Others

ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ‘పోలీ’ ఇంధనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ బాక్సులు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో ప్లాస్టిక్ పదార్థాలు రోజువా రీ చెత్తగా వీధిలోకి చేరుతోంది. బహిరంగ ప్రదేశాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ భద్రతకు పెను సవాలుగా మా రాయి. పూణెలోని ఒక సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ‘పోలీ’ ఇంధనం తయారుచేసే కర్మాగారాన్ని విజయవంతంగా నిర్వహించడం పర్యావరణ ప్రియులకు ఆశాకిరణంగా మారింది.
‘నేడు ప్లాస్టిక్ మన జీవితంలో ఒక ప్రధాన భాగమైపోయింది. ప్లాస్టిక్ వస్తువనేది లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం’ అంటారు మేధా తడపాత్రికర్. పూణె కేంద్రంగా పనిచేసే ‘రుద్రా ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్’ వ్యవస్థాపకురాలు ఆమె. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి పోలీ ఇంధనం తయారు చేసేందుకు ఈ సంస్థ తరఫున రెండు కర్మాగారాలు పనిచేస్తున్నాయి. ‘ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను మాకు సేకరించి ఇస్తే మేం వాటిని ఇంధనంగా మారుస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం మొదలుపెట్టాక అవి ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా పేరుకుపోవడాన్ని ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. ఒకప్పుడు బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ చెత్త పెరిగిపోవడానికి తామే కారణమన్న విషయాన్ని ఎవరూ గుర్తించేవారు కాదు. ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం, దాని దుష్పరిణామాలను ప్రజలే గుర్తిస్తున్నారు’ అని మేధా అంటారు. మేధా, ఆమె మిత్ర బృందం కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారుచేసే కర్మాగారాలను ఏ ర్పాటుచేసారు. వీటిలోని యంత్రాలు ‘పైరోలిసిస్’ పద్ధతి ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారుచేస్తాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి చేస్తూ, సారమున్న పదార్థాలను విడదీసి వాటినుండి ఇంధనాన్ని తయారుచేస్తారు. రుద్ర ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ సిబ్బంది ప్రతి పదిహేను రోజులకోసారి పూణెలోని ప్రతి ఇంటినుండి ప్లాస్టిక్ సీ సాలు, సంచులు తదితర వ్యర్థాలను సేకరిస్తారు. తరువాత వాటిని రీ సైక్లింగ్ చేసి ఇంధనం, వాయువులను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఇంధనం తయారు చేయాలనే ఆలోచన వెనుక ఓ సంఘటన ఉంది. 2009 మేధా, శిరీష్ ఎన్.్ఫడ్తరే (ఈయన రుద్రా ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు) మహారాష్టల్రోని థానే నగరాన్ని సందర్శించినపుడు ప్లాస్టిక్ బ్యాగులను తిని చనిపోయిన రెండు లేళ్ల కళేబరాలను చూసారు. ‘ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఆ మూగజీవులు బలైపోవడం మా హృదయలాను ఎంతో కలచివేసింది. ఈ విషయమై ఏదైనా చేయాలని తీవ్రంగా ఆలోచించాం. ఈ సమస్య పరిష్కారానికి ఎవరో ఏదో చేస్తారని చూడకుండా ఏదైనా చేయాలనుకున్నాం’ అని మేధా అంటారు.
మొదట మేధా, శిరీష్ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు వాటిని ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి ఉడకపెట్టారు. మేధా న్యాయశాస్త్రంలోను, శిరీష్ మార్కెటింగ్‌లోను పట్ట్భద్రులు. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌కు సంబంధించి ఏ మాత్రం అవగాహన లేనందున కిందిస్థాయి నుంచి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకున్నారు. వీరి ప్రయత్నానికి మరి కొందరు మిత్రుల సహకారం తోడవడంతో 2010లో రీసైక్లింగ్‌కి అవసరమైన యంత్రాలను కొనుగోలు చేసారు.
క్రూడ్ ఆయిల్ నుండి ప్లాస్టిక్ తయారవుతుంది. అందువల్ల రివర్స్ పద్ధతిలో వెళ్లడం ద్వారా మేం ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఇంధనాన్ని వెలికి తీయగలిగాం అంటారు మేధా. రీసైక్లింగ్ మొదలుపెట్టిన కొంత కాలానికి మేధా బృందం యంత్రాల నుండి విషవాయువులు వెలువడడం గమనించారు. వాళ్లు తమ రీసైక్లింగ్ పద్ధతిని పునఃపరిశీలించడంపై రెండేళ్ల సమయం వెచ్చించారు. ఫలితంగా వారు రెండవ నమూనాని రూపొందించారు. దాని ప్రకారం ఆ విషవాయువులను తిరిగి రీసైక్లింగ్ యంత్రాలను వేడెక్కించడానికే వినియోగిస్తారు. 2014లో వారు తమ మూడవ రీసైక్లింగ్ నమూనాను రూపొందించి, ఆ ప్రకారం తయారు చేసిన యంత్రాలనే నేటికీ ఉపయోగిస్తున్నారు. ‘2014 చివరి నాటికి మాకు అర్థమైంది ఏమిటంటే- ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వచ్చే అనర్థం గురించి ప్రజల్లో అవగాహన లేకపోతే ఏ ప్రయోజనం లేదని. దీంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాం. వారికొక పరిష్కారం కావాలని మాకు తెలుసు’ అని మేధా అంటారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడానికి మేధా బృందం ఇంటింటికీ వెళ్లి సంచులను పంచడం మొదలుపెట్టింది. మొదట్లో చిన్నగా ప్రారంభమైన వారి పని నేడు పూణెలో 5,500 ఇళ్లనుండి 5-6 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే స్థాయికి చేరింది. ఇళ్లనుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మొదట వాయురహిత రియాక్టర్లలో డంప్ చేస్తారు. తరువాత కొన్ని ఉత్ప్రేరకాలను రియాక్టర్లలో వేసి ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి చేస్తారు. సుమారు 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆ యంత్రాల నుండి మీధేన్, ప్రాపేన్ వంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి.
ఈ వాయువులను తరువాతి ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. మిగిలిన వాయువులను కండెన్స్ చేయగా ద్రవరూపంలో ఇంధనం వస్తుంది. ప్రతి వంద కేజీల ప్లాస్టిక్ వ్యర్థాల నుండి 45-65 లీటర్ల ఇంధనం ఉత్పత్తి అవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల్లో 20 శాతం ఎందుకు పనికి రాని వాయువు మిగిలిపోతుంది. దీన్ని బయటకు వచ్చే రసాయన బురదలో కలిపేస్తారు. ఈ బురదని స్థానిక బిల్డర్లకు అప్పగిస్తారు. వారు దానిని తారుతో కలిపి రోడ్లు వేయడానికి వినియోగిస్తారు. ఈ రకంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి నూరు శాతం తిరిగి వినిమయంలోకి తెస్తున్నారు మేధా బృందం వారు. పూణె పరిసరాలలోని పల్లెలను సందర్శిస్తే అక్కడింకా కట్టె పొయ్యిలనే వాడడం చూ స్తాం. కొందరైతే ప్లాస్టిక్ వ్యర్థాలను మండించి వంట చేసుకుంటారు. దానివల్ల పరిసరాలు కలుషితమవుతున్నాయి. ఈ పల్లెల్లోని మహిళలతో మాట్లాడి, వారికి పోలీ ఇంధనాన్ని తక్కువ ధరకి అమ్ముతున్నాం. ఈ ఇంధనానికి వేడి పుట్టించే గుణం వుండడంవల్ల ఎక్కువరోజులు వస్తుంది- అంటారు మేధా.
మేం సాధించిన గొప్ప విజయం ఏమిటంటే- ఇప్పుడు ప్ర జలు ప్లాస్టిక్ వ్యర్థాలను గురించి ఆలోచిస్తున్నారు. వాటి రీసైక్లింగ్ పై దృష్టి పెడుతున్నారు. 69 ఏళ్ల పెద్దాయన మా కర్మాగారానికి వచ్చి తాను సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను అందచేసారు. ముంబయి నుండి కూడా కొందరు మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలను మాకు కొరియర్‌లో పంపిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది చాలా చిన్నదిగానే కనిపించినా ముందు ముందు మా ప్రయత్నాలు విస్తృత స్థాయిలో కనిపిస్తాయని మేధా చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున డంప్ చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో సతమతమవుతున్న పూణె వాసులకు రుద్రా ఎన్విరానె్మంటల్ సొల్యూషన్స్ అద్భుత పరిష్కారాన్ని అందించింది. మన దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పర్యావరణ కాలుష్య నివారణకు ఇలాంటి కృషి జరగాల్సి ఉంది.

-దుగ్గిరాల రాజకిశోర్