Others

పనివారు కాదు..మనవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనింట్లో పనిమనిషి ఉందంటే ఆమె చేత గొడ్డు చాకిరీ చేయించుకుని మిగిలిపోయిన అన్నం ఇచ్చి పంపేస్తాం. కానీ ఈ కృష్ణవేణి వారి బాగోగుల గురించి ఆలోచిస్తుంది. చట్టాలు, హక్కులు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా వారి శ్రేయస్సుకు పాటుపడుతుంది. ‘పనివారు కాదు-మనవారు’ అనే నినాదంతో నిరుపేద పనివారకు సేవలందిస్తున్నారు సామాజిక వేత్త కొత్త కృష్ణవేణి. హైదరాబాద్‌కు చెందిన ఈ సామాజికవేత్త ఇళ్లల్లో పనిచేసుకునే మహిళలకు, పేదలకు, అనాధలకు, వికలాంగులకు తనదైన శైలిలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు చేస్తూ సహాయపడుతున్నారు. సంవత్సరం పొడుగునా ఇళ్లల్లో సేవ చేసే పనిమనిషి, వంట మనిషి, బట్టలుతికే మనిషి, రోడ్లు శుభ్రపరిచే మనుషులతో సహా ఇలా తమ వీధిలోని పనిమనుషులందరినీ తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి ఆత్మీయంగా పలకరిస్తూ భోజనం పెడుతుంది. ఆ భోజనం కూడా తానే స్వయంగా వండి వడ్డిస్తుంది.
కొంత హోదా పెరగగానే కుటుంబ సభ్యులకు సైతం వండిపెట్టడానికి కూడా సమయం కేటాయించని గృహిణులున్న ఈరోజుల్లో ఇంతమందికి వంట చేసి స్వయంగా వడ్డించడమనేది అభినందించదగ్గ విషయం. మురికివాడల్లో సరైన గూడులేక నీడ లేని పేదవారి గుడిసెలపై కప్పుకోవడానికి ప్లాస్టిక్ కవర్లు (టార్పాలిన్)లను ఆప్యాయంగా అందచేస్తోంది. వానలకి పేదవారు ఇబ్బంది పడ్డ తర్వాత ఏదో హడావుడి చేయడం కాదు కనీస ముందు జాగ్రత్త అవసరం అని కృష్ణవేణి అంటారు. వారికి దోమతెరలు, పేద పిల్లలకు స్కూలు బ్యాగులు అందచేస్తారు. వేసవి కాలం వచ్చిందంటే మజ్జిగ తయారుచేసి పేదవారు నివసించే కాలనీల్లోకి వెళ్లి వారికి మజ్జిగ ఇవ్వడమే కాదు, ఎండదెబ్బనుండి రక్షణ కోసం ఓఆర్‌ఎస్ పాకెట్లను ఇచ్చి వస్తుంది. వారి ఇళ్లల్లో మంచాన పడి వుండేవారికి, అనాధలు, అంధులు, వికలాంగులు, హెచ్‌ఐవి ,కుష్టు వ్యాధిగ్రస్తులుండే చోటికి వెళ్లి స్వయంగా వంట చేసి తీసుకువెళ్లి వడ్డించడమే కాకుండా వారి క్షేమసమాచారాలు తెలుసుకుంటు ఆప్యాయంగా పలకరిస్తూ రోజంతా వారితో గడిపివస్తుంది. అంతేకాకుండా పేదవారని, పనివారని సమాజంలో చిన్నచూపుకు గురి అయ్యేవారిని చేరదీస్తూ వారి వ్యక్తిగత కుటుంబ సమస్యలకు సలహాలిస్తూ వారి ఆరోగ్య సమస్యలకు సహాయం చేస్తూ, వారి పిల్లలను చిన్న చిన్న పనుల్లో పెట్టిస్తూ మానవత్వాన్ని చాటుకుంటుంది. వారి పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి సందర్భాల్లో వారి తేదీలను తెలుసుకుని వారికి కొత్త బట్టలిస్తోంది. మా బస్తీలలో అడుగుపెట్టడానికి కూడా కష్టంగా భావిస్తూ మా బాగోగులను పట్టించుకునేవారు లేక మేము పేదవాళ్లమని తక్కువగా చూసే మనుషులున్న ఈరోజుల్లో తమతో అభిమానంగా వుంటూ కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా వుండే కృష్ణవేణిని బస్తీవాసులు ఎంతో అభిమానాన్ని చూపిస్తుంటారు.
ఆమె సేవలకు గాను పలు సంస్థల ద్వారా ‘పివి నరసింహారావు ప్రతిభా పురస్కారం’ ‘తెలంగాణ శక్తి’లాంటి అవార్డులతో సత్కరించారు. న్యూఢిల్లీలో నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు కూడా అందుకున్నారు.