Others

మార్పు అక్కడి నుంచే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాతంత్య్ర ఉద్యమంలో తరగతి గది కేంద్ర బిందువయ్యింది. తరగతి గదే ఏ మార్పుకైనా దోహదపడుతుంది. తరగతి గది గతంకన్నా భవిష్యత్తువైపునకే చూసే ముందుచూపుగలది. భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ప్రతి రాజకీయ నాయకుడు తన ఆలోచనలను మాధ్యమాల ద్వారా ప్రజల ముందు పెట్టారు. కానీ, వీరందరికీ సమన్వయకర్తగా అంబేద్కర్ నిలిచారు. రాజ్యాంగ రచన బాధ్యత ఆయనకు అప్పగించారు. అంబేద్కర్ ఉన్న సమాజం లోపాలు చెప్పే బదులు ఎలాంటి సమాజం కావాలో చెప్పాడు. నిన్నటికన్నా రేపటి గురించి సిద్ధాంతీకరణ చేసేవాడే తన తర్వాత తరంలో బతుకుతాడు. ‘‘తరగతి గది భవిష్యత్‌కు రోడ్‌రోలర్’’ అని అంబేద్కర్ ఒక్కమాటలో చెప్పాడు. దానిలో ఎంతో లోతైన అర్థాలు ఇమిడి ఉన్నాయి. ఉన్న సమాజం కంటే కొత్త సమాజం నిర్మించేటపుడు తరగతి గది ప్రాముఖ్యత చాలా ఉంటుంది. కానీ అది కష్టాలతో కూడుకున్నదని కూడా అంటారు. మార్పు కోరేవారు ఎంత పట్టుదలతో చేస్తారో, మార్పును నిరోధించేవారు కూడా అంతకంటే రెట్టింపు శక్తితో దాన్ని నిరోధిస్తారు. కాబట్టి అంతర్ శక్తులను నిరోధించటానికి కూడా తరగతి గదిని సన్నద్ధం చేయాలి. అందుకే ‘తరగతి గదికి సైంటిఫిక్ టెంపర్’ ఉండాలని ఆయన చెప్పాడు. ఉపాధ్యాయునికి గీటురాయి హేతుబద్ధత కావాలి. కానీ గత సంస్కృతి కాకూడదు. పురాణాలు, కావ్యాలలో గత సంస్కృతి గొప్పదే కావచ్చును. అది గత సమాజ నిర్మాణానికి ఉపయోగపడిన పరికరం. భవిష్యత్తు నిర్మాణానికి నేటి తరం ఆధునిక ఆలోచనలే ప్రధానం. అది కూడా సామూహిక ఆలోచన కావాలి. దానికి కావాల్సిన వ్యవస్థను కూడా తరగతి గదిలో నిర్మించుకోవాలని ఆయన సూచించాడు. తరగతి గదికి మార్గదర్శి భారత రాజ్యాంగానికి అందులో చెప్పిన జీవించే హక్కు, చదువుకునే హక్కు, ఆహార భద్రత, సమత్వ నిర్మాణాలే తరగతి గది లక్ష్యాలు.
సెల్ఫ్ స్టడీ
కొన్నిసార్లు తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాట్లాడడు. పిల్లలు మాట్లాడరు. తరగతి గది అంతా గంభీరంగా ఉంటుంది. ఈ స్థాయిని జ్ఞానస్థాయి అంటారు. ఈ స్థితిలో ప్రతివారు తనకు తానుగా తనలోనే మాట్లాడుకుంటారు. దానినే సెల్ఫ్ స్టడీ అంటారు. లేదా ఉపాధ్యాయుని పునశ్చరణ స్థాయి అంటారు. నీకు నువ్వే అర్థం చేసుకో అని అర్థం. ప్రతివారు విమర్శనాత్మకంగా చేసుకుంటారు. చెప్పిన పాఠాన్ని విద్యార్థి అంతర్ముఖి అయి తనకు తానే బోధించుకుంటారు. అనగా తనే టీచరు తనే లెర్నరు. మేధస్సు పనిచేస్తూనే ఉంటుంది. గుండె కొట్టుకుంటూనే వుంది. లక్ష్యాలు నిర్మించబడుతూనే వుంటాయి. కొత్త ఆవిష్కరణలకు పునాది పడుతూనే వుంటుంది. అదే టీచింగ్ అండ్ లెర్నింగ్‌ల సంయోగం. ఈ రెండింటి యొక్క సంయోగంవలననే అవగాహన పెరుగుతుంది. కాబట్టే టీచింగ్ అండ్ లెర్నింగ్ సంయోగ ప్రక్రియకు ఉభయులూ పాత్రధారులే. ఒకరిని ఒకరు డిస్టర్బ్ చేయరు. దీనినే ఏకాంతపు విద్య (లెర్నింగ్) అంటారు. దీనినే మనం ప్రోత్సహించాలి. ఈ మధ్య యుజిసి బృందం ఒక పర్యవేక్షణకు సి.వి.ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకొచ్చింది. పిల్లలకు సెల్ఫ్ స్టడీకి ఎన్ని గంటలు కేటాయిస్తారని యాజమాన్యాన్ని అడిగారు. విద్యార్థి తనను తాను అర్థం చేసుకోవటానికి ఎన్ని గంటలు కేటాయిస్తారని అడిగారు. అదే విద్యార్థి క్యారెక్టర్ (శీలం)కు బీజం వేస్తుంది.

-డా.చుక్కా రామయ్య