Others

తప్పదుమరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలైవాను ఫాలో అయిపోవడానికి తెలుగందం -అంజలి స్కెచ్ ప్రిపేర్ చేసుకుంటుందన్నది ఇండస్ట్రీ టాక్. స్క్రీన్ మీద పాత్రలు తగ్గుతుండటంతో -కొత్త పాత్ర కోసం ఓన్ స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు గ్లామర్‌కు తెలుగు సినిమాలు దక్కని సెంటిమెంట్ ఎలాగూ ఉంది కనుకే -తమిళానికే అంజలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఇప్పుడిక అక్కడ కూడా చేతిలో సినిమాలు లేకపోవడంతో -పొలిటికల్ పాత్రలో సెటిలవ్వడానికి ప్రిపరేషన్స్ చేసుకుంటుందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగావున్న ‘బెలూన్’ ప్రమోషన్స్‌లో అంజలి నర్మగర్భమైన మాటలు పొలిటికల్ స్కెచ్‌లో భాగంగానే కనిపిస్తున్నాయి. రాజకీయాలు ఇష్టమే. చాలా దగ్గరగ అబ్జర్వ్ చేస్తుంటా. కానీ, రావడానికి టైముంది అన్నది అంజలి కామెంట్. కొద్దిరోజుల క్రితమే పార్లమెంట్ భవనానికి విజటర్‌గా వెళ్లింది. ‘కొత్త కెరీర్‌కు వాస్తు చూసుకోవడమే కాదు, రెక్కీ కూడా చేసినట్టుంది’ అంటూ తాజా కామెంట్స్‌తో అంజలిపై సెటైర్లు మొదలయ్యాయి. రజనీ రాజకీయ పార్టీ పెట్టడమే తరువాత -క్యూలో అంజలి ఉండటం ఖాయం అంటున్నారు కాస్త దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్లు. ఏమో.. పాత్ర పండితే అంజలి ఏంపీయే కాదు, ఏమైనా కావొచ్చు.