Others

మహేష్‌కు జోడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మోత్సవం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత మహేష్‌బాబు హీరోగా నటించే తదుపరి చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుందట. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనే్వషణ జరుగుతోంది. ఇప్పటికే పరిణితి చోప్రా నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ తననెవరూ ఈ సినిమా గురించి కలవలేదని చెప్పింది పరిణితి. దాంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ఆసక్తి ఏర్పడింది జనాలకి. తాజాగా ఈ లిస్టులోకి చేరింది ఆలియాభట్. తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఈ హాట్‌భామ ఈ సినిమాలో నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.