AADIVAVRAM - Others

రామాయణం.. 49 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడులోని తండ్రి మాటని పాటించాలనే దృఢ నిశ్చయాన్ని గమనించిన సుమిత్ర డగ్గుత్తికతో ధర్మపరమైన మాటలని పలికింది.
‘దశరథుడికి, నాకు కొడుకైన ఈ రాముడు ధర్మాత్ముడు. అందరి హితానే్న కోరుకుంటాడు. ఎన్నడూ దుఃఖాలని అనుభవించి ఎరగడు. అలాంటి రాముడు నేల మీద రాలిన ధాన్యాన్ని ఏరుకుని ఎలా జీవిస్తాడు? అడవుల్లో కందమూలాలని తిని ఎలా జీవిస్తాడు? సద్గుణవంతుడు, ఇష్టుడు ఐన రాముడ్ని రాజు వనవాసానికి పంపుతున్నాడని విన్న ఎవరు నమ్ముతారు? ఎవరు భయపడరు? ఓ రామా! లోకాభిరాముడివైన నువ్వు కూడా అడవికి వెళ్లాల్సి వచ్చిందంటే లోకాన్ని నడిపిస్తున్న దైవమే బలమైనది అని నిశ్చయంగా చెప్పాల్సి ఉంది. కుమారా! నువ్వు దూరమైన వెంటనే నా శ్వాసతో పాటు గొప్ప శోకాగ్ని కూడా పుడుతుంది. నువ్వు కనపడక పోవడమే దాన్ని రాజేసే గాలి. నా శోకాలే దానికి సమిధలు. కన్నీళ్లే ఆ హోమానికి ఆహుతి. కన్నీరు, విచారం అనేవి దాన్నించి వచ్చే గొప్ప పొగ. నువ్వు ఎప్పుడు వస్తావా అనే విచారంతో ఇది మళ్లీ మళ్లీ పుడుతూంటుంది. అలాంటి ఈ శోకాగ్ని నన్ను పూర్తిగా కృశింపచేసి వేసవిలో నిప్పు పొదలని కాల్చేసినట్లుగా కాల్చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే నేనూ అక్కడికే వస్తాను’
పురుష శ్రేష్ఠుడైన రాముడు బాగా విచారించే తల్లితో చెప్పాడు.
‘రాజుని కైకేయి మొదటే మోసం చేసింది. నేను అరణ్యానికి వెళ్లి, నువ్వూ ఆయన్ని వదిలేస్తే రాజు ఇక జీవించలేడు. ఇది నిశ్చయం. భార్య భర్తని వదలడం క్రూరమైన పని. నువ్వు మనసులో కూడా అలాంటి పని చేయకూడదు. నా తండ్రి దశరథ మహారాజు జీవించి ఉన్నంత వరకూ నువ్వు ఆయనకి సేవ చేయాలి. ఇది శాశ్వత ధర్మం’
మంచి శకునం కౌసల్య (కొడుకు విచక్షణకి) చాలా సంతోషించి శ్రమ పడకుండా పనులని చేసే రాముడితో ‘అలాగే చేస్తాను’ అని చెప్పింది. ధర్మాన్ని ఆచరించే వారిలో ఉత్తముడైన రాముడు బాగా దుఃఖించే తల్లితో ఇలా చెప్పాడు.
‘నువ్వు, నేనూ కూడా తండ్రి మాటనే వినాలి. ఆయన అందరికీ రాజు, పోషకుడు, పూజ్యుడు, శ్రేష్ఠుడు, అధిపతి, ఆజ్ఞాపించే అధికారం కలవాడు. పధ్నాలుగు సంతవ్సరాలు మహారణ్యంలో విహరించి వచ్చి ఆనందంగా నువ్వు చెప్పింది చేస్తాను’
అది విన్న కౌసల్య బాగా విచారిస్తూ కన్నీరు కారుస్తూ చెప్పింది.
‘రామా! నేను ఈ సవతుల మధ్య ఉండలేను. తండ్రి మాట విని అడవికి వెల్లాలని నువ్వు నిశ్చయించుకుంటే, నన్ను కూడా ఆడ లేడిని తీసుకెళ్లినట్లు అడవికే తీసుకెళ్లు.’
ఏడ్చే కౌసల్యని చూసి రాముడు కూడా ఏడుస్తూ చెప్పాడు.
‘స్ర్తి జీవించి ఉన్నంతవరకూ భర్తే ఆమెకి దైవం. అతనే ప్రభువు. అధికారం గల దశరథ మహారాజుకి మనిద్దరి మీదా అధికారం ఉంది. లోకానికి ప్రభువు, తెలివైన వాడు ఐన ఆ రాజు ఉండగా మనం అనాధలం ఎలా అవుతాము? ధర్మాత్ముడు, సకల ప్రాణులకి మంచి చేసేవాడు ఐన భరతుడు కూడా నిన్ను కనిపెట్టుకునే ఉంటాడు. అతను ఎల్లప్పుడూ ధర్మాచరణ మీద ఆసక్తిగలవాడు కదా? నేను వెళ్లాక నువ్వు పుత్రశోకంతో ఉన్న రాజుకి ఎలాంటి శ్రమ కలగకుండా చూడు. ముసలివాడైన రాజులోని ఈ భయంకరమైన విచారం పోదు. కాబట్టి ఆయన మంచిచెడ్డలు చూడు. వ్రతాలు, ఉపవాసాలు చేసే బాగా ఉత్తమురాలైన స్ర్తి భర్త వెంట ఉండకపోతే నరకానికి వెళ్తుంది. దేవతలకి నమస్కారం చేయకపోయినా, దేవతలని పూజించకపోయినా, భర్త సేవ చేసే స్ర్తి ఉత్తమమైన స్వర్గానికి వెళ్తుంది. భర్తకి ఇష్టమైంది, మంచి కలిగేది చేయాలి. ఇదే ప్రాచీన ధర్మం. స్మృతుల్లో, వేదాల్లో చెప్పిన ధర్మం ఇదే. అమ్మా! నువ్వెప్పుడూ నా కోసం దేవతలకి హోమం చేస్తూ, పువ్వులతో పూజిస్తూండు. ఉత్తములైన బ్రాహ్మణులని కూడా పూజించు. ఆహార నియమాలని పాటిస్తూ, భర్తకి సేవచేస్తూ నా కోసం ఎదురు చూస్తూండు. నేను తిరిగి వచ్చాక గొప్పవాడైన నా తండ్రి అప్పటికి జీవించి ఉంటే, ఉత్తమమైన నీ కోరికలు తీరుతాయి’
పుత్రశోకంతో బాధపడే కౌసల్య రాముడి మాటలు విని ఏడుస్తూ చెప్పింది.
‘ఓ వీరకుమారా! వెళ్లాలి అనే నీ సంకల్పాన్ని మార్చలేను. కాలాన్ని ఎవరూ దాటలేరు. ఇది నిశ్చయం. నువ్వు గట్టి మనసుతో వెళ్లు. నీకు ఎల్లప్పుడూ క్షేమం అవుగాక! నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నా విచారాలన్నీ తొలగిపోతాయి. మహా భాగ్యవంతుడైన నువ్వు కర్తవ్యాన్ని నెరవేర్చి, వ్రతాన్ని ఆచరించి, తండ్రి రుణాన్ని తీర్చి తిరిగి వచ్చాక నేను గొప్ప సుఖాన్ని పొందుతాను. నా మాట కాదని నువ్వు అరణ్యానికి వెళ్లడానికి ప్రేరేపించే దైవం గతిని ఈ లోకంలో ఎవరూ, ఎన్నడూ అర్థం చేసుకోలేరు. వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చి అందమైన మంచి మాటలతో నాకు ఆనందాన్ని ఇవ్వు’
ఈ విధంగా రాముడు వనవాసానికి వెళ్లాడని నిశ్చయించుకున్న కౌసల్య శుభ లక్షణాలు గల రాముడితో ఇలా చెప్పి అతనికి మంగళం చేయాలని కోరుకుంది. (అయోధ్యకాండ 24వ సర్గ)
హరిదాసు ఆ రోజు చెప్పిన కథ విన్నాక నలుగురు శ్రోతలు నాలుగు తప్పులని కనుక్కుని వాటిని హరిదాసుకి చెప్పారు. ఆయన వెంటనే అయోధ్య కాండ పుస్తకం తెరిచి చదివి తన తప్పులని ఒప్పుకున్నాడు. మొదటి తప్పుని ఆశే్లష కనుక్కున్నాడు. వాటిని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
శ్రీ తిక్కన సోమయాజి రాముడి మీద రాసిన పుస్తకం పేరేమిటి?
*
గత వారం
‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
శ్రీ తులసీదాస్ రాముడి మీద రాసిన పుస్తకం పేరేమిటి?
-రామచరిత మానస్
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
ఆ వృద్ధ శ్రోత చెప్పింది తప్పు. హరికథ మొదలెట్టిన తర్వాత మొదటిసారి హరిదాసు ఎలాంటి తప్పులూ చెప్పలేదు. అన్నీ కరెక్ట్‌గా చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి