Others

భూతాపం.. శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగోళంపై 71 శాతం నీరే నిండి వుంది. ఈ నీటిలో అధిక భాగం సముద్ర జలాలే. ఈ సముద్ర జలాలే భూగోళంపై వాతావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్‌లో 50 నుండి 85 శాతం సముద్ర జలాలనుండే వస్తుంది. భూ ఉపరితలంపై వేడినీ, కార్బన్ డైయాక్సైడ్‌నీ పెద్ద మొత్తంలో గ్రహించుకోవడం ద్వారా భూమీద వాతావరణాన్ని సాగర జలాలు చల్లబరుస్తాయి.
అయితే మితిమీరిన పారిశ్రామికీకరణ ఫలితంగా భూ ఉపరితల వాతావరణంలో నిండిపోతున్న అనేక రకాల విషవాయువులు సాగర జలాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీనివల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇది సాగర జలాలలోని మత్స్య సంపదపై తీవ్రప్రభావం చూపుతోంది. పెద్ద సంఖ్యలో చేపలు చనిపోతుండగా మిగిలినవి చిక్కి శల్యమవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సాగర జలాల జీవరాశులపై జరిపిన పరిశోధనలో తేలిందేమంటే ఎన్నో రకాల మత్స్య జాతులకు చెందిన చేపలు దాదాపుగా అంతరించిపోయాయి. సోల్, హెర్రింగ్, హెడోక్ట్ జాతులకు చెందిన చేపలు బాగా బక్కచిక్కిపోయాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులు నానాటికీ పెరిగిపోతున్న భూ ఉపరితల ఉష్ణోగ్రతలే ఇందుకు కారణం. ‘2050 వచ్చేనాటికి సముద్రంలో జీవించే సుమారు 600 జాతుల చేపల శరీర పరిమాణం 14 నుండి 24 శాతానికి కుంచించుకుపోనున్నాయి. ఇప్పటికే సాగర జలాలలో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల ఎన్నో జాతుల చేపలు అంతరించిపోయాయి’ అని విలియం చేవుంగ్ 2013లో ప్రచురించిన ఒక పరిశోధన పత్రం పేర్కొంటోంది. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకి చెందిన ఈయన నిస్పోన్ ఫౌండేషన్స్ నేరూస్ ప్రోగ్రాంకి సైన్స్‌డైరక్టర్‌గా వుంటున్నారు. విలియం చేవుంగ్ మరియు ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఓషన్ అండ్ ఫిషరీస్‌కి చెందిన డేనియల్ పౌలీలు సంయుక్తంగా వెలువరించిన ఒక అధ్యయన పత్రం ‘గ్లోబల్ చేంజ్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పత్రం ‘గిల్-ఆక్సిజన్ లిమిటేషన్ థియరీ’ గురించి వివరించింది. దీని ప్రకారం 2013లో విలియం చేవుంగ్ పేర్కొన్న అంచనాలకంటే సముద్రంలోని మత్స్య జాతులు అంతరించిపోతున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకి చెందిన శాస్తవ్రేత్తలు కనుగొన్నది ఏమిటంటే సముద్ర జలాలలో ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ సెల్సియస్ పెరగడంవల్ల చేపల శరీర పరిమాణం 20 నుండి 30 శాతం తగ్గిపోతోంది. చిక్కిన చేపల్ని తిని బతికే పెద్ద చేపలపైన కూడా ఈ ప్రభావం వుంటోంది.

- దుగ్గిరాల రాజకిశోర్