AADIVAVRAM - Others

కడుపు నిండినా ఇంకా తినాలనిపిస్తోందా? (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారం అనేధి జీవరాశికి ప్రకృతి ప్రసాదించిన జీవదాయక వరం. రుచి అనేది దానికి ఉన్న తత్త్వాన్ని ఆపాదించే అంశాల్లో ఒకటి. ఆహారం తీసుకోవటానికి మనసును ప్రేరేపించటం కోసం రుచి అవసరం. దాన్ని తెలుసుకోవటానికి నాలుక, దాని మీద ఉన్న రుచి గ్రంథులు కారణం అవుతున్నాయి. ఈ యంత్రాంగమే లేకుంటే ఆహార సేవన, ఆహార ఆస్వాదన అనేవి ఈ విధంగా ఉండేవి కావు. పంచ జ్ఞానేంద్రియాల్లో నాలుకను వదిలేసి తక్కిన నాలుగింటితో అంటే చెవులు, ముక్కు, కళ్లు, చర్మం వీటి ద్వారా ఆహారాన్ని ఆస్వాదించవలసి వచ్చేది.
ఆహార సంతృప్తి అనేది మెదడు కణాలైన న్యూరాన్ల కారణంగా జనిస్తుంది. ఇంక చాలనిపించేది మెదడు మాత్రమే! నేచర్ న్యూరో సైన్స్ జర్నల్ 2017 ఆగస్టు 3వ వారంలో ప్రచురించిన ఒక నివేదికలో న్యూరాన్లలోని నాడీ వలయాలు (neuronal circuits) సంతృప్తిని నిర్ణయిస్తాయనేది వైద్యశాస్త్రానికి తెలిసిన విషయమే. ఆకలి, ఆహార సేవనల్ని నియంత్రించే మెదడు యంత్రాంగం గురించి జర్మనీ ఘన Max Planck Institute of Neurobiology వారు విశేష ఫరిశోధనలు చేశారు.
మెదడులోని amygdale అనే ఒక కేంధ్రం మనిషి మనోవృత్తులు, అనుభూతులు, నిర్ణయాలు తీసుకోవటం లాంటి అంశాలకు కారణం అవుతుందని కనుగొన్నారు. ‘అమిగ్దల’ కేంద్రకంలో (CeA area) జరిగే పరిణామాల మీద కొత్త వెలుతుర్ని ప్రసరించింది. అరుచి, అసహనం, అసహిష్ణుత ఇలాంటి నెగెటివ్ భావావేశాలు కలగటానికి ఈ ‘అమిగ్దల కేంద్రకం’లో అనేక పరిణామాలే కారణంగా గుర్తించారు.HTR2a neurons అనేవి ఆహారం తీసుకోగలగటాన్ని నియంత్రిస్తున్నాయి. ఆహారాన్ని తీసుకునే సమయంలో యాక్టివ్ అవుతాయనీ కనుగొన్నారు. రుచిని కూడా ఈ కణాలే ప్రేరేపిస్తున్నాయి. అవి ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత ఎక్కువసేపు ఆహార సంతృప్తి కలగకుండా ఉంటుంది. అంటే ‘లాంగ్‌ఈటింగ్’ లాంటివి జరుగుతాయి. ఈ న్యూరాన్లు అదుపులో ఉంటే ఆహార సేవన కూడా అదుపులో ఉంటుంది. ఈ HTR2a కణాలను అదుపు చేస్తే ఆకలి ఉన్నా అన్నం తినాలనే బలమైన కోరిక కలగకపోవటాన్ని కూడా నిర్థారించారు. ఇవి సంతృప్త కణాలు కావు. కేవలం అసంతృప్త కణాలు. ఇవి యాక్టివ్‌గా ఉన్నంతసేపూ మనసు తినాలనే కోరుకుంటుంది.
ఈ పరిశీలనాంశాన్ని స్థూలంగా అర్థం చేసుకుంటే ఒక నిజం తెలుస్తుంది. మనసు అనేది ఈ వ్యవహారం మొత్తానికి కారణం. ఇచ్ఛ, ద్వేషం, సుఖం దుఃఖం లాంటి మనోప్రవృత్తుల్ని మనసు నిబ్బరం చేసుకోవటం ద్వారా ఎలా నియంత్రించ గలుగుతున్నామో అలాగే రుచి, ఆకలి, ఆహార సంతృప్తి వగైరా ప్రవృత్తుల్ని కూడా నియంత్రించుకోవటానికి మనం చేయాల్సింది చాలా ఉందని!
HTR2a కణాలను ఉత్తేజితం చేయటం లాంటివి లేబొరేటరీల్లో యాంత్రికంగా జరిగే అంశాలు. ఆకలి కావాలని అనుకున్నప్పుడు మాత్రమే కలిగే అంశం కాదు. దాని నియంత్రణ మన అదుపులో ఉండాల్సిన విషయం. అది యంత్రాల అదుపులో విషయం కాదు గదా! మనం ఆకలిని, రుచిని జయించాలి. అందులో మన పాత్ర ఎంత ఉండాలో మనమే నిర్ణయించుకో గలగాలి.
వాస్తవిక జీవితంలో మనం మన కోసం దృఢ నిర్ణయాలను తీసుకొంటోన్నది చాలా తక్కువ. స్టీరియో టైప్ జీవన విధానాల్నే కొనసాగిస్తున్నాం. ఏదీ మన చేతుల్లో లేదన్నట్టు విధికి మన జీవితాన్ని వదిలేయటం వలన మనలో కార్యసాధకత తగ్గిపోతుంది. ఆహారం విషయంలో ఇది మరీ వాస్తవం.
మానసిక ప్రవృత్తులు, ఆహార సంతృప్తి అనేవి ఒకే కేంద్రకంలో జరుగుతున్న అంశాలు కాబట్టి, మనసు బాధపడితే అన్నం తినబుద్ధి కాకపోవటం లాంటివి జరుగుతున్నాయి. విషాదం జరిగినపుడు బాధితుల్ని ఊరడిస్తూ గుండె దిటవు చేసుకో, నిబ్బరం తెచ్చుకో అంటాం. మనసును దిటవు చేసుకోవటం ఎలా? నిబ్బరాన్ని తెచ్చుకోవటం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మనోనిబ్బరంతో మనం ఆహార సంతృప్తిని కూడా అదుపులోకి తెచ్చుకో గలుగుతాం. ఆహార సంతృప్తి మీద అదుపు లేకపోతే, మనం రుచులకు బానిసలమై, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవలసి వస్తుంది.
మన ఆకలి మన చేతుల్లో ఉండాలి. దాని రుచులు మన అదుపులో ఉండాలి. తగు మాత్రం తిన్నాక సంతృప్తి చెందే విషయం కూడా మన కంట్రోల్లోనే ఉండాలి."Certainly we have a good starting point for investigating the links between food consumption, emotional state and the reward system' అని జర్మనీ శాస్తవ్రేత్తలు ప్రకటించారు. ఇది తెలుసుకున్నందువలన కలగవలసిన లాభం ఏమంటే, మనం మనోనిబ్బరం ద్వారా మనం మన ఆహారం మీద అదుపులో పెట్టుకోగలగాలని.
మొదట మనం ఆ విధంగా గట్టిగా అనుకోగలగాలి. అనుకోవటంలోనే అంతా ఉంది. అవును! అనుకోవటం గట్టిగా జరగాలి. షుగరు వ్యాధి ఉన్నవారికి స్వీటు తెచ్చి ఎవరైనా పెడితే వద్దనగలగాలి. అది మనోనిబ్బరం. తప్పనిసరిగా స్వీటు తినాల్సి వస్తే, కొద్దిగా తిని వదిలేయగలగాలి. ఈ మాత్రం కంట్రోలైనా మన మీద మనకు లేకపోతే, మనం ఈటింగ్ డిజార్డర్లకు లొంగిపోవలసి వస్తుంది. షుగరు వ్యాధి, స్థూలకాయం కూడా ఒక విధంగా ఈటింగ్ డిజార్డర్లే!
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com