AADIVAVRAM - Others

ఒక్క తలవెంట్రుకే అతని కుంచె (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అయితే చాలా మంది ఆ విషయాన్ని గుర్తించరు. ఎవరైనా ఏదైనా సాధించారంటే వారేదో పైనుండి దిగి వచ్చినట్లు భావిస్తూ తమను తాము తక్కువ చేసుకుని సాదాసీదాగా బతికేస్తూ ఉంటారు. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలకి చెందిన ముకేష్‌థాపా మాత్రం అటువంటి వాడు కాదు. అతనో అరుదైన ప్రతిభ గల చిత్రకారుడు. సాధారణంగా చిత్రకారులంటే వారు చక్కటి కుంచెతో అంతకంటే చక్కటి చిత్రాలను రూపొందిస్తూ ఉంటారు. ముకేష్ మాత్రం విచిత్రంగా చిత్రాలు గీయడానికి ఎలాంటి కుంచె వాడడు. సన్నని ఒకే ఒక్క తలవెంట్రుకను వర్ణాల్లో ముంచి, రంగులద్దుతూ ఓపిగ్గా బొమ్మలను తీర్చిదిద్దుతాడు. చూడడానికి విచిత్రంగా ఉన్నా అలా చూస్తుండగానే కాన్వాస్‌పై అద్భుత చిత్రరాజాలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి. అదే అతని టాలెంట్.
అతను బొమ్మ వేయాల్సిన ప్రతిసారీ తన తలలోని వెంట్రుకని పీకి దాంతోనే చిత్రరచన చేస్తాడు. వినడానికి, చూడడానికి ఆషామాషీగా అనిపించినా, అతను వేసే చిత్రాలు మాత్రం ఆషామాషీవి కాదు. అతను గీసిన చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల్లో చోటు సంపాదించుకుని వీక్షకుల మన్ననలు అందుకున్నాయి. అలా అతను పాల్గొనే ప్రతి ఎగ్జిబిషన్‌లోను అతను గీసుకున్న తన రంగుల చిత్రం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అతను ఇప్పటి వరకు ఆరు వందల వరకు రంగుల చిత్రాలను గీసాడు. అన్నీ ఒకే ఒక్క తల వెంట్రుకతో గీసినవే. అయితే వాటిని చూస్తే మనకే మాత్రం తేడా తెలియదు. అవి చేయి తిరిగిన చిత్రకారుడు ఎవరో, అద్భుతమైన కుంచెతో గీసిన చిత్రరాజాల్లా అనిపిస్తాయి. అంతటి నైపుణ్యవంతుడు ముకేష్. అరుదైన అతని టాలెంట్‌ని గుర్తించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అతని పేరును రికార్డు పుస్తకంలోకి ఎక్కించారు. తన చిత్రరచనా విధానం గురించి ముకేష్ మాట్లాడుతూ మామూలు బ్రష్‌తో గీసే చిత్రాలకు ఒకే ఒక్క తల వెంట్రుకతో గీసే చిత్రాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని చెబుతాడు. తాను ఒక్కో చిత్రాన్ని పూర్తి చేయడానికి కనీసం ఆరు మాసాల సమయం తీసుకుంటానని చెబుతున్నాడు. ఓపిక, సహనం, పరిసరాల పరిశీలన, మానసిక ప్రశాంతత వంటి అంశాల కలబోతతో తాను చిత్రాలు గీస్తుంటానని చెబుతున్నాడు. ఇటీవల అతను ఆన్‌లైన్ కాంపిటీషన్‌లో నిర్వహించిన చిత్రరచన పోటీల్లో ‘బోల్డ్ బ్రష్ అవార్డు’ను దక్కించుకున్నాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్