Others

గులాబీ వర్ణంపై మగువల మక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనానందం కలిగించే వర్ణాలెన్నో ఉన్నప్పటికీ భారతీయ మహిళలు ప్రత్యేకించి గులాబీ రంగంటే తెగ మోజుపడుతున్నారని తాజాఅధ్యయనంలో తేలింది. సంప్రదాయ దుస్తులైనా, ఆధునిక డ్రెస్సులైనా గులాబీ రంగులో ఉంటే తమకెంతో ఇష్టమని చాలామంది మగువలను వారి మనోగతాలను సర్వే సందర్భంగా ఆవిష్కరించారు. రోజువారీ దుస్తులైనా గులాబీ వర్ణంలో ఉండాలని దాదాపు 29 శాతం మంది భారతీయ మహిళలు కోరుకుంటున్నట్లు ‘క్రాఫ్ట్స్‌విల్లా డాట్ కామ్’ అనే వెబ్‌సైట్ చెబుతోంది. దుస్తుల రంగులపై అతివల అంతరంగాన్ని తెలుసుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. పసుపు, ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ రంగులపైనా ఆసక్తి ఉన్నప్పటికీ గులాబీ (పింక్) వర్ణం అంటే ఎక్కువ మంది స్ర్తిలు ముచ్చటపడుతున్నారు. గులాబీ తర్వాత ఎక్కువ మంది నీలం రంగు అంటే ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది. భారతీయ సంప్రదాయంలో విభిన్న వర్ణాల దుస్తులకు ఆదినుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. నలుగురిలోనూ భిన్నంగా కనిపించాలన్న తపనతో పండుగలు, పెళ్లిళ్లు, విందులు, వినోదాల సందర్భంగా రంగురంగుల దుస్తులను ధరించాలని మగువలు ఆరాటపడుతుంటారు. రోజువారీ ధరించే దుస్తులకు, ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే దుస్తులకు మహిళల ఇష్టాయిష్టాల్లో వ్యత్యాసం ఉంటోంది. ఇటీవలి కాలంలో మెరూన్, బంగారు రంగు దుస్తులపైనా క్రమంగా మోజు పెరుగుతోంది. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో ఈ రంగుల దుస్తులకు ముఖ్యంగా యువతుల్లో ఆదరణ పెరుగుతోంది. రంగుల మేళవింపుతో సరికొత్త రకాల చీరలు, డ్రెస్సులు మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నప్పటికీ గులాబీ రంగుకు మాత్రం ప్రాధాన్యత చెక్కుచెదరకుండా ఉంది.