Others

ఎక్కువ పేజీలు.. తక్కువ ముచ్చట్లు ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రంగంలో నిర్మాత బి నాగిరెడ్డి గురించి తెలియనివారు ఉండరు. దక్షిణ భారతదేశంలోనే కాదు హిందీ చిత్రాల నిర్మాతగా యావత్ భారతదేశానికి ఆయన తెలుసనటం సత్యదూరం కాదు. విజయా ప్రొడక్షన్స్ అధినేతగా, విజయ హాస్పటల్ రూపకర్తగా, విజయచిత్ర, చందమామలాంటి పత్రికల స్థాపకుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నాగిరెడ్డి సేవలు అందరికీ తెలిసిందే. అయితే ఆయన కుమారుడు విశ్వనాథరెడ్డి వ్రాసిన ‘నాన్నతో నేను’ పుస్తకంలో ఇంకొన్ని వివరాలు, చాలామందికి తెలీని విషయాలను పొందుపర్చటం జరిగింది. 275 పేజీలుగల పుస్తకంలోని 37 శీర్షికలలోగల వ్యాసాల్లో ముఖ్యంగా మిస్సమ్మ- మాయాబజార్ నిర్మాణ విశేషాలు (పేజీ 110), కృష్ణ పాత్రలో నటించటానికి ఎన్టీఆర్ నిరాకరణ, తర్వాత దర్శక నిర్మాతల వివరణ బాగున్నాయి. మరొక ముఖ్య ఆకర్షణ. 1952లో జరిగిన విజయ కార్నివాల్ వివరాలు. ఈ కార్యక్రమంలో ఆరోజు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషా నటీనటుల వినోద కార్యక్రమం బహుశా ఈతరానికి అసలు తెలిసేవుండదు. అయితే ఇలాంటి అరుదైన సంఘటన వివరాలు ఇంకా ఎక్కువ ఫొటోలతో ప్రచురించివుంటే మనసుకు మరింత ఆకర్షణీయంగా ఉండేది. పుస్తకం ప్రారంభంలోని మొదటి ఆరు శీర్షికలలో నాగిరెడ్డి కుటుంబం, పూర్వీకుల వివరాలు ఫొటోలతో సహా ప్రచురించటం బాగానే వుంది. కానీ రచయిత ఇతర వ్యాసాలతో నాగిరెడ్డి గురించి, వారి సినిమా అనుబంధం గురించి మరింత వివరంగా రాసివుంటే బాగుండేది. ప్రచురించిన ఫొటోలు అంతంత మాత్రంగానే వున్నాయి తప్ప ఆకర్షణీయంగా లేవు. రచయిత భాష కూడా చదువరులకు ఆసక్తి కలిగించేలా కొత్త విషయాలతో వుంటే మరింత బాగుండేదేమో. రచయిత నాగిరెడ్డి సొంత కుమారుడే అయినా ఆయనకంటే పాఠకులకే ఎక్కువ విషయాలు తెలిసి ఉండచ్చేమో అనిపించింది పుస్తకం చదువుతుంటే. చందమామ, విజయచిత్ర లాంటి ప్రసిద్ధి చెందిన పుస్తకాల ముద్రణ సంస్థ యజమాని గురించి వచ్చిన పుస్తకంలో ముద్రించిన ఫొటోలు చూడముచ్చటగా లేవు. వివరాలు చదివి భద్రపర్చుకోవాలని అనిపించినా, చిత్రాలను చూశాక అలాంటి ఆసక్తి మాయమవుతుంది, ప్రచురితమైన ఫొటోలు చూస్తుంటే. ఏదేమైనా నాగిరెడ్డి జీవిత చరిత్ర చదువుదామని ఆసక్తి చూపినవారు ఈ పుస్తకం చూసి నిరుత్సాహపడే ప్రమాదం ఉంది.

ప్రచురణ:
విజయ పబ్లికేషన్స్
విజయా గార్డెన్స్,
31, యన్‌యస్‌కె శాలై,
చెన్నై- 600 026.

-పర్చా శరత్‌కుమార్