AADIVAVRAM - Others

అవసరం - అనవసరం(కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల విద్యలు తెలిసిన గురువు దగ్గరకు ఒకే ఊరికి చెందిన ఇద్దరు స్నేహితులు శిష్యులుగా వచ్చి చేరారు.
కొన్నాళ్లపాటు గురువుకు సేవలు అందిస్తూ తమకు ఇష్టమైన విద్యలు నేర్పమని అడిగారు ఇద్దరు శిష్యులు.
‘అవసరం - అనవసరం అనే రెండు విషయాలను గుర్తించి విద్య నేర్చుకోవడం మంచిది. ఇప్పుడు మీకు ఏయే విద్యలు నేర్పాలో చెప్పండి?’ అడిగాడు గురువు.
‘మట్టిబొమ్మలు చేసే ప్రక్రియ నేర్పండి. దానిని బతుకు తెరువుగా వాడుకుంటాను’ వినయంగా అర్థించాడు మొదటి శిష్యుడు.
రెండవ శిష్యుడికి కొంటె బుద్ధి ఎక్కువ. మొదటి శిష్యుడు నేర్చుకొనే విద్యకు మించిన విద్య నేర్చుకోవాలన్న తలంపునకు వచ్చాడు.
‘బొమ్మలకు ప్రాణం పోసి సజీవంగా చేసే విద్య నేర్పండి’ అంతే వినయంతో అర్థించాడు రెండవ శిష్యుడు.
ఇద్దరి కోరికల్లో తేడాలను గమనించి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ ఆ రోజు నుండి ఇద్దరు శిషుయలు కోరుకొనే విధంగానే విద్యలను నేర్పాడు గురువు.
పరిపూర్ణమైన విద్య నేర్చుకున్న ఇద్దరు శిష్యులు గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
మొదటి శిష్యుడు మట్టితో ఆవును తయారుచేసి రంగులు అద్ది గురువుకు కానుకగా ఇచ్చాడు.
రెండవ శిష్యుడు తన మంత్రబలంతో ఆవును సజీవం చేసి ‘ఇది మీరు స్వీకరించండి’ అంటూ గురువుకు చెప్పాడు.
‘్భష్. ఇలా ఇద్దరూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ ఉపయోగపడండి’ అంటూ దీవించి పంపేశాడు గురువు.
ఇద్దరు శిష్యులు అడవి గుండా తమ ఊరికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకొనే నిమిత్తం ఒక నీడన చేరుకున్నారు.
‘నిద్ర ముంచుకొస్తుంది. జంతు భయం ఉన్న ఈ అడవిలో మనల్ని మనం రక్షించుకుంటూ నిద్రపోయే మార్గం ఆలోచించు’ అన్నాడు రెండవ శిష్యుడు మొదటి శిష్యుడితో.
‘మిత్రమా! పగటిపూట నిద్ర పనికి చేటని పెద్దలు అంటారు. అయినా నీ కోరిక ప్రకారం మనల్ని మనం రక్షించుకోడానికి పులి బొమ్మను చేసి రంగులు అద్దుతాను. బొమ్మ పులిని చూసి ఏ జంతువు మన చెంత రావడానికి సాహసించదు’ చెప్పాడు మొదటి శిష్యుడు.
‘సజీవ బొమ్మలు చేయడం నీకు నువ్వే సాటి అలాగే చెయ్’ అన్నాడు రెండవ శిష్యుడు.
క్షణాల్లో పులి బొమ్మను మట్టితో చేసి రంగులు అద్దాడు మొదటి శిష్యుడు.
‘చూడముచ్చటగా ఉంది. దీనికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది?’ అడిగాడు రెండవ శిష్యుడు.
రెండవ శిష్యుని విపరీత ధోరణికి భయపడిన మొదటి శిష్యుడు చటుక్కున చెట్టు ఎక్కేశాడు.
‘నీ పిరికితనం చూస్తే నవ్వొస్తుంది. మనం సృష్టించిన జీవి మన మాట వినదా?’ అంటూ మంత్రాన్ని జపించాడు.
పులి సజీవమయ్యింది. ఎదురుగా కనిపించిన రెండవ శిష్యుడిపై దూకింది. ప్రాణాలకు తెగించి పోరాటం ప్రారంభించాడు.
మిత్రుడ్ని ఆదుకోడానికి మొదటి శిష్యుడు కూడా పులి పైకి దూకాడు. ఇద్దరి బలం ముందు పులి తోక ముడిచి పారిపోయింది.
‘మిత్రమా! సాధు జంతువుని సృష్టిస్తే అది అందరికీ ఉపయోగపడింది. క్రూర జంతువును సృష్టిస్తే మన అంతు చూడడానికే ప్రయత్నించింది. సృష్టించక ముందే మంచి చెడ్డలు ఆలోచించాలి. సమాజ హితానికి ఉపయోగపడేది సృష్టించడం అవసరం. సమాజ నాశనానికి నాంది పలికే దానిని సృష్టించడం అనవసరం. అందుకే గురువుగారు విద్య నేర్చుకోవడంలో అవసరం - అనవసరాలను గుర్తించమని చెప్పేది’ అన్నాడు మొదటి శిష్యుడు.
తన తప్పు తెలుసుకున్న రెండవ శిష్యుడు సిగ్గుతో తలదించుకున్నాడు.

-బి.వి.పట్నాయక్