Others

మణి(కని)కట్టు అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ట్రెండ్ సృష్టించాలన్నా.. అభిమాన హీరో స్టైల్‌ని ఫాలో అవ్వాలన్నా కుర్రకారు ఎప్పుడూ స్పీడే. వేసుకునే దుస్తుల నుంచీ, ధరించే యాక్ససరీస్ వరకూ కొత్త ప్యాషన్‌ని ఫాలో అవుతూనే ఉంటుంది నేటి యువతరం. అమ్మారుూ, అబ్బారుూ యాక్ససరీస్‌లో మరింత స్టైల్‌గా ముందుంటాయి లెదర్ కఫ్స్. నిజానికి వీటి వాడకం రెండు మూడు ఏళ్ల క్రిందటే మొదలైనా ప్రస్తుతం హాట్ ఫ్యాషన్, టాపిక్ అవ్వడం చెప్పుకోదగ్గది. బంగారం, వెండి, స్టెయిన్‌లెస్ స్టీలూ, బ్లాక్ మెటల్, ప్లాస్టిక్, రబ్బర్ వాచీలు, బ్రేస్‌లెట్ స్థానే యువత ముంజేతులు లెదర్ అందాలతో ధగధగలాడుతున్నాయి. వీటి వెడల్పు అంగుళం నుంచి మూడు అంగుళాల వరకూ ఉంటుంది. డిజైన్ల సంగతి సరేసరి. రంగు రంగులతో మెరిసిపోతుంటాయి. అమ్మాయిల కఫ్ బ్రేస్‌లెట్లలో వెరైటీలు ఎక్కువే. బీడ్సూ, రాళ్లూ, అద్దాలు అద్ది కఫ్స్‌తోపాటూ లెదర్ కఫ్స్‌కి ఆకర్షణీయమైన బకెల్ లేదా లాకెట్లు అమర్చినవి ఎక్కువగా లభిస్తున్నాయి. ఇక అబ్బాయిల విషయానికొస్తే బ్లాక్ కలర్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటాయి. అలాగే రెండంగుళాలకన్నా వెడల్పు ఎక్కువే ఉంటాయి. వీరి కఫ్స్‌కి బకెల్ ఉంటే అది అదనపు ఆకర్షణే. బటన్స్, పక్షులు, కీటకాల బొమ్మలు అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. వాచీలు కూడా కప్స్ మధ్యలో ఫిక్స్ చేసి ఉండటం మనం చూడొచ్చు. మరెందుకాలస్యం.. ఇక మణికట్టుకి కఫ్స్ బిగించి సరికొత్త లుక్స్‌తో కనికట్టు చేసెయ్యడమే.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి