Others

ఎవరిని కోరి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా కథకు ఏమైంది? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయ కొన్ని సినిమాలు చూస్తుంటే. నిజ జీవితంలో ఎక్కడోక చోట జరిగిన దాన్ని తీసుకుని కథ వండుకున్నామని చెప్తుండటాన్ని చూస్తుంటే -ఆ తప్పుల్ని ప్రోత్సహిస్తున్నట్టా? లేక పర్యావసానాలు తెలియ చెప్తున్నట్టో అర్థంగాక ప్రేక్షకుడు జుట్టు పీక్కుంటున్నారు. ఎవరినో కోరి వచ్చిన ఓ సినిమా మనకేం చెప్పిందో కొద్దిగా చర్చించుకుందాం.

ఈమధ్య విడుదలైంది ‘నిన్నుకోరి’. నాని, నివేదా థామస్, ఆది ప్రధాన పాత్రలు. కథను క్లుప్తంగా చర్చించుకుంటే -ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. అవసరమైతే తల్లిదండ్రులను వద్దనుకుని అతనితో వెళ్లిపోదామనుకుంది. చివరకు కుర్రాడిని ఒప్పించింది కూడా. అతనితో వెళ్లిపోవటానికి సిద్ధపడిన సమయంలో -కుర్రాడికి జ్ఞానోదయమైంది. పిల్ల తండ్రి కారణంగా జీవితాన్ని తెలుసుకున్న కుర్రాడు -పైచదువుల కోసం విదేశాలు వెళ్లిపోతాడు. అతని ఉన్నత చదువులకు తానే అడ్డని భావించిన అమ్మాయ, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో కుర్రాడిని పెళ్లి చేసుకుంది. ఎలాగూ పెళ్లి చేసుసుకుంది కనుక, అతనే్న మరింత గాఢంగా ప్రేమిస్తుంది. ప్రియులు తిరిగొచ్చాడు. ఇదేమని అడిగితే -తన ఇంటికి వచ్చి తన గాఢ ప్రేమను అడుగడుగునా పరీక్షించమని చెబుతుంది. ప్రియుణ్ని తన ఇంటికి తీసుకెళ్తుంది కూడా. ప్రియునితో ప్రేమ ఏమిటో, భర్తతో గాఢ ప్రేమ ఏమిటో అంతుబట్టక థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులు జుట్టు పీక్కొని అయోమయంలో పడిపోతారు. ముక్కూ మొహం తెలియని ఎర్రగా బుర్రగావున్న అబ్బాయి కనబడగానే ఎగిరి గంతేసి, పుస్తకాలను గిరాటేసి, కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రులను కాదని, నెత్తిమీద రూపాయి బిళ్ళ పెట్టినా అర్థరూపాయి విలువ చెయ్యని పరాయివాడి వెంబడి తిరగమని ఆడపిల్లలకు ప్రబోధించే చిత్రాలు ఈమధ్య మిక్కిలిగా వస్తున్నాయి. కనబడిన ప్రతి మగవాణ్ని ప్రేమిస్తూ, పెళ్లిచేసుకొంటూ ప్రేమను గూర్చి లెక్చరర్లు దంచే ఆధునిక అమ్మాయల పోకడలు తెరకెక్కుతూండటం విచారకరం. ‘అంత వురిమి ఇంతేనా కురిసేది’ అన్నట్టుగా ఆడియో ఫంక్షన్ల ఆర్భాటాన్ని చూసి విడుదల నాడే వంద రూపాయలకు టిక్కెట్లు కొని జేబులు ఖాళీ చేసుకొని అతుకుల బొంత సినిమాలను చూసి డీలా పడిపోతున్నాడు ప్రేక్షకుడు. రెండవ రోజే థియేటర్లు వెలవెలబోయి నిర్మాతలకు లాభాలు గూబలకు అంటుతున్నాయి. ఇంగ్లీషు, హిందీ, తమిళ, మలయాళ చిత్రాలను కాపీ కొట్టి మసాలా దట్టించి నిర్మించినా ఫలితం లేకపోతున్నది. బొంబాయినుండి బ్యూటీలను పట్టుకొచ్చి పొట్టి బట్టలేసి, పల్టీలు కొట్టించినా, బ్రహ్మానందంతో బ్రహ్మాండంగా కామెడీ చేయించినా, విదేశాలకు పోయి ఆ వీధులలో, బీచ్‌లలో గెంతులేయించినా, పచ్చి బూతులను కుమ్మరించినా ఫలితం లేకపోతున్నది. సమాజానికి ఉపకరించే కొత్త తరహా కథలు, సహజత్వం వుట్టిపడే సన్నివేశాలు, హృదయాలను వివిధ రసానుభూతుల్లో ముంచెత్తే సంఘటనలు, సజీవమైన పాత్రలు, చక్కని సంభాషణలు, సమపాళ్ళల్లో మేళవించి నిర్మించినప్పుడే విజయవంతమన చిత్రాలు వస్తాయి. మన నిర్మాతలు రుూ విషయాన్ని ఆలోచించక ప్రేక్షకులు వేలిముద్రగాళ్లు, వాళ్లకు కావలసిందేమిటో మాకు తెలుసని తలా తోకా లేని చిత్రాలు నిర్మిస్తే అపజయాన్ని చవిచూడటం తప్పితే వేరే ప్రయోజనం లేదు. కథలు ఎన్నుకునే విషయంలో మరింత కృషి చెయ్యవలసిన అవసరం వుంది. తెలుగు చిత్రాల స్థాయి కథలో, టెక్నిక్‌లో, నిర్మాణంలో పెంచడానికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి.

-పూజారి నారాయణ, అనంతపురం