Others

పిల్లల పాలిట మృత్యువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరాల్ని ఎవరో గట్టిగా పట్టుకొని
ఉరితాళ్లు పేనుతున్నారు
చర్మం ఒలిచి పరుపుగా కుట్టించుకుని
దర్జాగా పడుకుంటున్నారు
ఆక్సిజన్ అందించలేక పిల్లల్ని
పీకల్ని నలుపుతున్నారు
చేతుల్లో కత్తులు పట్టుకుని
తలలను తరుగుతున్నారు !
బయటకు రావాలంటే
ఒకటే భయం...
తల్లి గుండెకోత అరుపులు
ఎవరికీ వినపడవు
లోపల ఉంటే ప్రాణాలు తీస్తారు
అక్కడంతా హంతకులు
తిరుగుతుంటారు
‘యోగి‘ పరిపాలనలో
పిల్లల ప్రాణాలు గాల్లో కలిపేస్తారు
పిల్లల్ని పిట్టల్లా చంపుతున్నారు
ఇప్పుడు ‘ఘోర’ఖ్‌పూర్ అంటే
పసిపిల్లల పాలిట మృత్యువు !

-తంగిరాల సోని సెల్: 96766 09234