరాళాలను పాలించే సృష్టికి ఆధారమైనవాడు. ఇదే కదా మాయ! లీలామానుషవిగ్రహుని లీలలు ఎనె్నన్నో.

- గున్న కృష్ణమూర్తి