Others

సంస్కారానికి రూపం.. చెరగని స్ఫూర్తితేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన పేరు పోలూరి హనుమజ్జానకీ రామశర్మ. వేలాదిమందికి ఆయన ఆచార్య దేవుడు... సనాతన జాతీయ సాంస్కృతిక సాహిత్య ప్రపంచంలో ఆయన అజరామరుడు! ‘ప్రసిద్ధి’ అన్నది సాపేక్షం! కొన్ని జీవనరంగాలలో సుప్రసిద్ధులైన వారు మరికొన్ని జీవన రంగాల వారికి తెలియకపోవడం సామాజిక వైచిత్రి! అన్ని రంగాలలోని ప్రసిద్ధులకూ అన్వయవౌతున్న సామాజిక వైచిత్రి ఇది... అందువల్ల ‘ప్రసిద్ధి’కి నిర్దిష్టమైన నిర్దుష్టమైన గీటురాయి లేదు. కాని, విశుద్ధ జీవన ప్రవృత్తికి నిర్దిష్టమైన, నిర్దుష్టమైన గీటురాయి ఉంది! ఎనబయి ఏళ్లపాటు విశుద్ధ జీవన ‘సస్య’ సంస్కారాలను పండించిన సాంస్కృతిక సాహితీ కృషీవలుడు హనుమజ్జానకీ రామశర్మ.. నిరంతర శ్రమజీవనుడు! ‘మహాయజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తనుః...’ అన్నది ఆర్ష విజ్ఞాన నిధులు చెప్పిన మాట! హనుమజ్జానకీ రామశర్మ ఒక్కొక్క కావ్య రచనను ఒక ‘యజ్ఞం’గా నిర్వహించిన అభినవ ఋషి... ‘‘యజ్ఞాలు చేయడం వల్ల మానవుడు బ్రహ్మ విజ్ఞాన మూర్తిగా మారుతున్నాడు..’’ అన్న ఈ సనాతన సూత్రం హనుమజ్జానకీ రామశర్మ జీవన ఫ్రస్థానంలో ప్రస్ఫుటించింది... ఆయన బ్రాహ్మీమయమూర్తి! ఆయన జన్మించి నేటికి తొంబయి మూడేళ్లయింది, పదమూడేళ్లక్రితం ఆయన పార్థివ శరీర పరిత్యాగం చేశారు! కానీ వేలాది శిష్యుల హృదయాలలో హనుమజ్జానకీ రామశర్మ సజీవ ధార్మిక విగ్రహం.. ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ అన్న ఆదికవి వాల్మీకి మహర్షి నిర్ధారణకు జానకీరామశర్మ అభినవ రూపం... ధార్మిక శ్రమ జీవన నిష్ఠుడైన కర్మణ్య స్వరూపం! రఘురాముడు ఈ ‘వైవస్వత మన్వంతరం’లోని ఇరవై నాలుగవ ‘‘మహాయుగం’’లోని త్రేతాయుగానికి చెందినవాడు. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం నడుస్తోంది. యదుకుల కృష్ణుడు ఈ ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని ద్వాపరయుగం చివర జీవించాడు! అంటే కృష్ణుడు ఐదువేల నూట పంతొమ్మిది సంవత్సరాల పూర్వం జీవించాడు! యదుకుల కృష్ణుడు ‘దివం’గతుడైన వెంటనే ‘ద్వాపరం’ ముగిసి కలియుగం ఆరంభమైంది! రఘురాముడు నాలుగు మహా యుగాలకు పూర్వుడు. అంటే ఇప్పటికి దాదాపు కోటి ఎనబయి ఒక్క లక్షల నలబయి తొమ్మిది వేల ఏళ్లకు పూర్వం రఘురాముడు జీవించాడు! ఎందుకంటె ఒక మహాయుగం వయస్సు నలబయి మూడు లక్షల ఇరవై వేల ఏళ్లు! నాలుగు యుగాల మొత్తం, ఒక మహాయుగం! రఘురాముడు వనవాసంలో సైతం ఒక్కపూట కూడ ‘సంధ్యావందనం’ మానలేదు. యదుకుల కృష్ణుడు, కురుకుల అర్జునుడు యుద్ధరంగంలో సైతం సంధ్యావందనం చేయడం మానలేదు... పోలూరి హనుమజ్జానకీ రామశర్మ త్రికాల సంధ్యావందన నిష్ఠుడు... ఇదీ సనాత సంస్కారం కొనసాగుతున్నతీరు...
సంధ్యావందనం చేయడం మానవ జీవన వౌలిక సంస్కారమన్నది హనుమజ్జానకీరామశర్మ జీవనప్రస్థానం నేర్పిన పాఠం. కలియుగం 5026 ఆశ్వయుజ మాసం - క్రీస్తుశకం 1924 అక్టోబర్ -లో ఆయన జన్మించిన నాటికి ఈ వౌలిక సంస్కారం గ్రహణగ్రస్తమై ఉంది! ‘‘్ధర్మాదర్థశ్చ కామశ్చ కిమర్థం నోపసేవ్యతే..?’’ అని కలియుగం ఆరంభంలో వేదవ్యాసుడు ఆందోళనకు గురి అయ్యాడు. -్ధర్మాన్ని ఆచరించనిచో దానివల్ల ప్రయోజనం ఏమిటి?? అన్నది వేదవ్యాసుని ప్రశ్న! ఈ ప్రశ్న సహస్రాబ్దులుగా వినబడింది. ధర్మాన్ని ఆచరించి చూపిన వేలాది కారణజన్ములు ఈ ప్రశ్నకు మానవరూపంలోని సమాధానాలు. జానకీరామశర్మ అలాంటి కారణజన్ముడు! ‘‘యద్యదాచరితి శ్రేష్ఠః తత్తదేవేతరోజనాః’’ అన్నది యదుకుల కృష్ణుని నిర్ధారణ.. ‘‘శ్రేష్ఠులైన వారు ఆచరించిన దానిని ఇతరులు ఆచరిస్తారు...’’ అలా ఆచరించిన శ్రేష్ఠుడు జానకీరామశర్మ, నెల్లూరు ‘వెంకటగిరి రాజా కళాశాల’లో తెలుగు ఉపన్యాసకునిగా, ప్రాచ్యభాషల విభాగం అధిపతిగా ముప్పయి ఏళ్లకు పైగా ఆయన పనిచేసిన సమయంలో ఈ శ్రేష్ఠత్వాన్ని వందలాది విద్యార్థులు గుర్తించి ఉండవచ్చు, కానీ నిత్యజీవన చర్యలో ప్రస్ఫుటించిన ధార్మిక నిష్ఠ వేలమందికి వెలుగుబాట! ధర్మప్రచారకులకు కొరతలేదు... ధర్మాచరణ జీవనులు కావాలన్నది వేదవ్యాసుని నిర్దేశం. అలాంటి ధర్మాచరణ జీవనుడు జానకీరామశర్మ.. ధర్మాచరణకు సంధ్యావందనం చేయడం వౌలిక లక్షణం! కులమతాలతో నిమిత్తం లేకుండా మానవులందరూ సంధ్యావందనం చేయాలన్నది వేదశాస్త్ర నిర్దేశం.. సంధ్యావందనం సమయపాలనం, సమయపాలన చేయగలగడం అనుశాసనబద్ధ జీవన ప్రస్థావన క్రమానికి నిదర్శనం. భౌతిక ప్రగతికి సాంస్కృతిక సుగతికి అనివార్యం.. సకల జీవరాసిలో ప్రాకృతికమైన సమయపాల స్వభావం నిహితమై ఉంది! సూర్యునికంటె ముందు అవి మేల్కొంటాయి! ‘ఆధునికత’ పేరుతో పాశ్చాత్య దాస్యం ఆవహించని భారతీయ గ్రామీణులు ఇప్పటికీ ‘సంధ్యావందనం’ చేస్తున్నారు. సమయ పాలన చేస్తున్నారు! సూర్యుని కంటే ముందు నిద్రలేచిన కర్షకులు, ఉదయించే సూర్యునికి అంజలి ఘటించడం ‘సంధ్యావందనం’. అస్తమించబోయే రవి బింబానికి మొక్కి దున్నుతున్న నాగలిని విప్పడం సంధ్యావందనం... పార్వతిని పెళ్లి చేసుకున్న పరమశివుడు హిమాలయాలలో ప్రేమయాత్ర -హనీమూన్- చేయడం సృష్టి ఆరంభం నాటి ముచ్చట! సూర్యుడు అస్తాద్రికి సమీపించడంతో కొత్త పెళ్లికొడుకైన శివుడు ప్రణయ భాషణలకు స్వస్తిచెప్పి ‘సంధ్య’కు ప్రణమిల్లాడు. జగజ్జనని కూడ ధ్యాన నిమగ్న అయింది... ఇదీ సనాతన సంస్కారం. ధర్మబద్ధమైన ఆర్థిక జీవనం, ధర్మబద్ధమైన కామం.. ఈ ధర్మనిబద్ధత జన్మపరంపరకు హేతువు కావడం మాధ్యమం, మోక్షం లభించడం పరమ లక్ష్యం.. సంధ్యావందనం మానసిక బౌద్ధిక శారీరక వ్యాయామం.. ఆత్మసాక్ష్యాత్కార మార్గం! సృష్టి ఆరంభంలో పరమ శివుడు చూపిన ఆదర్శం ఇది.. సమకాలం జానకీరామశర్మ నిలబెట్టిన ఆదర్శం ఇది!
జానకీ రామశర్మ బ్రహ్మ విద్యాచార్యుడు! ఆది శంకరాచార్యుడు రచించిన ప్రస్థాన త్రయ అద్వైత వేదాంత భాష్యాన్ని పాఠం చెప్పిన వాడు. ఇలాంటి బ్రహ్మవిద్యాచార్యులు వేళ్లమీద లెక్కపెట్టతగినంత తక్కువ సంఖ్యలో ఉన్నారు! బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత - ఈ మూడు విముక్తి పథాన్ని నిర్దేశిస్తున్న ప్రస్థాన దీపాలు. వేదాంతానికి మూడు రూపాలుగా వికసించిన ఈ ప్రస్థాన త్రయ గ్రంథాలకు కలియుగం ఇరవై ఏడవ శతాబ్ది -క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్ది- లో జీవించిన ఆది శంకరాచార్యుడు అద్వైత భాష్యం వ్రాశాడు. ఇదీ బ్రహ్మవిద్య. రెండున్నర సహస్రాబ్దులుగా వేలమంది బ్రహ్మవిద్యాచార్యులు ఈ భాష్యాన్ని లక్షల శిష్యులకు బోధించారు. బ్రిటన్ దురాక్రమణ తరువాత ఈ సంప్రదాయ విజ్ఞాన సనాతన సూర్యుడు గ్రహణగ్రస్తమయ్యాడు. ఈ గ్రహణ విముక్తికి కృషి చేసిన కృషి చేస్తున్న అతి కొద్దిమందిలో జానకీరామశర్మ ఒకరు. బ్రహ్మశ్రీ చావలి లక్ష్మీకాంత శాస్ర్తీ వద్ద ఆదిశంకరుని ప్రస్థాన త్రయ ‘శారీరక మీమాంసా భాష్యాన్ని’ అధ్యయనం చేసిన జానకీరామశర్మ బ్రహ్మశ్రీయత్వం సాధించాడు, నెల్లూరులోను వివిధ ప్రాంతాలలోని సనాతన అద్వైత పీఠాల ఆశ్రమాలలోను దాదాపు యాబయి మంది శిష్యులకు జానకీరామశర్మ ఆదిశంకర భాష్యాన్ని బోధించాడు, అధ్యయనానికి అధ్యాపనకు సార్థకతను సమకూర్చాడు!
వాల్మీకి మహాకవి రచించిన సంస్కృత రామాయణ గ్రంథాన్ని ‘కథా వ్యాఖ్యాన రూపంలో తెలుగు వారికి సమకూర్చిన కారణజన్ముడు జానకీరామశర్మ! ‘శ్రీ రామాయణ తరంగిణి’ అన్న పేరుతో ఏడు సంపుటాలుగా వెలువడిన ఈ గ్రంథం వాల్మీకి రచనకు అద్దం. సంస్కృత భాష తెలియని వారికి ప్రపంచంలోనే తొలిసాహిత్య రూపమైన వాల్మీకి రామాయణం సమగ్రంగా బోధపడడానికి ఈ ‘శ్రీరామాయణ తరంగిణి’ ఆధునిక మాధ్యమం. వాల్మీకి పేర్కొన్న ‘కల్యాణ గుణాలు’ రఘురామునిలో ఎలా ప్రస్ఫుటించాయన్న చారిత్రక వాస్తవాన్ని జానకీరామశర్మ అత్యద్భుత రీతిలో ఆవిష్కరించగలిగాడు! ఈ గద్య రచన పద్యాలను చదువలేని వారికి సనాతన సంస్కృతి దీపిక! ఇదంతా సగం మాత్రమే, మరో సగం జానకీరామశర్మ రచించిన ‘శ్రీ రామాయణమ్’ అన్న చంపూ కావ్యం. పదివేల పద్యాల ఈ బృహత్ గ్రంథం జానకీరామశర్మ పాండిత్య ప్రకర్షకు కవిత్వ పటిమకు ప్రత్యక్షర సాక్ష్యం... పదివేల పద్యాల గ్రంథాన్ని ఒక కవి రచించడం ఆధునిక సాహితీ ప్రపంచంలో అరుదైన వాస్తవం!ఈ గ్రంథం వాల్మీకి కవిత్వానికి వాస్తవ ఇతిహాసానికి మరో ఆవిష్కరణ! పద్యాలు, గద్యాలు ఉన్న రచన ‘చంపువు’.... శ్రీ రామాయణ రచనకు పూర్వరంగంగా నల చరిత్రము అన్న పద్య కావ్యాన్ని జానకీశర్మ రచించాడు.
మహాభారతం, హరివంశం, మహాభాగవతం, విష్ణు పురాణాలు ఆధారంగా యదుకుల కృష్ణుని కథను కూడ జానకీరామరశర్మ తెలుగువారికి సమకూర్చాడు. ‘వాసుదేవ కథాసుధ’ అన్న ఈ నాలుగు సంపుటాల గ్రంథం కృష్ణుని జీవన ప్రస్థానాన్ని సర్వసమగ్రంగా ఆవిష్కరిస్తోంది! సనాతన భారతీయ సంస్కృతికి ఇది మరో దర్పణం... జానకీ రామశర్మ ‘్భవన విజయం’ ఎఱ్ఱాప్రగడ, నన్నయ వంటి గోష్ఠీ నాటకాలను రచించాడు, వందలాది సాహితీ సాంస్కృతిక వ్యాసాలను రాశాడు. మొత్తం యాబయికి పైగా వేదాంత, ధార్మిక, ఇతిహాస ధార్మిక గ్రంథాలను ఆయన రచించాడు! ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క సనాతన జాతీయ సంస్కారం.. భారతీయ, పాశ్చాత్య సాహిత్య కళారీతులను తులనాత్మకంగా వివరించే వారి ఆంగ్ల గ్రంథం భారత భారతికి మణిమకుటం..
నేడు విజయవాడలో జానకీరామశర్మ 94వ జయంతి ఉత్సవం జరుగుతోంది.

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352