Others

ఏ బ్యాగు బాగుంటుంది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనువైన హ్యాండ్‌బ్యాగ్ సౌకర్యవంతంగానే కాదు, అతివల అందాన్ని కూడా పెంచుతుంది. మార్కెట్‌లో రకరకాల హ్యాండ్‌బ్యాగులు లభిస్తున్నా- వాటిలో అవసరానికి తగ్గట్టు అందమైన, నాణ్యమైన దానిని ఎంచుకోవడంలోనే అసలు నైపుణ్యం దాగి ఉంటుంది. హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంచుకోవడంలో తగిన అవగాహన, మెళకువలు ఎంతో అవసరం. ఒకప్పుడు షాపులకు వెళ్లి కొనుక్కోవలసి వచ్చే ఏ వస్తువునైనా ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొనడం, అది నేరుగా మన ఇంటికి రావడం చూస్తున్నాం. ఎంత ఆన్‌లైన్‌లో కొంటున్నా హ్యాండ్‌బ్యాగ్‌ల ధరలు, రంగులు, సైజులు, నాణ్యత వంటి విషయాల్లో శ్రద్ధ చూపాలి. పలురకాల హ్యాండ్ బ్యాగ్‌లు లభిస్తున్నా లెదర్ అంటేనే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇవి మాత్రమే మంచి ‘లుక్’తో హుం దాగా ఉంటాయి. ఆకారంలో చిన్నవిగా కనిపించినా లెదర్ బ్యాగ్‌లు ఎక్కువ లగేజీని మోయగలవిగా ఉంటాయి. నకిలీ లెదర్ బ్యాగుల విషయంలో జాగ్రత్తలు అవసరం. నాసిరకం లెదర్ బ్యాగులకు కూడా కళ్లు చెదిరే రంగులు అద్దిఉంటాయి. కొన్ని రోజులు వాడితే చాలు రంగులు వెలసిపోయి బ్యాగ్‌లు అసహ్యంగా కనిపిస్తాయి. వీటిని కొనేముందు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆ తర్వాత విచారించినా ప్రయోజనం శూన్యం.
హ్యండ్ బ్యాగ్‌కు వేసిన స్పేర్‌పార్ట్స్‌ను సైతం పరిశీలించాలి. ఎక్కువ కాలం పాటు మనే్నవి ఎన్నుకోవాలి. జిప్, లాక్ వంటివి నాణ్యమైనవి వాడితే ఎక్కువకాలం మన్నుతాయి.
పుస్తకాలు, లంచ్ బాక్స్, సౌందర్య సాధనాలు.. ఇలా ఏ అవసరం తీర్చడానికి హ్యాండ్ బ్యాగ్ కొంటున్నామో దృష్టిలో పెట్టుకుని మోడరన్ ‘స్టైల్’లో నాణ్యమైనవి ఎంచుకోవడం ఉత్తమం. మామూలుగా వాడే హ్యాండ్ బ్యాగ్‌లైతే అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటాయి.
రకరకాల ఆకారాలు, పలు సైజుల్లో ఉండే బ్యాగ్‌లు పొడుగ్గా ఉన్నవారికి పెద్ద సైజులో, పొట్టిగా కనిపించేవారికి చిన్న సైజులో ఎక్కువ కంపార్ట్‌మెంట్‌లు వుండేవి అందంగా వుంటాయి.
పార్టీలు, ఫంక్షన్లలో ఉపయోగించే బ్యాగ్‌లు చిన్నవిగా హుందాగా ఉండాలి.
ఎప్పుడూ మనతోనే ఉండే బ్యాగ్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టడంవల్ల హానికరమైన బ్యాక్టీరియా, క్రిమికీటకాలు చేరే ప్రమాదం ఉంది. అందుకని విధిగా వారానికి ఒకసారైనా పూర్తిగా దులిపి ఆహార పదార్థాల వాసనలు, తేమ లేకుండా గాలిలో ఆరనివ్వాలి.

ఎం.కె.