Others

కూతురా! వర్ధిల్లు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడుకంటే వెండికొండ, కూతురో గుదింబడని
కొడుకైతే వంశవృద్ధనీ, కూతురైతే వంశలద్దియని
కొడుకు నరకం దాటించునని, కూతురైతే ముంచునని
కొలదిబుద్ధి గల్గినట్టి తండ్రులబుద్ధి ప్రమాదపు అడకత్తి
కొడుకైతే సంపత్తి కూతురో కొవ్వొత్తను భావనుత్తసుత్తి
ఇరువురిని వేరుచేసి పెంచావా! జరుగు తగు శాస్తి
కూతురుండు ఇల్లంటే మమతలను పెంచేటి కోవెల
కూతురుతో ప్రవహించును సంతోషాలు గలగలలు
గుండెలపై కుంపటని కూతురుని తలచావో!
ఆడదంటే శక్తియన్న విషయాన్ని మరిచావో!
కూతురిపై వివక్షను బుద్ధిమరచి చూపావో!
అదితప్పు.. కలుగు ముప్పు
కూతురి ప్రతిభను మెచ్చాలి
క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాలి
విలువలతో పెంచాలి..ప్రగతి శిఖరాన ఉంచాలి..
*
-చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు
(రేపు కూతుళ్ల దినోత్సవం సందర్భంగా...)