Others

‘కీర్తి’ తెచ్చిపెట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో క్రేజీ భామల్లో అందాల రాశి కీర్తి సురేష్ ఒకరు. ఆమె నటించిన చిత్రాలు.. చేసిన పాత్రలు వేటికవే భిన్నంగా వుండి అందర్నీ అలరించాయి. ప్రతిభ గల నటిగానే గాక, చిరునవ్వుతో యువతను తన వైపునకు దృష్టి మరల్చేలా చేసుకుంది. తెలుగు, మలయాళం, తమిళం అంటూ మూడు పడవల ప్రయాణం చేస్తున్న ఈ బ్యూటీకి మూడు చోట్లా చేసిన పాత్రలే కెరీర్‌లో ఎదిగేలా ‘కీర్తి’ని సంపాదించి పెట్టాయి. కీర్తికి చిన్న తనం నుంచే నటనే ఎంతో ఇష్టమట. అందులో భాగంగానే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అయితే సినిమాల్లో చేరి నటించి హీరోయిన్ అవ్వాలన్నది తన బలమైన కోరిక. ఆ కోరికనే తన తల్లిదండ్రుల వద్ద చెబితే వాళ్లు వద్దంటే వద్దు అని తెగేసి చెప్పారట. కీర్తి సురేష్ తల్లి మేనక ఒకప్పుడు రజనీకాంత్ సరసన నటించింది. తండ్రి సురేష్ మలయాళంలో పేరున్న నిర్మాత. అయినప్పటికీ హీరోయిన్ కావాలన్న కూతురి కోరికను నిరాకరించారు. ఈ విషయానే్న కీర్తి తన స్నేహితుల వద్ద చెప్పుకుంటూ తెగ బాధపడిపోయేదట. ఆమె స్నేహితులరాళ్ల ద్వారా బాధపడిపోతున్న కూతురి విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎట్టకేలకు ఓకే చెప్పారట. అలా ఈ అమ్మడు కథానాయికగా అడుగుపెట్టింది. కోలీవుడ్‌లో ‘ఇదుఎన్న మాయం’ చిత్రంతో రంగం ప్రవేశం చేసింది కీర్తి. ఆ తర్వాత నటించిన ‘రజనీ మురుగన్’, ‘రెమో’ చిత్రాలు ఆమెను క్రేజీ తారల జాబితాలో చేర్చాయి. విజయ్ జంటగా నటించిన ‘్భరవా’ చిత్రం తర్వాత కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది. అలాగే తెలుగులో నటించిన ‘నేను శైలజ’, ‘నేను లోకల్’ సినిమాల విజయంతో కీర్తి సురేష్‌కు ఎంతగానో పేరు వచ్చింది. తాజాగా సూర్యకు జోడీగా నటించిన ‘తానాసేర్న్ దకూటం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. విశాల్‌తో మరో చిత్రంలో నటించడానికి రెడీ అయింది. ఇలా వరుస ఆఫర్లతో కెరీర్‌లో మంచి ఊపుమీదుంది. ‘రాబోయే చిత్రాల్లో నావి మంచి పాత్రలు. అవి విడుదలైతే నా స్థాయిని ఊహించడం ఎవ్వరి తరం కాదు’ అంటోంది. అదీ..‘కీర్తి’ అంటే! వాహ్..!
*