Others

శరవేగంగా తెలంగాణ ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించడంలో ఇది జాతీయ సగటును అధిగమించింది. అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (అసోచామ్) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టం చేసింది. పెట్టుబడిదారులను ఆకర్షించే విధానాలవల్ల ఈ అద్భుతం సాధ్యమైందని పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాంతం 3.30 లక్షల కోట్ల స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి 5.97 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిపడ్డాయని ఆ నివేదిక పేర్కొంది. ఆర్థిక ప్రగతి- పెట్టుబడుల ప్రభావం అన్న అంశంపై జరిగిన అధ్యయనం వివరాలను అసోచామ్ నేషనల్ సెక్రటరి డి.ఎస్.రావత్, సీనియర్ మేనేజింగ్ కమిటి సభ్యుడు బాబులాల్ జైన్ వివరించారు. 2011-12లో 2.7 శాతం అభివృద్ధిని సాధించిన తెలంగాణ 2016-17 ఆర్థిక సంత్సరంలో 8.5 శాతం ఆర్థిక ప్రగతి సాధించిందని వారు చెప్పారు. ఇదే సమయంలో జాతీయస్థాయిలో ఆర్థికవ్యవస్థ ప్రగతి 5.4 శాతం నుండి 6.6 శాతానికి చేరుకుందని ఆ అధ్యయనంలో తేలింది. 2017 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 28 శాతం నీటిపారుదల రంగానికి ఆర్థికేతర రంగాలకు 25 శాతం, ఉత్పాదక రంగానికి 11 శాతం వచ్చాయని తేల్చింది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ సగటు అభివృద్ధి 79శాతం కాగా జాతీయ సగటు 27 శాతం మాత్రమే. వ్యవసాయ రంగంలో 15 శాతం అభివృద్ధి నమోదైంది. నిజానికి ఈ రంగంలో గడచిన రెండేళ్లలో అభివృద్ధి వ్యతిరేక దిశలో సాగింది. సేవలరంగంలో 10 శాతం, పారిశ్రామిక రంగంలో 4.1 శాతం అభివృద్ధి నమోదైంది. కాగా రాష్ట్రంలో అమలు చేస్తున్న 370 ప్రాజెక్టుల్లో 4 కోట్ల లక్షల రూపాయల పెట్టుబడులు రాగా వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ గడచిన మూడేళ్లలో 68.5 శాతం అభివృద్ధిని నమోదు చేసింది. జాతీయ సగటు కేవలం 20.8 శాతం మాత్రమే. దేశం మొత్తంమీద వచ్చిన పెట్టుబడుల్లో తెలంగాణ రాష్ట్రం వాటా 3.3 శాతం (177 లక్షల కోట్ల రూపాయలు)గా ఉంది. మొత్తంమీద పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే విధానాలను అమలు చేయడం, సరళతర విధానాలను త్వరితగతిన అమలు చేస్తూండటంతో తెలంగాణ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా స్థిరమైన ప్రగతి, పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు తెలంగాణతో పోటీపడ లేకపోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

-్భరతి