Others

అభాగ్య శిశువులకు ఊపిరి ఇవ్వని సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని ఐదేళ్ల వయసులోని శిశుమరణాలు ప్రతి ఏటా గణాంక వివరాలను బట్టి దశాబ్దాల కాలగమనంలో పిల్లలకు బతుకు ఇవ్వని సమాజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో గోరఖ్‌పూర్ దుర్ఘటనలు కొత్త కాదు. మిలీనియం డెవలప్‌మెంట్ అంతర్జాతీయ లక్ష్య సాధనలో, శిశుమరణాలను అరికట్టే అంశంలో మనకంటే జనాభాలో అగ్రస్థానంలో వున్న చైనా సత్ఫలితాలు సాధిస్తోంది. 2015 నాటికి సంబంధించి గణాంక నివేదిక ప్రకారం చైనా కంటే ఏడురెట్లు అధిక సంఖ్యలో 6,959,852 మంది శిశువులు పుట్టిన నెలలోపే విగతజీవులయ్యారు. శిశువు పుట్టిన తొలి 28 రోజులు శైశవ నియోనాటిక్ స్థితిలో, పేదరికం, అజ్ఞానం, అవిద్య, మూఢత్వం వంటి సామాజిక ఆర్థిక తర నిస్సహాయ దైన్య స్థితిగతుల కారణంగా లక్షలాది శిశువులు తల్లుల పొత్తిళ్లలోనే మృత్యువాత పడుతున్నారు. పోషకాహారం లేక తీవ్ర ఆనారోగ్య సమస్యలతో నిరుపేద తల్లులు పుట్టిన శిశువులను మృత్యుముఖంలోకి విసిరివేయడం సామాజిక సత్యం. 21వ శతాబ్దపు రెండవ దశాబ్దాంతంలో జాతి తలమునకలవుతున్న ప్రస్తుత సందర్భంలో చావు బతుకులమధ్య కొట్టాడుతున్న చిరుప్రాణాలకు ఆక్సిజన్ అందకపోవడం దుర్ఘటన భారత జాతి శిశువులను ఎవ్వరు రక్షించి బతుకు ఇస్తారు అని ప్రశ్నిస్తోంది.
భారతీయ సమాజంలో సంపన్న, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు, పిల్లలను సంపదగా భావిస్తారు. స్వాతంత్య్రానంతరం దేశ జనాభా 40 కోట్లనుంచి 130 కోట్లకు పెరిగి పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం పీడిస్తున్న తల్లిదండ్రులకు కనీస జీవన అవసరాలకు నిరంతరం తపించే దారిద్య్ర రేఖకు దిగువన వుండే అసంఖ్యాక జనావళికి పిల్లలపై ఆధారపడి బతకడం తప్ప శిశు దశనుంచి ఆలనా పాలనా చూసి వారిని కంటికి రెప్పలా రక్షించుకునే శ్రేయోదాయక సమాజ నిర్మాణం నేటి మన ప్రజాస్వామ్య వ్యవస్థకు గగన కుసుమం అనడంలో సందేహం లేదు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరంగా అందిస్తున్న సంక్షేమ రంగాలకు సంబంధించి ప్రధానంగా ప్రాణాధారమైన వైద్య రంగంలో అవినీతి, నిర్లక్ష్యం, అలసత్వం, నిధుల కొరత, అక్రమ అన్యాయాలు రాజ్యం చేస్తున్నాయి. గోరఖ్‌పూర్ విషాదం ఒక ఉదాహరణ.
అద్దెగర్భాలతో బంగారు చెమ్చాలతో శిశువులు
భారతీయ సంస్కృతి, ప్రాచీన సాంప్రదాయ జీవన వ్యవస్థలో మానవ శిశు జననోత్పత్తి అత్యంత పవిత్రమైంది. గర్భాదానం, గర్భధారణ, మాతృత్వం వైవాహిక ధర్మాచరణలో కల్యాణకారకమైన కుటుంబ వ్యవస్థను పెంపొందింపచేసి సమాజ కల్యాణానికి, శాంతియుత సహజీవనానికి దోహదపడుతున్నాయి. ఏ మతం అయినా, జనాభాపెరుగుదల నివారణకు గర్భవిచ్ఛిత్తి అంగీకరించదు. అయినా ప్రస్తుత అధునాతన శాస్ర్తియ యంత్ర పరిజ్ఞానం సృష్టించి టెస్ట్‌ట్యూబ్‌లలో బేబీలు, పిండోత్పత్తి, పోషణ, విచ్ఛిన్నం, జననం లేని నియంత్రణ, సురక్షిత జననాలు,సంతాన సాఫల్యత స్థాయినుంచి అద్దె గర్భం సరోగసీ వైపు శరవేగంతో దూసుకుపోతోంది. అద్దె, బాడుగ, కిరాయి వంటి ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలుగా గర్భాన్నికూడా అద్దెకిచ్చే ప్రక్రియ ప్రవేశించింది. ఆ వ్యాపార సంస్కృతిలో సంపన్న, పాశ్చాత్య ఫెర్టిలిటీ టూరిజం పేరిట శిశుజనం కూడా పెట్టుబడి లాభనష్టాలు ముడివడి నిరుపేద భారతీయ మహిళలకు ధనార్జనకు అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుత స్థితిగతుల్లో నిరుపేద మహిళ భార్యగా, తల్లిగా కుటుంబం కోసం ఆహ్వానించిన గర్భధారణ, సురక్షితమైన కాన్పు, ఆరోగ్యవంతమైన మాతా శిశువుల ఆవిర్భావం ప్రభుత్వ బాధ్యత అయింది. 1994లో ప్రప్రథమంగా అద్దెగర్భ ధారణవల్ల శిశుజననం రికార్డు అయినప్పటినుంచి ఆ పరిశ్రమ దినదినాభివృద్ధి చెంది మన దేశం అత్యుత్తమ శిశు సాఫల్య పాకేజీలను విదేశీయులకు అందిస్తోంది. భౌతికంగా సెక్స్ సుఖాలకు సంబంధం లేని ఆ కృత్రిమ శాస్ర్తియ పరిజ్ఞానంతో జన్మించే శిశువులకు తల్లితో మాతృత్వ బాంధవ్యం ఉండదు. ఈ విధంగా ‘ఆర్ట్ఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ’(ఏఆర్‌టి) చట్టబద్ధ వ్యాపారంలో జన్మించే శిశువులు బంగారు చెమ్చాలతో ఆరోగ్య ఐశ్వర్యంతో జన్మిస్తుంటే, దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళలు ప్రభుత్వ దవాఖానాల్లో సురక్షిత జననాలకు కనీస వసతి, వైద్య సౌకర్యాలు లేక గర్భశోకాన్ని అనుభవించాల్సి వస్తోంది. మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఒకపక్క మానవ పిండాల వ్యాపారం ఊపందుకుంటుంటే మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలలో నిర్భాగ్య శిశువులు గర్భస్త శిశువులుగా పుట్టిన వెంటనే లేదా నెలలోపు కన్నుమూసి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు.
అసంఖ్యాకంగా శిశువుల మృత్యువాత
ప్రతి ఏటా 1.5 మిలియన్ పైగా ఐదేళ్లలోపు పిల్లలు సరైన వైద్య సదుపాయం లేక అకాల మరణాలు పాలవుతున్నారు. మన దేశంలో ప్రతి 20 సెకండ్లకు ఒక శిశువు మరణిస్తోంది. ఒక ముంబై మహానగరం మురికివాడల్లో అయిదు ఏళ్లలోపు పిల్లలు ప్రతి ఏటా 25,000 మంది బలవర్ధకమైన పోషకాహారం లేక మృత్యువాత పడుతున్నారు. నగర విలాస సంపన్నులంతా వ్యామోహంలో వెల్‌బేబీ షోలు, మారుమూల మురికివాడల్లో, గిరిజన దళిత నిరుపేద పూరి గుడిసెల ఎదుట కళ్లల్లో ప్రాణాలతో ఆకలి, ఆహార లోపాలతో దొర్లుతున్న ఎముకల గూడుల శిశు శరీరాలు మనదేశ సంపన్న, దారిద్య్ర జీవన విషాద వైవిధ్య విచిత్రతను సాక్ష్యాత్కరింపచేస్తుంటాయి. యుపిఏ ప్రభుత్వ హయాంలో నాటి ఫ్రధాని మన్‌మోహన్‌సింగ్ నేషనల్ ఫౌండేషన్ సమర్పించిన హంగర్, మాల్‌న్యూట్రిషన్ నివేదికపై మానవతా హృదయంతో స్పందిస్తూ ఈ పరిస్థితి జాతికి సిగ్గుచేటు అన్నారు. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పెరుగుదల జాతి ప్రగతిగా సగర్వంగా ప్రకటించుకునే ప్రభుత్వాధినేతలకు చావు బతుకల మధ్య అతి కష్టంగా ఊపిరి పీలుస్తున్న ఎదుగుదల లేని పిల్లల, శిశువుల మృత్యుముఖ జీవనవిషాదం, గర్భిణీ స్ర్తిలకు పోషకాహార విలువల అగత్యం అంతగా కనిపించవు.
గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో శిశువుల మరణాల వంటివి దేశమంతటా ఆక్సిజన్ అలభ్యత కారణంగా జరగకపోవచ్చు. ఈ దుర్ఘటన దేశానికి విద్యుద్ఘాతమైంది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ అవధ్ సంఘ చాలక్ సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నేత ఫ్రభు నారాయణ్ తన ఫేస్‌బుక్ పోస్టులో యుపి రాష్ట్ర ఫ్రభుత్వం ఒకరోజు నైతిక బాధ్యత వహిస్తూ పశ్చాత్తాప దినం ప్రకటించి రాష్టమ్రంత్రులు బాధిత తల్లిదండ్రులను స్వయంగా వెళ్లి ఓదార్చాలని, ఒకరోజు నిరాహారం దీక్షగా చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్ధనాధ్‌సింగ్ ప్రెస్ సమావేశంలో గతంలోని మరణాల వివరాలు ప్రస్తావించడం భావ్యంగా లేదని, దుర్ఘటనపై ఫ్రభుత్వం సెన్సిటివిటీతో వ్యవహరించాలన్నారు.

- జయసూర్య